Palak Paneer Paratha: పాలక్ పన్నీర్ పరాటాలను ఇలా చేస్తే సూపర్ టేస్టీ..

| Edited By: Ram Naramaneni

Jul 08, 2024 | 8:47 PM

పరోటాలు అంటే చాలా మందికి ఇష్టం. ఎంతో ఇష్టంగా తింటారు. ఒక్క పరోటా తిన్నా చాలు. కడుపు నిండి పోతుంది. పరోటాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఎలాంటి వాటితో అయినా పరోటాలు తయారు చేసుకోవచ్చు. చాలా మంది ఎక్కువగా ఆలూ పరోటాలనే తయారు చేస్తూ ఉంటారు. ఎప్పుడూ ఒకటేలా కాకుండా.. ఇలా వెరైటీగా తయారు చేసుకుంటూ ఉంటే ఎంతో రుచిగా ఉంటాయి. వాటిల్లో ఈ పాలక్ పన్నీర్ పరోటా కూడా ఒకటి. పాలక్ పన్నీర్ కర్రీ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని..

Palak Paneer Paratha: పాలక్ పన్నీర్ పరాటాలను ఇలా చేస్తే సూపర్ టేస్టీ..
Palak Paneer Paratha
Follow us on

పరోటాలు అంటే చాలా మందికి ఇష్టం. ఎంతో ఇష్టంగా తింటారు. ఒక్క పరోటా తిన్నా చాలు. కడుపు నిండి పోతుంది. పరోటాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఎలాంటి వాటితో అయినా పరోటాలు తయారు చేసుకోవచ్చు. చాలా మంది ఎక్కువగా ఆలూ పరోటాలనే తయారు చేస్తూ ఉంటారు. ఎప్పుడూ ఒకటేలా కాకుండా.. ఇలా వెరైటీగా తయారు చేసుకుంటూ ఉంటే ఎంతో రుచిగా ఉంటాయి. వాటిల్లో ఈ పాలక్ పన్నీర్ పరోటా కూడా ఒకటి. పాలక్ పన్నీర్ కర్రీ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నార్త్ లో ఇవి ఎక్కువగా తింటూ ఉంటారు. మరి ఇంత రుచిగా ఉండే పాలక్ పన్నీర్‌తో ఇప్పుడు పరోటాలు తయారు చేసుకుందాం. మరి వీటిని ఎలా తయారు చేస్తారు? పాలక్ పన్నీర్ పరోటాకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పాలక్ పన్నీర్ పరోటాకు కావాల్సిన పదార్థాలు:

పాలకూర, పన్నీర్ తురుము, పచ్చి మిర్చి, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, నువ్వులు, ఉప్పు, కొత్తి మీర, ధనియాల పొడి, ఆమ్ చూర్ పొడి, పసుపు, చాట్ మసాలా, గోధుమ పిండి, ఆయిల్.

పాలక్ పన్నీర్ పరోటా తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో నీళ్లు వేసి వేడెక్కాక దించి పక్కన పెట్టుకోవాలి. అందలో కొద్దిగా పసుపు, ఉప్పు, పాలకూర వేసి శుభ్రంగా కడిగి తీసేయాలి. ఆ తర్వాత పాలకూరను తీసి చల్లటి నీటిలో వేయాలి. పాలకూర చల్లారాక.. మిక్సీలో వేయాలి. అందులోనే అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి ముక్కలు వేసి మెత్తగా పేస్టులా చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు మరో గిన్నెలోకి గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, నువ్వులు, చాట్ మాసాలా, గోధుమ పిండి వేసి బాగా కలుపుకోవాలి. అవసరం అయితే తప్ప నీళ్లను వేయాలి. ఇప్పుడు గోధుమ పిండిని చపాతీ ముద్దలా చేసి మూత పెట్టి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం మిగిలిన పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

ఇప్పుడ గోధుమ పిండి ముద్దను తీసుకుని ఉండల్లా చేసుకుని పరోటాల్లో ఒత్తు కోవాలి. వీటి మధ్యలో పన్నీర్ మిశ్రమం ఉంచి.. మళ్లీ పరోటాల్లో చేసుకోవాలి. ఇప్పుడు పాన్ వేడి చేసి.. పరోటా వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. కావాలి అనుకుంటే బటర్ లేదా నెయ్యి వేసుకోవచ్చు. అంతే ఎంతో రుచిగా ఉండే పాలక్ పన్నీర్ పరోటాలు సిద్ధం.