Healthy Carrot Omelet: ఈ రెసిపీ బ్రేక్‌ఫాస్ట్ అండ్ స్నాక్ రెండింటికీ సూపర్ అంతే!

ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఎంతో ఆరోగ్యకరంగా తినాలి అని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్య చాలా మంది హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తినేందుకు ఆసక్తి కూడా చూపిస్తున్నారు. ఇప్పటికే మనం హెల్దీ బ్రేక్ ఫాస్ట్‌ల గురించి ఎన్నో రెసిపీలు తెలుసుకున్నాం. ఇప్పుడు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేశాం. ఈ రెసిపీ చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. దీంతో మీ సమయం కూడా సేవ్ అవుతుంది. మరి ఈ హెల్దీ బ్రేక్ ఏంటంటే.. క్యారెట్ ఆమ్లెట్. ఈ రెసిపీ కేవలం బ్రేక్ ఫాస్ట్‌గానే కాకుండా ఈవెనింగ్..

Healthy Carrot Omelet: ఈ రెసిపీ బ్రేక్‌ఫాస్ట్ అండ్ స్నాక్ రెండింటికీ సూపర్ అంతే!
Healthy Carrot Omelet
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 27, 2024 | 4:30 PM

ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఎంతో ఆరోగ్యకరంగా తినాలి అని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్య చాలా మంది హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తినేందుకు ఆసక్తి కూడా చూపిస్తున్నారు. ఇప్పటికే మనం హెల్దీ బ్రేక్ ఫాస్ట్‌ల గురించి ఎన్నో రెసిపీలు తెలుసుకున్నాం. ఇప్పుడు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేశాం. ఈ రెసిపీ చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. దీంతో మీ సమయం కూడా సేవ్ అవుతుంది. మరి ఈ హెల్దీ బ్రేక్ ఏంటంటే.. క్యారెట్ ఆమ్లెట్. ఈ రెసిపీ కేవలం బ్రేక్ ఫాస్ట్‌గానే కాకుండా ఈవెనింగ్ స్నాక్ లా కూడా తినొచ్చు. లైట్‌గా డిన్నర్ చేయాలి అనుకునేవాళ్లకు ఈ ఆమ్లెట్ తినొచ్చు. ఎప్పుడూ ఒకే ఫుడ్ తిని పిల్లలకు కూడా బోర్ కొట్టి ఉంటుంది. వారికి కూడా చేంజ్ కావాలి అనిపిస్తుంది. కాబట్టి ఈ రెసిపీ చేసి పొట్టొచ్చు. ఇది ఎంతో ఆరోగ్యకరం కూడా. మరి ఈ టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ ఫాస్ట్ అండ్ స్నాక్.. క్యారెట్ ఆమ్లెట్ ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

క్యారెట్ ఆమ్లెట్‌కి కావాల్సిన పదార్థాలు:

కోడి గుడ్లు, క్యారెట్ తురుము, ఉప్పు, పసుపు, ఉల్లిపాయలు, కొత్తి మీర, పచ్చి మిర్చి, మిరియాల పొడి, ఆయిల్.

క్యారెట్ ఆమ్లెట్‌ తయారీ విధానం:

ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ వేసి వేడెక్కాక.. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, క్యారెట్ తురుము వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని.. అందులో రెండు గుడ్లు చితక్కొట్టి వేయాలి. అందులోనే ఉప్పు, మిరియాల పొడి, పచ్చి మిర్చి, కొత్తి మీర, మిరియాల పొడి వేసి బాగా గిలకొట్టి.. వేయించిన ఉల్లిపాయలు, క్యారెట్ కూడా వేసుకోవాలి. మరోసారి బాగా కలుపుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు పెనం పెట్టి.. ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత కలిపి పెట్టుకున్న గుడ్ల మిశ్రమాన్ని వేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే క్యారెట్ ఆమ్లెట్ సిద్దం. ఇది పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. ఇది డిన్నర్‌, స్నాక్, బ్రేక్ ఫాస్ట్‌ ఎలా గైనా తినొచ్చు. పైగా ఆరోగ్యం కూడా. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.

ఈ త్రైమాసికంలో వడ్డీరేట్ల పరిస్థితి ఏంటి? నిపుణుల అంచనాలు ఇవే..!
ఈ త్రైమాసికంలో వడ్డీరేట్ల పరిస్థితి ఏంటి? నిపుణుల అంచనాలు ఇవే..!
ఈ రెసిపీ బ్రేక్‌ఫాస్ట్ అండ్ స్నాక్ రెండింటికీ సూపర్ అంతే!
ఈ రెసిపీ బ్రేక్‌ఫాస్ట్ అండ్ స్నాక్ రెండింటికీ సూపర్ అంతే!
రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి హరీష్ రావు డెడ్ లైన్
రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి హరీష్ రావు డెడ్ లైన్
స్కూల్​ప్రతిష్ఠ కోసం రెండో తరగతి విద్యార్థి నరబలి.. ఎక్కడంటే
స్కూల్​ప్రతిష్ఠ కోసం రెండో తరగతి విద్యార్థి నరబలి.. ఎక్కడంటే
వాట్సాప్‌లో ఈ 4 నంబర్‌లను సేవ్ చేసుకోండి..ఎన్నో సమస్యలు పరిష్కారం
వాట్సాప్‌లో ఈ 4 నంబర్‌లను సేవ్ చేసుకోండి..ఎన్నో సమస్యలు పరిష్కారం
ఓలా కంపెనీని ఉతికి ఆరేస్తున్న కస్టమర్లు.. కారణం ఏంటో తెలుసా..?
ఓలా కంపెనీని ఉతికి ఆరేస్తున్న కస్టమర్లు.. కారణం ఏంటో తెలుసా..?
హిట్టా.? ఫట్టా.? ఎరుపెక్కిన సంద్రం నిలబడిందా.! రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఎరుపెక్కిన సంద్రం నిలబడిందా.! రివ్యూ.
ప్రపంచంలో ఏకైక ఆలయం ద్వాపరయుగం నాటి గజ లక్ష్మి ఆలయం.. ఎక్కడంటే
ప్రపంచంలో ఏకైక ఆలయం ద్వాపరయుగం నాటి గజ లక్ష్మి ఆలయం.. ఎక్కడంటే
IND vs BAN: కాన్పూర్‌లో చరిత్ర సృష్టించిన చెన్నై చిచ్చర పిడుగు..
IND vs BAN: కాన్పూర్‌లో చరిత్ర సృష్టించిన చెన్నై చిచ్చర పిడుగు..
అసలు పీఎఫ్ ఎందుకు? దాని వల్ల ప్రయోజనం ఏమిటి?
అసలు పీఎఫ్ ఎందుకు? దాని వల్ల ప్రయోజనం ఏమిటి?