Rava Bobbatlu: రవ్వ బొబ్బట్లను ఇలా చేస్తే కనుక.. ఒక్కటి కూడా మిగల్చరు!

| Edited By: Ravi Kiran

Nov 25, 2023 | 11:15 PM

మనం తరచూ తినే ఆహార పదార్థాల్లో బొబ్బట్లు కూడా ఒకటి. బొబ్బట్లు అంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బొబ్బట్లు బాగా ఫేమస్. వీటిని వివిధ రకాల ప్రాంతాల్లో పలు రకాల పేర్లు పెట్టి పిలుస్తూంటారు. బొబ్బట్లను ఒక్కొక్కరు ఒక్కో విధంగా తయారు చేసుకుని తినవచ్చు. ప్రాంతాన్ని బట్టి ఈ బొబ్బట్లను తయారు చేస్తూ ఉంటారు. ఫంక్షన్ లలో కూడా బొబ్బట్లను వడ్డిస్తూ ఉంటారు. ఈ బొబ్బట్లలో రవ్వ బొబ్బట్లు కూడా ఒకటి. రవ్వ స్టఫింగ్ చేసే బొబ్బట్లు కూడా ఎంతో టేస్టీగా..

Rava Bobbatlu: రవ్వ బొబ్బట్లను ఇలా చేస్తే కనుక.. ఒక్కటి కూడా మిగల్చరు!
Bobbatlu
Follow us on

మనం తరచూ తినే ఆహార పదార్థాల్లో బొబ్బట్లు కూడా ఒకటి. బొబ్బట్లు అంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బొబ్బట్లు బాగా ఫేమస్. వీటిని వివిధ రకాల ప్రాంతాల్లో పలు రకాల పేర్లు పెట్టి పిలుస్తూంటారు. బొబ్బట్లను ఒక్కొక్కరు ఒక్కో విధంగా తయారు చేసుకుని తినవచ్చు. ప్రాంతాన్ని బట్టి ఈ బొబ్బట్లను తయారు చేస్తూ ఉంటారు. ఫంక్షన్ లలో కూడా బొబ్బట్లను వడ్డిస్తూ ఉంటారు. ఈ బొబ్బట్లలో రవ్వ బొబ్బట్లు కూడా ఒకటి. రవ్వ స్టఫింగ్ చేసే బొబ్బట్లు కూడా ఎంతో టేస్టీగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సింపుల్. మరి ఈ రవ్వ బొబ్బట్లు ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రవ్వ బొబ్బట్లకు కావాల్సిన పదార్థాలు:

గోధుమ పిండి, నెయ్యి, బెల్లం తరుము, బొంబాయి రవ్వ, యాలకుల పొడి, ఉప్పు, పసుపు, కుంకుమ పువ్వు, పంచదార.

ఇవి కూడా చదవండి

రవ్వ బొబ్బట్ల తయారీ విధానం:

ఓ రెండు కప్పుల గోధుమ పిండిని ఒక లోతైన గిన్నెలోకి తీసుకోవాలి. అందులోకి నెయ్యి, ఉప్పు, కొద్దిగా పసుపు, సరి పడ నీళ్లు వేసి.. చపాతీ పిండి కంటే ఇంకా మెత్తగా తయారు చేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని మూత పెట్టి ఓ అరగంట సేపు పక్కకు ఉంచాలి. మరో పాత్ర తీసుకుని అందులో పంచదార అర కప్పు, కప్పు బెల్లం, నీళ్లు పోసి.. స్టవ్ మీద పెట్టి అవి కరిగేంత వరకూ వేడి చేసుకోవాలి.. తర్వాత మరో కడాయిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు రవ్వ వేసి బాగా వేయించు కోవాలి. రవ్వ వేగాక.. ముందుగా సిద్దం చసుకున్న బెల్లం నీటిని పోసి బాగా కలుపు కోవాలి.

ఇందులోనే కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసి దగ్గర పడే వరకూ కలుపుతూ ఉండాలి. ఈ రవ్వ మిశ్రమం బాగా దగ్గర పడ్డాక.. కొద్దిగా నెయ్యి వేసి బాగా కలుపుకని స్టవ్ ఆఫ్ చేసు కోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా చపాతీ పిండిని తీసుకుని ఇందులో రవ్వ మిశ్రమాన్ని ఉంచి రౌండ్ గా.. మందంగా ఉండే పాలిథిన్ కవర్ సహాయంతో బొబ్బట్ల మాదిరిగా వత్తు కోవాలి. ఆ తర్వాత పెనంపై వేసి రెండు వైపులాగా కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే రవ్వ బొబ్బట్లు సిద్ధం. ఇలా రవ్వతో తయారు చేసిన బొబ్బట్లు కూడా భలే రుచిగా ఉంటాయి.