AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలు, పెద్దలు ఎంతగానో మెచ్చే హెల్తీ లడ్డూ రెసిపీ..! ఒక లడ్డూలో ఎన్ని పోషకాలో తెలుసా..?

ఈ రోజు మనం ఒక ఆరోగ్యకరమైన, తీయగా ఉండే మంచి పోషకాలు ఉన్న లడ్డూ తయారీ గురించి తెలుసుకుందాం. ఇది ఫ్లాక్సీడ్స్ బాదం లడ్డూ. ఇందులో చాలా మంచి పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా జుట్టుకు, చర్మానికి ఇది చాలా మంచిది. ఆర్గానిక్ బెల్లం పొడి ఉపయోగించి చేస్తారు.

పిల్లలు, పెద్దలు ఎంతగానో మెచ్చే హెల్తీ లడ్డూ రెసిపీ..! ఒక లడ్డూలో ఎన్ని పోషకాలో తెలుసా..?
Flax Seed Almond Ladoo
Prashanthi V
|

Updated on: Jun 25, 2025 | 6:33 PM

Share

ఫ్లాక్సీడ్స్ బాదం లడ్డూలను గాలి చొరబడని డబ్బాలో పెడితే 8 నుండి 10 రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. ఆకలి వేస్తే ఒక లడ్డూ తిని నీళ్లు తాగడం వల్ల చాలా గంటలపాటు ఆకలి అనిపించదు. ఈ లడ్డూలను తరచూ తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఈ లడ్డూలు తయారు చేయడానికి కేవలం 20 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది.

ఫ్లాక్సీడ్స్ వల్ల ఉపయోగాలు

  • శరీరానికి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 లాంటివి ఇందులో ఉంటాయి.
  • ఇది కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది.
  • సరైన మోతాదులో తీసుకుంటే శరీరానికి మంచిది.
  • ఎగ్స్, నాన్ వెజ్ తినని వారికి ఇది మంచి ఆప్షన్.

బాదం వల్ల ప్రయోజనాలు

  • విటమిన్ E ఎక్కువగా లభిస్తుంది.
  • యాంటీఆక్సిడెంట్లు ఉండడం వల్ల శరీరానికి రక్షణగా పని చేస్తుంది.
  • మెగ్నీషియం ఉండటం వల్ల రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడానికి సాయపడుతుంది.
  • ఆకలిని అదుపు చేసి ఎక్కువ ఆహారం తినే అలవాటును తగ్గిస్తుంది.
  • మంచి కొవ్వులు, ఫైబర్ దొరుకుతాయి.

ఫ్లాక్సీడ్స్ బాదం లడ్డూలకి కావాల్సిన పదార్థాలు

  • అవిసె గింజలు (ఫ్లాక్సీడ్స్) – 1 కప్పు
  • బాదంపప్పు – ¾ కప్పు
  • తెల్ల నువ్వులు – ½ కప్పు
  • నల్ల నువ్వులు – ½ కప్పు
  • ఆర్గానిక్ బెల్లం పొడి – 1 కప్పు (రుచికి సరిపడా)
  • ఏలకుల పొడి – 1 టీస్పూన్
  • నెయ్యి – 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం

ముందుగా స్టౌవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మధ్యస్థ మంటపై వేడి చేయండి. అందులో తెల్ల నువ్వులు, నల్ల నువ్వులను విడివిడిగా వేయించి ఒక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అవిసె గింజలను కూడా వేయించి అదే ప్లేట్‌ లో నువ్వులతో కలపండి. బాదంను కూడా కొద్దిగా గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. అవి మాడిపోకుండా చూసుకోండి.

వేయించిన ఈ పదార్థాలన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా రవ్వ రవ్వగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో నెయ్యి వేడి చేసి బెల్లం పొడి వేసి కలుపుతూ కరిగించాలి. బెల్లం కరిగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న గింజల పొడిని, ఏలకుల పొడిని బెల్లం మిశ్రమంలో వేసి బాగా కలపండి.

ఇప్పుడు స్టౌవ్ ఆఫ్ చేసి మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న లడ్డూలుగా చేసుకోవాలి. ఈ లడ్డూలను గాలి చొరబడని డబ్బాలో భద్రపరచాలి. ఫ్రిజ్‌ లో పెట్టినా బాగుంటాయి.

రెసిపీకి సంబంధించి చిట్కాలు

  • ఆర్గానిక్ బెల్లం దొరకకపోతే మామూలు బెల్లం కూడా వాడొచ్చు. కానీ కరిగించిన తర్వాత వడకట్టాలి.
  • ఈ వంటకంలో నెయ్యి తప్పనిసరిగా ఉండాలి.
  • మీ రుచికి తగ్గట్లు తీపిని తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు.
  • ఖర్జూరం వాడితే బెల్లాన్ని పూర్తిగా వాడాల్సిన అవసరం లేదు.
  • మీరు కావాలంటే ఈ రెసిపీని గుమ్మడి గింజలు లేదా పొద్దుతిరుగుడు గింజలతో కూడా చేసుకోవచ్చు.

ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన లడ్డూలు పిల్లలకు, పెద్దలకు అందరికీ బాగా నచ్చుతాయి. మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి.