Energetic Recipe: మీకు ఆరోగ్యంతో పాటు అందం కూడా కావాలా? అయితే దీన్ని ఉదయాన్నే ఒక కప్పు తినండి!

| Edited By: Ravi Kiran

Sep 26, 2023 | 11:00 PM

ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో ఏం తింటున్నామో కూడా తెలీడం లేదు. ఏదో ఒకటి సమయానికి, కడుపు నిండితే చాలు అనుకుంటున్నాం. ఇంట్లో చేసుకోవడానికి సమయం లేక.. ఏదో బయట దొరికిన జంక్ ఫుడ్ ను, ప్రాసెస్డ్ ఫుడ్ ను తీసుకుంటున్నారు. దీంతో శరీరానికి అందాల్సిన పోషకాలు సరిగ్గా అందడం లేదు. దీంతో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇక ఆ తర్వాత డాక్టర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా మన శరీరానికి కావాల్సింది రోగ నిరోధక శక్తి. ఇది ఉంటే ఎలాంటి వ్యాధులతోనైనా పోరాడగల శక్తి లభిస్తుంది. మరి అలాంటి శక్తి కావాలంటే పోషకాలున్న ఫుడ్..

Energetic Recipe: మీకు ఆరోగ్యంతో పాటు అందం కూడా కావాలా? అయితే దీన్ని ఉదయాన్నే ఒక కప్పు తినండి!
Apple Banana
Follow us on

ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో ఏం తింటున్నామో కూడా తెలీడం లేదు. ఏదో ఒకటి సమయానికి, కడుపు నిండితే చాలు అనుకుంటున్నాం. ఇంట్లో చేసుకోవడానికి సమయం లేక.. ఏదో బయట దొరికిన జంక్ ఫుడ్ ను, ప్రాసెస్డ్ ఫుడ్ ను తీసుకుంటున్నారు. దీంతో శరీరానికి అందాల్సిన పోషకాలు సరిగ్గా అందడం లేదు. దీంతో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇక ఆ తర్వాత డాక్టర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా మన శరీరానికి కావాల్సింది రోగ నిరోధక శక్తి. ఇది ఉంటే ఎలాంటి వ్యాధులతోనైనా పోరాడగల శక్తి లభిస్తుంది. మరి అలాంటి శక్తి కావాలంటే పోషకాలున్న ఫుడ్ తీసుకోవాలి. ఇలాంటివి తీసుకుంటే ఆరోగ్యంతో పాటు అందం కూడా మన సొంతం అవుతుంది. కొన్ని రకాల పదార్థాలను ఉపయోగించి ఇప్పుడు మేము చెప్పే దాన్ని ట్రై చేస్తే ఖచ్చితంగా ఫలితాలు కనిపిస్తాయి. అయితే క్రమం తప్పకుండా తీసుకోవాలి.

ఎనర్జిటిక్ బౌల్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

నాన బెట్టిన బాదం, నాన బెట్టిన సబ్జా గింజలు, పాలు, ఓట్స్, యాపిల్, అరటి పండు, పంచదార,బెల్లం పొడి, నీళ్లు.

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకుని పాలు, నీళ్లు పోసుకోవాలి. ఓ పొంగు వచ్చాక ఓట్స్, బాదం పప్పు వేసి మరలా ఓ ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి. నెక్ట్స్ సబ్జా గింజలు, పంచదార కూడా కలిపి మరో ఐదు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. షుగర్ ఉన్న వాళ్లు పంచదారకు బదులు బెల్లం పొడిని వేసుకోవాలి. ఆ తర్వాత యాపిల్, అరటి పండు ముక్కలు వేసి కలపాలి. అంతే ఇది ఎంతో బలవర్థకరమైన ఆహారం. దీన్ని ఫ్రిజ్ లో పెట్టుకుని చల్లారాక అయినా, లేదా కాస్త వేడిగా ఉన్నప్పుడైనా తినవచ్చు.

ఇక అవసరమైన వారు ఇందులో ఇతర ఫ్రూట్స్ ను కూడా కలుపుకోవచ్చు. ఇది తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు కూడా తగ్గుతారు. ఇందులో పండ్లు, పాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. బీపీ, షుగర్ ఉన్న వారు ఎవరైనా ఈ ఎనర్జిటిక్ ఫుడ్ ను తీసుకోవచ్చు. దీన్ని క్రమం తప్పకుండా తింటే బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంతే కాకుండా రోజంతా యాక్టీవ్ గా ఉంటారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.