Chapati Roll: చపాతీలు మిగిలిపోతే ఇలా డిఫరెంట్‌గా రోల్స్ చేసేయండి..

| Edited By: Ravi Kiran

Oct 13, 2024 | 9:30 AM

ఈ మధ్య కాలంలో చాలా మంది చపాతీలను ఆహారంగా తీసుకుంటూ ఉంటున్నారు. బరువు తగ్గేందుకు వీటిని తీసుకుంటూ ఉంటారు. ఎక్కువ కర్రీతో ఒక్క చపాతీ తిన్నా చాలు కడుపు నిండిపోతుంది. చాలా మంది అప్పుడప్పుడు నాన్ వెజ్ కర్రీస్‌తో కూడా తినేందుకు వీటిని చేస్తూ ఉంటారు. ఏ కర్రీతో తిన్నా చపాతీలు చాలా రుచిగా ఉంటాయి. అందుకే చపాతీలు తినేందుకు ఎంతో మంది ఇష్ట పడుతూ ఉంటారు. అయితే ఇంట్లో చపాతీలు చేసుకునేటప్పుడు..

Chapati Roll: చపాతీలు మిగిలిపోతే ఇలా డిఫరెంట్‌గా రోల్స్ చేసేయండి..
Chapati Roll
Follow us on

ఈ మధ్య కాలంలో చాలా మంది చపాతీలను ఆహారంగా తీసుకుంటూ ఉంటున్నారు. బరువు తగ్గేందుకు వీటిని తీసుకుంటూ ఉంటారు. ఎక్కువ కర్రీతో ఒక్క చపాతీ తిన్నా చాలు కడుపు నిండిపోతుంది. చాలా మంది అప్పుడప్పుడు నాన్ వెజ్ కర్రీస్‌తో కూడా తినేందుకు వీటిని చేస్తూ ఉంటారు. ఏ కర్రీతో తిన్నా చపాతీలు చాలా రుచిగా ఉంటాయి. అందుకే చపాతీలు తినేందుకు ఎంతో మంది ఇష్ట పడుతూ ఉంటారు. అయితే ఇంట్లో చపాతీలు చేసుకునేటప్పుడు ఒక్కోసారి మిగిలిపోతూ ఉంటాయి. వీటి ఉదయం వేడి చేసుకుని తింటూ ఉంటారు. కానీ వీటిని రోల్స్‌లా కూడా తయారు చేసుకుని తినవచ్చు. మరి ఈ రోటీ రోల్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

రోటీ రోల్‌కి కావాల్సిన పదార్థాలు:

చపాతీలు, ఉల్లిపాయ, టమాటా, కీరదోస, పన్నీర్, క్యాప్సికమ్, చీజ్ తురుము, మిరియాల పొడి, ఉప్పు, బటర్ లేదా ఆయిల్, టమాటా సాస్.

రోటీ రోల్‌ తయారీ విధానం:

ముందుగా కూరగాయలు, పన్నీర్ అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీని పిజ్జాలా నాలుగు సమ భాగాలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు దానిపై టమాటా సాస్ రాసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పన్నీర్ తురుము, క్యాప్సికమ్, టమాటా, కీరదోస సన్నటి ముక్కలు, చీజ్, ఉప్పు, మిరియాల పొడి వేయాలి. ఆ తర్వాత చాకుతో ఒక భాగం దగ్గర గాటు పెట్టాలి. ఒక దాని మీద మరో భాగం వచ్చేలా చపాతీని మడచాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత ఇప్పుడు పెనం పెట్టి.. బటర్ లేదా ఆయిల్ వేసి వేడెక్కాక రోటీని పెట్టుకుని రెండు వైపులా క్రిస్పీగా కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే రోటీ రోల్స్ సిద్ధం. కావాలంటే ఒక కడాయిలో ఇవన్నీ వేసి వేయించాక.. చపాతీలో పెట్టి రోల్ చేసుకుని తినవచ్చు. ఎలా తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఇలాంటి రోల్ ఒక్కటి తింటే చాలు. కడుపు నిండిపోతుంది.