AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ulli Uragaya: ఉల్లిపాయతో ఇలా ఊరగాయ పెడితే.. చాలా రుచిగా ఉంటుంది..

ఆరోగ్యానికి ఉల్లిపాయ ఎంతో మేలు. ఉల్లిపాయ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఉల్లిపాయ లేనిదే ఏ కూర కూడా పూర్తి కాదు. ఉల్లిపాయతో కేవలం ఆరోగ్యమే కాకుండా.. చర్మం, జుట్టును కూడా కాపాడుకోవచ్చు. ఉల్లిపాయతో ఎన్నో రకాల వంటలు తయారు చేస్తారు. అలాగే ఇప్పటికవరకూ ఎన్నో రకాల ఊరగాయలు తినే ఉంటారు. కానీ ఉల్లిపాయ ఊరగాయ ఎప్పుడైనా తిన్నారా? ఇది అన్నంతో, బ్రేక్ ఫాస్ట్‌తో, చపాతీతో తిన్నా చాలా బావుంటుంది. మరి ఉల్లిపాయ ఊరగాయను ఎలా..

Ulli Uragaya: ఉల్లిపాయతో ఇలా ఊరగాయ పెడితే.. చాలా రుచిగా ఉంటుంది..
Ulli Uragaya
Chinni Enni
| Edited By: |

Updated on: Sep 27, 2024 | 5:00 PM

Share

ఆరోగ్యానికి ఉల్లిపాయ ఎంతో మేలు. ఉల్లిపాయ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఉల్లిపాయ లేనిదే ఏ కూర కూడా పూర్తి కాదు. ఉల్లిపాయతో కేవలం ఆరోగ్యమే కాకుండా.. చర్మం, జుట్టును కూడా కాపాడుకోవచ్చు. ఉల్లిపాయతో ఎన్నో రకాల వంటలు తయారు చేస్తారు. అలాగే ఇప్పటికవరకూ ఎన్నో రకాల ఊరగాయలు తినే ఉంటారు. కానీ ఉల్లిపాయ ఊరగాయ ఎప్పుడైనా తిన్నారా? ఇది అన్నంతో, బ్రేక్ ఫాస్ట్‌తో, చపాతీతో తిన్నా చాలా బావుంటుంది. మరి ఉల్లిపాయ ఊరగాయను ఎలా తయారు చేస్తారు? ఉల్లిపాయ ఊరగాయకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఉల్లిపాయ ఊరగాయకు కావాల్సిన పదార్థాలు:

ఉల్లిపాయలు, కారం, ఉప్పు, పసుపు, చింత పండు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆయిల్.

ఉల్లిపాయ ఊరగాయ తయారీ విధానం:

ఈ ఉల్లిపాయ ఊరగాయ తయారు చేయడానికి.. ముందుగా చింత పండును నానబెట్టి.. గుజ్జు తీసి పక్కకు పెట్టాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి.. మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. వీటిని పక్కకు ఉంచి.. చల్లారాక మిక్సీలో మెత్తగా పౌడర్‌లా పెట్టాలి. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇందులో ఒక్కోస్పూన్ చొప్పున జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. నెక్ట్స్ ఎండు మిర్చి, నెక్ట్స్ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఫ్రై చేయాలి.

ఇవి కూడా చదవండి

ఇవి వేగిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మెత్తబడేంత వరకూ వేయించాలి. ఇవి బాగా వేగాక.. ఉప్పు, కారం, పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న పౌడర్, చింత పండు గుజ్జు వేసి బాగా కలిపి.. ఆయిల్ పైకి తేలేంత వరకూ ఉడికించాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఉల్లి పాయ ఊరగాయ తయారవుతుంది. ఇది చల్లారాక.. గాజు సీసాలో వేసి నిల్వ చేయాలి. ఈ ఉల్లి ఊరగాయ పది రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటే.. నెల రోజులకు పైగా నిల్వ ఉంటుంది.

Follow Us
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?