
మిల్లెట్స్‌తో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే అనేక రోగాలకు కూడా చెక్ పెట్టినట్టు అవుతుంది. అయితే వీటి టేస్ట్ చాలా తక్కువ. కానీ మిల్లెట్స్‌తో కూడా అదిరిపోయే టేస్టీ పొంగనాలు తయారు చేసుకోవచ్చు. అందులోనూ టేస్టీ బ్రేక్ ఫాస్ట్ తినాలి అనుకున్న వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందులోనూ ఎప్పుడూ బోరింగ్ టిఫిన్స్‌కి బదులు ఇలా కొత్తగా తయారుచేసుకుని తినొచ్చు. వీటిల్లో ఉపయోగించే పదార్థాలు కూడా ఆరోగ్యానికి మంచివే. క్రిస్పీగా, టేస్టీగా, ఘాటుగా, హెల్దీ ఫుడ్ తినాలి అనుకున్న వారికి మిల్లేట్స్ పొంగనాలు చాలా బెస్ట్. మరి ఈ మిల్లెట్స్ పొంగనాలను ఎలా తయారు చేసుకుంటారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మిల్లెట్స్, మినపప్పు, మెంతులు, కొబ్బరి, ఆవాలు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తి మీర, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, ఉప్పు, ఆయిల్.
ఈ పొంగనాలు తయారు చేయడానికి ముందుగా మిల్లెట్స్‌ని 8 గంటల పాటు నానబెట్టాలి. రాత్రి నాబెట్టి ఉదయం టిఫిన్ తయారు చేసుకుంటే బెటర్. మిల్లెట్స్ పూర్తిగా నానాక.. మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. కాస్త గట్టిగానే పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండి ఒక గిన్నెలోకి వేసుకుని.. ఉప్పు, కొద్దిగా సోడా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు తాళింపు కోసం చిన్న కడాయి తీసుకుని, అందులో ఆయిల్ వేసి ఆవాలు, మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, అల్లం, వెల్లుల్లి వేసి వేగాక.. ఉల్లిపాయలు కూడా వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి.. కొత్తిమీర తరుగు, కొబ్బరి వేసి కలపాలి.
ఈ తాళింపును.. మిల్లెట్స్ పిండిలో వేసి కలుపుకోవాలి. ఒకసారి ఉప్పు రుచి చూసుకుని.. పిండిని బాగా కలుపకోండి. ఇప్పుడు పొంగనాల పాన్ పెట్టి.. మీడియం ఫ్లేమ్‌లో ఉంచి వేడి చేసుకోవాలి. గుంతల్లో కొద్దిగా పిండి వేస్తూ నింపాలి. మీడియం మంటపై రెండు వైపులా ఉడికించుకోవాలి. అన్నీ బాగా ఉడికాగ.. సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే ఎంతో టేస్టీగా ఉండే మిల్లెట్స్ పొంగనాలు సిద్ధం. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి. టేస్ట్ సూపర్‌గా ఉంటాయి.