Chicken Bun: పిల్లలకు ఎంతో ఇష్టమైన చికెన్ బన్.. ఇంట్లోనే సింపుల్‌గా చేసేయవచ్చు..

| Edited By: Ram Naramaneni

Sep 22, 2024 | 9:43 PM

పిల్లలకు బన్స్ అంటే చాలా ఇష్టం. ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఓవెన్ అవసరం లేకుండానే కుక్కర్‌లో కూడా ఈజీగా చేయవచ్చు. ఈ బన్‌లో చికెన్ పెట్టి చేస్తే ఇంకా ఎంతో రుచిగా ఉంటుంది. పిల్లలు మరింత ఇష్టపడి తింటారు. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ పఫ్స్ కంటే ఈ బన్స్ చేసుకోవడం చాలా సింపుల్. ఎవరైనా ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు కూడా చేయవచ్చు. కొద్దిగా సమయం..

Chicken Bun: పిల్లలకు ఎంతో ఇష్టమైన చికెన్ బన్.. ఇంట్లోనే సింపుల్‌గా చేసేయవచ్చు..
Chicken Bun
Follow us on

పిల్లలకు బన్స్ అంటే చాలా ఇష్టం. ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఓవెన్ అవసరం లేకుండానే కుక్కర్‌లో కూడా ఈజీగా చేయవచ్చు. ఈ బన్‌లో చికెన్ పెట్టి చేస్తే ఇంకా ఎంతో రుచిగా ఉంటుంది. పిల్లలు మరింత ఇష్టపడి తింటారు. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ పఫ్స్ కంటే ఈ బన్స్ చేసుకోవడం చాలా సింపుల్. ఎవరైనా ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు కూడా చేయవచ్చు. కొద్దిగా సమయం పట్టినా రుచి మాత్రం అదిరిపోతుంది. మరి ఈ చికెన్ బన్ ఎలా తయారు చేస్తారు? తయారు చేయడానికి ఎలాంటి పదార్థాలు కావాలో ఇప్పుడు చూద్దాం.

చికెన్ బన్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:

చికెన్ కీమా, గోధుమ పిండి, ఉప్పు, చక్కెర, బటర్, పాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం, వెల్లుల్లి తరుగు, మిరియాల పొడి, సోయా సాస్,టమాటా కెచప్, ఈస్ట్ పొడి.

చికెన్ బన్స్ తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలో పాలు వేయాలి. ఇందులోనే చక్కెర, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఈస్ట్ వేసి బాగా కలపాలి. ఈస్ట్ వేయడం వలన బన్ బాగా పొంగుతుంది. ఇప్పుడు మరో గిన్నె తీసుకుని ఇందులోనే గోధుమ పిండి, కొద్దిగా వెన్న వేసి చేతితో బాగా కలపాలి. ఈ మిశ్రమంలో ముందుగా కలిపి పెట్టుకున్న పాల మిశ్రమాన్ని కూడా వేసి మళ్లీ కలపండి. ఈ పిండిని ఓ పావు గంట సేపు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసి చపాతీ పిండిని వేసి బాగా కలపాలి. ఈ గిన్నెపై మూత పెట్టి ఉంచండి. ఇప్పుడు దీన్ని ఓ రెండు గంటల పాటు పక్కన అలా వదిలేయండి. ఇప్పుడు చికెన్ స్టఫింగ్ రెడీ చేయాలి. ఇప్పుడు మరో గిన్నెలో చికెన్ కీమా, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చి మిర్చి తరుగు, కారం, మిరియాల పొడి, వెనిగర్ ఉప్పు, పసుపు వెల్లులి పొడి, సోయాసాస్, టమాటా కెచప్ వేసి బాగా కలిపి దీన్ని కూడా అరగంట పాటు వదిలేయాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్‌ను వేసి చిన్న మంట మీద ఉడికించాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని పెద్ద పెద్ద ఉండల్లా చేసి తీసుకోవాలి. మీకు కావాల్సినంత సైజు తీసుకోండి. వీటి మధ్యలో చికెన్ కీమా పెట్టండి. మల్లీ రౌండ్‌గా చుట్టుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. ఆ నెక్ట్స్ స్టవ్ మీద లోతైన కుక్కర్ లేదా కడాయిని పెట్టి స్టాండ్ పెట్టుకోవాలి. ఆ స్టాండ్ మీద కంచాన్ని పెట్టి.. దానిపై బన్స్ ఉంచాలి. ఇప్పుడు పైన మూత పెట్టి.. రెండు నిమిషాలు ఎక్కువ మంట మీద.. ఆ తర్వాత సిమ్‌లో పెట్టి 45 నిమిషాల పాటు వదిలేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే బన్స్ సిద్ధం అవుతాయి.