Chicken Chukka: చెట్టినాడ్ స్పెషల్ ‘చికెన్ చుక్కా’ ని ఇలా చేయండి.. మళ్లీ ఇలాగే చేయమంటారు!

| Edited By: Ram Naramaneni

Nov 16, 2023 | 9:21 PM

చికెన్ తో చేయలేని వంటకాలు అనేవి ఏవీ ఉండవు. ఎందుకంటే చికెన్ తో ఏం చేసినా టేస్టీగా ఉంటాయి. స్నాక్స్, కర్రీ, వెరైటీ చికెన్ కర్రీస్, చికెన్ వేపుళ్లు ఇలా చికెన్ లో చేసే ఇలా వంటకాలే టేస్టీగా ఉంటాయి. చికెన్ తో చేసే స్పెషల్స్ లో 'చికెన్ చుక్కా' కూడా ఒకటి. ఈ చికెన్ చుక్కా చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ, పలావ్, పుల్కా, రోటీస్ ఇలా వేటితో తిన్నా.. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. ఇంటికి వచ్చే గెస్టులకు కూడా ఇది ఒకసారి చేసి పెడితే.. మళ్లీ ఇలాగే చేయమంటారు. దీన్ని వీకెండ్స్ అండ్ స్పెషల్ డేస్ లో చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ చుక్కా తయారు చేయడం కూడా ఎంతో..

Chicken Chukka: చెట్టినాడ్ స్పెషల్ చికెన్ చుక్కా ని ఇలా చేయండి.. మళ్లీ ఇలాగే చేయమంటారు!
Chicken
Follow us on

చికెన్ తో చేయలేని వంటకాలు అనేవి ఏవీ ఉండవు. ఎందుకంటే చికెన్ తో ఏం చేసినా టేస్టీగా ఉంటాయి. స్నాక్స్, కర్రీ, వెరైటీ చికెన్ కర్రీస్, చికెన్ వేపుళ్లు ఇలా చికెన్ లో చేసే ఇలా వంటకాలే టేస్టీగా ఉంటాయి. చికెన్ తో చేసే స్పెషల్స్ లో ‘చికెన్ చుక్కా’ కూడా ఒకటి. ఈ చికెన్ చుక్కా చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ, పలావ్, పుల్కా, రోటీస్ ఇలా వేటితో తిన్నా.. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. ఇంటికి వచ్చే గెస్టులకు కూడా ఇది ఒకసారి చేసి పెడితే.. మళ్లీ ఇలాగే చేయమంటారు. దీన్ని వీకెండ్స్ అండ్ స్పెషల్ డేస్ లో చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ చుక్కా తయారు చేయడం కూడా ఎంతో సింపుల్. మరి ఈ చెట్టినాడ్ చికెన్ చుక్కా తయారు చేయడం ఎలా? తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చెట్టినాడ్ చికెన్ చుక్కాకి కావాల్సిన పదార్థాలు:

చికెన్, ఆయిల్, సోంపు గింజలు, జీల కర్ర, ఉల్లి పాయలు, పచ్చి మిర్చి, టమాటాలు, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, కొత్తి మీర.

ఇవి కూడా చదవండి

చికెన్ చుక్కా తయారీ విధానం:

ముందుగా ఉల్లి పాయలు, టమాటాలు, పచ్చి మిర్చి సన్నగా కట్ చేసుకుని పక్కకు పెట్టాలి. ఇప్పుడు ఒక లోతైన కడాయి తీసుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక సోంపు, జీల కర్ర వేసి వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి వేగాక.. ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి కలర్ మారేంత వరకూ వేయించు కోవాలి. నెక్ట్స్ చికెన్ బాగా కడిగి వేసుకోవాలి.. ఆ తర్వాత ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి కొద్ది సేపు ఉడికించుకోవాలి. చికెన్ కాసేపు వేగాక.. టమాట ముక్కలు కూడా వేసి మరి కాసేపు వేయించాలి.

ఇప్పుడు చికెన్ నుంచి వచ్చే వాటర్ అంతా పోయాక.. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో ఐదు నిమిషాలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక.. కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా కూడా వేసుకుని మరో కాసేపు ఉడికించు కోవాలి. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసు కోవాలి. చికెన్ బాగా దగ్గర పడి పోయా.. దించే ముందు కొత్తి మీర, కరివేపాకు వేసి మరోసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే చెట్టినాడ్ చికెన్ చుక్కా సిద్ధం అవుతుంది. ఇంకెందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అదిరి పోతుంది.