Mutton Dal Gosht: ఘాటు ఘాటుగా మటన్ దాల్ ఘోస్ట్.. ఇలా చేస్తే టేస్ట్ వేరే లెవల్!

|

Jan 04, 2025 | 7:10 PM

ఆరోగ్యకరమైన రెసిపీల్లో ఈ మటన్ దాల్ ఘోస్ట్ కూడా ఒకటి. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. మసాలా దినుసులు, పప్పు దినుసులు కలిపి చేస్తారు. ఆరోగ్యానికి ఈ రెసిపీ చాలా మంచిది. అందులోనూ ఈ చలి కాలంలో తింటే సీజనల్ వ్యాధులు తర్వగా ఎటాక్ చేయకుండా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ఆరోగ్యానికి చాలా మంచిది..

Mutton Dal Gosht: ఘాటు ఘాటుగా మటన్ దాల్ ఘోస్ట్.. ఇలా చేస్తే టేస్ట్ వేరే లెవల్!
Mutton Dal Gosht
Follow us on

ఆరోగ్యకరమైన రెసిపీల్లో ఈ మటన్ దాల్ ఘోస్ట్ కూడా ఒకటి. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. మసాలా దినుసులు, పప్పు దినుసులు కలిపి చేస్తారు. ఆరోగ్యానికి ఈ రెసిపీ చాలా మంచిది. అందులోనూ ఈ చలి కాలంలో తింటే సీజనల్ వ్యాధులు తర్వగా ఎటాక్ చేయకుండా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది. జలుబు, దగ్గు ఉన్నప్పుడు తింటే దెబ్బకు కంట్రోల్ అవుతుంది. మరి ఈ మటన్ దాల్ ఘోస్ట్‌ రెసిపీని ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మటన్ దాల్ ఘోస్ట్‌‌కి కావాల్సిన పదార్థాలు:

బోన్ లెస్ మటన్, మసూర్ దాల్ లేదా కంది పప్పు, కారం, ఉప్పు, పసుపు, ఆయిల్, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, నిమ్మ రసం, కొత్తిమీర, కరివేపాకు.

మటన్ దాల్ ఘోస్ట్‌ తయారీ విధానం:

ఈ రెసిపీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఓ కుక్కర్ తీసుకుని అందులో మటన్, పప్పు, కొద్దిగా ఆయిల్, ఉప్పు వేసి కనీసం 10, 12 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత వేడి తగ్గేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పాన్ తీసుకుని అందులో ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఓ నిమిషం పాటు వేయించిన తర్వాత.. కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించు కోవాలి.

ఇవి కూడా చదవండి

ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించిన పప్పు, మటన్ వేసి పది నిమిషాల పాటు అంతా కలిపి ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలాక నిమ్మరసం, వేసి కొత్తిమీర సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మటన్ దాల్ ఘోస్ట్ సిద్ధం. ఇది వేడి అన్నం, చపాతీలతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా దీన్ని పుల్కాలు, బటర్ నాన్స్‌తో తింటూ ఉంటారు.