ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఎంతో ఆరోగ్యకరంగా తినాలి అని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్య చాలా మంది హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తినేందుకు ఆసక్తి కూడా చూపిస్తున్నారు. ఇప్పటికే మనం హెల్దీ బ్రేక్ ఫాస్ట్‌ల గురించి ఎన్నో రెసిపీలు తెలుసుకున్నాం. ఇప్పుడు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేశాం. ఈ రెసిపీ చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. దీంతో మీ సమయం కూడా సేవ్ అవుతుంది. మరి ఈ హెల్దీ బ్రేక్ ఏంటంటే.. క్యారెట్ ఆమ్లెట్. ఈ రెసిపీ కేవలం బ్రేక్ ఫాస్ట్‌గానే కాకుండా ఈవెనింగ్ స్నాక్ లా కూడా తినొచ్చు. లైట్‌గా డిన్నర్ చేయాలి అనుకునేవాళ్లకు ఈ ఆమ్లెట్ తినొచ్చు. ఎప్పుడూ ఒకే ఫుడ్ తిని పిల్లలకు కూడా బోర్ కొట్టి ఉంటుంది. వారికి కూడా చేంజ్ కావాలి అనిపిస్తుంది. కాబట్టి ఈ రెసిపీ చేసి పొట్టొచ్చు. ఇది ఎంతో ఆరోగ్యకరం కూడా. మరి ఈ టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ ఫాస్ట్ అండ్ స్నాక్.. క్యారెట్ ఆమ్లెట్ ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
కోడి గుడ్లు, క్యారెట్ తురుము, ఉప్పు, పసుపు, ఉల్లిపాయలు, కొత్తి మీర, పచ్చి మిర్చి, మిరియాల పొడి, ఆయిల్.
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ వేసి వేడెక్కాక.. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, క్యారెట్ తురుము వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని.. అందులో రెండు గుడ్లు చితక్కొట్టి వేయాలి. అందులోనే ఉప్పు, మిరియాల పొడి, పచ్చి మిర్చి, కొత్తి మీర, మిరియాల పొడి వేసి బాగా గిలకొట్టి.. వేయించిన ఉల్లిపాయలు, క్యారెట్ కూడా వేసుకోవాలి. మరోసారి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు పెనం పెట్టి.. ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత కలిపి పెట్టుకున్న గుడ్ల మిశ్రమాన్ని వేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే క్యారెట్ ఆమ్లెట్ సిద్దం. ఇది పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. ఇది డిన్నర్, స్నాక్, బ్రేక్ ఫాస్ట్ ఎలా గైనా తినొచ్చు. పైగా ఆరోగ్యం కూడా. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.