Kashmiri Pink Tea: కాశ్మీరీ పింక్ టీ.. ఈ కాలంలో తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు!
టీ, కాఫీల గురించి పరిచయాలు అవసరం లేదు. టీ తాగనిదే ఉదయాన్నే ఏ పనీ పూర్తి కాదు. టీలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిల్లో కాశ్మీరీ పింక్ టీ కూడా ఒకటి. ఈ టీ కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ టీ తాగితే పలు రకాల సమస్యలు రాకుండా ఉంటాయి..

టీ, కాఫీల గురించి పరిచయాలు అవసరం లేదు. టీ తాగనిదే ఉదయాన్నే ఏ పనీ పూర్తి కాదు. టీలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిల్లో కాశ్మీరీ పింక్ టీ కూడా ఒకటి. ఈ టీ కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ టీ తాగితే పలు రకాల సమస్యలు రాకుండా ఉంటాయి. ఎప్పుడూ తాగే టీ కంటే ఓ సారి ఈ కాశ్మీరీ టీ కూడా ట్రై చేయండి. ఈ టీ చేయడం కూడా చాలా సులభం. దీన్నే నూన్ టీ అని కూడా పిలుస్తారు. చల్లని వాతావరణంలో టీ తాగడం వల్ల శరీరానికి చాలా మంచిది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మరి ఈ కాశ్మీరీ పింక్ టీ ఎలా తయారు చేస్తారు? ఈ టీ తయారీకి ఎలాంటి పదార్థాలు కావాలో ఇప్పుడు చూద్దాం.
కాశ్మీరీ పింక్ టీకి కావాల్సిన పదార్థాలు:
దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, కాశ్మీరీ టీ ఆకులు లేదా గ్రీన్ టీ ఆకులు, బేకింగ్ సోడా, ఉప్పు, పాలు, పంచదార, పిస్తా లేదా బాదం తరుగు, కూలింగ్ వాటర్.
కాశ్మీరీ పింక్ టీ తయారీ విధానం:
కాశ్మీరీలో ఈ పింక్ టీ చాలా ఫేమస్. ఈ టీ తయారీకి ముందుగా ఓ గిన్నె తీసుకుని అందులో రెండు కప్పులు కూలింగ్ వాటర్ తీసుకోవాలి. ఈ నీటిలో దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు వేసి మరిగించాలి. ఇవి మరిగిన కాసేపటికి గ్రీన్ టీ లేదా కాశ్మీరీ టీ ఆకులను వేయాలి. ఇలా మరుగుతున్నప్పుడే.. బేకింగ్ సోడా, కొద్దిగా ఉప్పు కూడా వేయాలి. ఇప్పుడు నీరు సగానికి పైగా మరుగుతుంది. ఇలా ఈ మిశ్రమం ఒక కప్పు వచ్చేదాకా మరిగించాలి.
ఇలా టీ తయారు చేసి మనం ఫ్రిజ్‌లో కూడా పెట్టుకుని మరిగించవచ్చు. ఒక గిన్నెలో కొద్దిగా పాలు, పంచదార కలిపి.. ఇందులో కొద్దిగా ముందుగా తయారు చేసిన మసాలా టీ కూడా వేసి కలపాలి. పై నుంచి కొద్దిగా బాదం, పిస్తా తరుగు వేసి పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కాశ్మీరీ టీ సిద్ధం. అంతే ఎంతో రుచిగా ఉండే కాశ్మీరీ పింక్ టీ సిద్ధం.




