Bengali Kova Pala Puri: ఈ సంక్రాంతికి ఈ స్వీట్ చేస్తే అదుర్స్ అంతే!

సంక్రాంతి పండుగకు ఎప్పుడూ తెలుగు రుచులే కాకుండా.. ఇలా వెరైటీగా బెంగాలీ కోవా పాల పూరీ చేయండి అదిరి పోతుంది అంతే. బెంగాలీ వంటకం అయినా ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. తరచూ చేసుకునే పాల పూరీ కంటే.. ఇది ఇంకా రుచిగా ఉంటుంది. ఇది తయారు చేయడం కూడా ఈజీనే. సంక్రాంతికి ఎప్పుడూ చేసే స్వీట్స్ కంటే ఈసారి మీ ఇంటికి వచ్చే గెస్టులకు ఈ స్వీట్ పెడితే.. వావ్ అని ఖచ్చితంగా అంటారు. రుచిగా, కమ్మగా ఉంటుంది. స్వీట్స్ తినని వారు..

Bengali Kova Pala Puri: ఈ సంక్రాంతికి ఈ స్వీట్ చేస్తే అదుర్స్ అంతే!
Bengali Kova Pala Puri
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Jan 16, 2024 | 10:45 AM

సంక్రాంతి పండుగకు ఎప్పుడూ తెలుగు రుచులే కాకుండా.. ఇలా వెరైటీగా బెంగాలీ కోవా పాల పూరీ చేయండి అదిరి పోతుంది అంతే. బెంగాలీ వంటకం అయినా ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. తరచూ చేసుకునే పాల పూరీ కంటే.. ఇది ఇంకా రుచిగా ఉంటుంది. ఇది తయారు చేయడం కూడా ఈజీనే. సంక్రాంతికి ఎప్పుడూ చేసే స్వీట్స్ కంటే ఈసారి మీ ఇంటికి వచ్చే గెస్టులకు ఈ స్వీట్ పెడితే.. వావ్ అని ఖచ్చితంగా అంటారు. రుచిగా, కమ్మగా ఉంటుంది. స్వీట్స్ తినని వారు తింటారు. మరి ఈ బెంగాలీ కోవా పాల పూరీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.

బెంగాలీ కోవా పాల పూరీకి కావాల్సిన పదార్థాలు:

పాలు, కోవా, పంచదార, మైదా పిండి, నెయ్యి, పచ్చి కోవా, పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు, బాదం గింజల పొడి, పాల పొడి, యాలకుల పొడి, ఉప్పు.

బెంగాలీ కోవా పాల పూరీ తయారీ విధానం:

ఈ స్వీట్ తయారు చేయడానికి ముందుగా మందంగా ఉండే కడాయి తీసుకోవాలి. ఇందులో చిక్కటి పాలు, పంచదార వేసి మీడియం మంటపై కలుపుతూ ఉండాలి. ఇది మరుగుతుండగానే ఒక చిన్న గిన్నెలో కొద్దిగా మైదా పిండి తీసుకోవాలి. ఇందులోనే నెయ్యి, కొద్దిగా నీళ్లు వేసి పిండిని గట్టిగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో కోవా, ఇందులో కొద్దిగా పంచదార, పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు ముందుగా కలిపిన మైదా పిండిని తీసుకుని ఉండల్లా చేసుకోవాలి. వీటి మధ్యలో కోవా పెట్టి.. వెడల్పుతా వత్తుకుని అంచులను మూసి వేయాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక.. తయారు చేసి పెట్టుకున్న పూరీలను వేసుకోవాలి. మీడియం మంటపై రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో పాల పొడి, బాదం గింజల పొడి, యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసి కలుపు కోవాలి. పాలు సగం వరకు మరిగాక.. కాల్చుకున్న అందులో వేసి మరో ఐదు నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే బెంగాలీ కోవా పాల పూరీ సిద్ధం. ఇంకెందుకు లేట్ ఈ సంక్రాంతికి మీరు కూడా ఈ స్వీట్ తయారు చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?