Jamun Ice Cream: ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా.. అల్ల నేరేడుతో ఐస్ క్రీమ్ ట్రై చేయండి.. షుగర్ పేషెంట్స్ ఎలా చేసుకోవాలంటే..
నల్లగా నిగనిగలాడుతూ నోరూరిస్తూ నేరేడు పండ్లు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. ఏ సీజన్ లో దొరికే పండ్లను ఆ సీజన్ లో తినాలి. అపుడే శరీరం ఆయా సీజన్ కి అనుగుణంగా ఆరోగ్య ప్రయోజనాలు అందుకుంటుంది. ఈ సీజన్ లో దొరికే నేరేడు పండ్లు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. వీటిని పండ్ల రూపంలో ఎక్కువగా తింటారు. అయితే నేరేడు పండ్లతో ఐస్ క్రీమ్ కూడా తయారు చేసుకోవచ్చు అని తెలుసా.. జామూన్ ఐస్ క్రీమ్ తయారీ గురించి ఈ రోజు తెలుసుకుందాం..

మార్కెట్ లో ఎక్కడ చూసినా నేరేడు పండ్లు కనిపిస్తున్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా నేరడు పండ్లు షుగర్ పేషెంట్లకు ఒక వరం. వీటిని తినడం వలన శరీరంలో షుగర్‌ను నియంత్రణలో ఉంటుంది. మధుమేహ బాధితులు చాలా రకాల పండ్లను తిన్న తర్వాత.. షుగర్ పెరిగిందని ఫిర్యాదు చేస్తారు. అందుకనే షుగర్ పేషెంట్స్ పండ్లు తినాలంటే భయపడతారు. అటువంటి వారు కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా నేరేడు పండ్లు తినవచ్చు. అయితే మార్కెట్ లో నేరేడు పండ్లతో చేసిన ఐస్ క్రీమ్ లభిస్తుంది. దీనిని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే జామున్ ఐస్ క్రీం ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
జామూన్ ఐస్ క్రీమ్ ని ఇంట్లో చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజు జామూన్ ఐస్ క్రీమ్ రెసిపీ గురించి తెలుసుకుందాం.. దీనిని పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. దీని రుచి ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది. అలాగే ఈ ఐస్ క్రీమ్ ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ఐస్ క్రీమ్ ని సాధారణ రోజులలో , ప్రత్యేక సందర్భాలలో కూడా తయారు చేసుకోవచ్చు.
ఐస్ క్రీమ్ తయారీకి కావాల్సిన పదార్ధాలు
నేరేడు పండ్లు గుజ్జు
స్కిమ్ మిల్క్ (కొవ్వు రహిత పాలు)
కార్న్ ఫ్లోర్
చక్కర
తయారీ విధానం:
- ముందుగా అర కప్పు పాలను తీసుకుని కార్న్‌ఫ్లోర్ వేసి పాలను బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు ఒక పాత్రని తీసుకుని పాలు వేసి మరిగించండి. మీడియం మంట మీద పాలను కలుపుతూ 4 నిమిషాలు పాటు మరిగించండి.
- ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పాలు కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని మరిగే పాలలో వేసి కలపండి.
- తర్వాత గ్యాస్ ఆపి.. ఈ పాల మిశ్రమాన్ని చల్లబరచడానికి కొంత సమయం అలాగే ఉంచండి.
- ఈ మిశ్రమం చల్లబడిన తర్వాత.. ఈ పాల మిశ్రమంలో నేరేడు పండ్ల గుజ్జును వేసి రుచికి సరిపడా చక్కెర జోడించండి. (మీకు కావాలంటే షుగర్ ఫ్రీ కూడా జోడించవచ్చు).
- ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. తర్వాత పాలు నేరేడు గుజ్జు మిశ్రమాన్ని ఒక కంటైనర్‌లో వేసి ఫాయిల్‌తో కవర్ చేయండి.
- ఇష్టమైన వారు ఈ మిశ్రమాన్ని కావల్సినట్లు ఐస్ క్రీం అచ్చులో కూడా పోసుకోవచ్చు.
- ఇప్పుడు ఈ మిశ్రమం ఉన్న కంటైనర్ ని డీప్ ప్రీజర్ లో పెట్టి.. సుమారు 7 గంటలు ఉంచండి. 7 గంటల తర్వాత దీనిని బ్లెండర్‌లో వేసి మళ్ళీ ప్రీజ్ చేయండి.
- రాత్రంతా ఫ్రీజ్ అయ్యేలా ప్రీజర్ లో పెట్టి వదిలివేయండి. మర్నాడు జామున్ ఐస్ క్రీమ్ రెడీ. దీనిని సర్వ్ చేయవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




