Sweet Potato Bonda: చిలగడదుంపతో ఇలా బోండాలు చేయండి.. సూపర్ టేస్టీగా ఉంటాయి..

| Edited By: Ravi Kiran

Sep 27, 2024 | 4:00 PM

ఎప్పుడూ ఒకే రకమైన కూరగాయలు తినీ తినీ బోర్ కొట్టేస్తుందా.. కొత్త రకమైన బ్రేక్ ఫాస్ట్ ఏమైనా తినాలి అనిపిస్తుందా. ఇప్పటికే ఎంతో రుచికరమైన, హెల్దీగా ఉండే బ్రేక్ ఫాస్టల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మరో కొత్త రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాం. అదే చిలగడదుంప బోండాలు. చిలగడ దుంపలతో కూరలే కాదు.. బ్రేక్ ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు. చేయడం కూడా చాలా సులభం. రుచి కూడా చాలా బావుంటుంది. ఇవి తియ్యగా ఉంటాయి. పిల్లలకు మాత్రం చాలా నచ్చుతాయి. తీపి తినేవాళ్లకు ఈ బ్రేక్ ఫాస్ట్..

Sweet Potato Bonda: చిలగడదుంపతో ఇలా బోండాలు చేయండి.. సూపర్ టేస్టీగా ఉంటాయి..
Sweet Potato Bonda
Follow us on

ఎప్పుడూ ఒకే రకమైన కూరగాయలు తినీ తినీ బోర్ కొట్టేస్తుందా.. కొత్త రకమైన బ్రేక్ ఫాస్ట్ ఏమైనా తినాలి అనిపిస్తుందా. ఇప్పటికే ఎంతో రుచికరమైన, హెల్దీగా ఉండే బ్రేక్ ఫాస్టల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మరో కొత్త రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాం. అదే చిలగడదుంప బోండాలు. చిలగడ దుంపలతో కూరలే కాదు.. బ్రేక్ ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు. చేయడం కూడా చాలా సులభం. రుచి కూడా చాలా బావుంటుంది. ఇవి తియ్యగా ఉంటాయి. పిల్లలకు మాత్రం చాలా నచ్చుతాయి. తీపి తినేవాళ్లకు ఈ బ్రేక్ ఫాస్ట్ బాగా నచ్చుతుంది. మీ ఇంట్లో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మళ్లీ మళ్లీ చేయమంటారు. మరి ఈ చిలగడదుంపల బోండాలు ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చిలగడ దుంప బోండాలకు కావాల్సిన పదార్థాలు:

చిలగడ దుంపలు, ఇడ్లీ పిండి, బియ్యం పిండి, కొబ్బరి తురుము, యాలకుల పొడి, ఉప్పు, చక్కెర, ఆయిల్.

చిలగడ దుంప బోండాలు తయారీ విధానం:

ముందుగా చిలగడ దుంపల్లో ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఉడికాక.. తొక్క తీసి గిన్నెలో వేయాలి. చిలగడ దుంపలు చల్లగా అయ్యాక మెత్తగా మెదుపు కోవాలి. ఆ తర్వాత ఇందులో కొబ్బరి తురుము, యాలకుల పొడి, ఉప్పు, పంచదార వేసి బాగా కలుపుకోవాలి. మళ్లీ చేతితో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరో పాత్ర తీసుకోవాలి. ఇడ్లీ పిండిని చిక్కగా కలుపుకోవాలి. అవసరం అయితే.. బియ్యం పిండి కలుపుకోవచ్చు. ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కాక.. చిలగడ దుంపలను ఇడ్లీ పిండిలో ముంచుకుని.. ఆయిల్‌లో వేసుకోవాలి. ఒక నిమిషం ఆగాక.. వాటిని అటూ ఇటూ తిప్పాలి. అలా గోల్డెన్ కలర్‌లోకి మారేంత వరకూ ఫ్రై చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే చిలగడ దుంపల బోండాలు సిద్ధం. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి. వీటిని స్నాక్స్‌లా కూడా వేసుకోవచ్చు.