పచ్చి కొబ్బరి అంటే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పచ్చి కొబ్బరితో ఏం తయారు చేసుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. పచ్చి కొబ్బరి నుంచి తీసే పాలు కూడా ఎంతో రుచి. అంతే కాకుండా ఆరోగ్యం కూడా. ఈ పచ్చి కొబ్బరి పాలతో కూడా ఎన్నో వంటలు తయారు చేస్తూ ఉంటారు. కొబ్బరి పాలను ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని నొప్పులు, వాపులు, వెయిట్ లాస్, గుండెను ఆరోగ్యంగా ఉంచడం, కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయ పడుతుంది. కొబ్బరి పాలతో తయారు చేసే వంటల్లో కొబ్బరి పాల రైస్ కూడా ఒకటి. ఈ రైస్ ఎంతో రుచిగా ఉంటుంది. అదే విధంగా ఫాస్ట్‌గా, తయారు చేసుకోవచ్చు. మరి కొబ్బరి పాలతో రైస్‌ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కొబ్బరి పాలు, అన్నం, పచ్చి మిర్చి, పులావ్ దినుసులు, జీడిపప్పు, ఉప్పు, ఆయిల్ లేదా నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్.
ముందుగా కొబ్బరి నుంచి కొబ్బరి పాలు తయారు చేసుకోవాలి. ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు కుక్కర్ కానీ బిర్యానీ గిన్నె కానీ తీసుకోవచ్చు. కుక్కర్‌లో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇది వేడెక్కా పులావ్ దినుసులు, పచ్చి మిర్చి, జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత వేయించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాలు వేసి మరిగించుకోవాలి. ఈ పాలు మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వేయండి. ఆ తర్వాత ఉప్పు కూడా వేసి రుచి చూసుకోవాలి.
కొబ్బరి పాలు సరిపోకపోతే నీళ్లు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి.. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. వేడి తగ్గాక కుక్కర్ మూత తీసి సర్వ్ చేసుకోవడమే. ఈ రైస్‌ని వేటితో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి.