Aloo Bhujia: పిల్లలకు ఎంతో ఇష్టమైన ఆలూ బుజియా.. ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు..

| Edited By: Ravi Kiran

Aug 03, 2024 | 10:00 PM

పిల్లలకు స్నాక్స్ అంటే చాలా ఇష్టం. అన్నం కంటే వీటిని ఎక్కువగా తింటూ ఉంటారు. ఇలా పిల్లలకు ఇష్టమైన స్నాక్స్‌లో ఆలూ బుజియా కూడా ఒకటి. ఆలూ బుజియా బయట షాప్స్‌లో రెడీమేడ్‌గా దొరకుతుంది. దీంతో చాలా మంది వీటినే కొని తీసుకొస్తూ ఉంటారు. కానీ వాటిల్లో ఏం కలుపుతున్నారా.. పరిశుభ్రంగా వండతున్నారో లేదో అన్న డౌట్ మిలో మెదులుతూనే ఉంటుంది. అలా కాకుండా ఇంట్లో శుభ్రంగా తయారు చేసుకోవచ్చు. అందులోనూ పిల్లలకు పెట్టేవి కాబట్టి..

Aloo Bhujia: పిల్లలకు ఎంతో ఇష్టమైన ఆలూ బుజియా.. ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు..
Aloo Bhujia
Follow us on

పిల్లలకు స్నాక్స్ అంటే చాలా ఇష్టం. అన్నం కంటే వీటిని ఎక్కువగా తింటూ ఉంటారు. ఇలా పిల్లలకు ఇష్టమైన స్నాక్స్‌లో ఆలూ బుజియా కూడా ఒకటి. ఆలూ బుజియా బయట షాప్స్‌లో రెడీమేడ్‌గా దొరకుతుంది. దీంతో చాలా మంది వీటినే కొని తీసుకొస్తూ ఉంటారు. కానీ వాటిల్లో ఏం కలుపుతున్నారా.. పరిశుభ్రంగా వండతున్నారో లేదో అన్న డౌట్ మిలో మెదులుతూనే ఉంటుంది. అలా కాకుండా ఇంట్లో శుభ్రంగా తయారు చేసుకోవచ్చు. అందులోనూ పిల్లలకు పెట్టేవి కాబట్టి.. ఇంట్లో తయారు చేసుకుంటేనే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒక్క రోజు కష్ట పడ్డారంటే రెండు నెలలదాకా ఈ స్నాక్ ఉంటుంది. మరి ఇంత రుచికరమైన ఆలూ బుజియాను ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ బుజియాకు కావాల్సిన పదార్థాలు:

బంగాళ దుంపలు, శనగ పిండి, ఉప్పు, కారం, ఆమ్‌చూర్ పౌడర్, గరం మసాలా, చాట్ మసాలా, ఇంగువ, ఆయిల్

ఆలూ బుజియా తయారీ విధానం:

ముందుగా బంగాళ దుంపల్ని కట్ చేసుకుని కుక్కర్‌లో వేసి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించాలి. ఆ తర్వాత విజిల్ తీసి చల్లార్చి తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఎలాంటి ముక్కలు లేకుండా మెత్తని పేస్టులా మెదుపు కోవాలి. మరొక పాత్ర తీసుకుని ఇందులో శనగ పిండి వేసుకోవాలి. శనగ పిండిలోనే ఉప్పు, కారం, చాట్ మసాలా, ఇంగువ, ఆమ్ చూర్ పొడి వేసి అన్నీ బాగా కలుపుకోవాలి.

ఇవి కూడా చదవండి

అన్నీ వేసి బాగా కలుపుకున్నాక పిండిని పేస్టులా చేసిన బంగాళ దుంప మిశ్రమంలో వేసి మళ్లీ అన్నీ కలపాలి. నీళ్లు అవసరం అనుకుంటేనే వేయాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు జంతికలు ఒత్తుకునే గొట్టంలో సన్నని బిల్లలు పెట్టి వేడెక్కిన ఆయిల్‌లో వేసుకోవాలి. రెండు వైపులా ఎర్రగా వేయించాక తీసుకోవడమే. అంతే ఎంతో రుచిగా ఉండే ఆలూ బుజియా సిద్ధం.