AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: వేసవిలో ‘విటమిన్ డి’ పొందలేకపోతున్నారా? ఈ పండ్లను డైట్‌లో చేర్చితే సరి..

ఇతర అన్ని విటమిన్లతో పాటు మన శరీరానికి విటమిన్ డి కూడా చాలా అవసరం. విటమిన్ డి మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనదని తెలిసిందే. విటమిన్ డి మన శరీరంలోకి సూర్యరశ్మి ద్వారా వస్తుంది.

Health Tips: వేసవిలో 'విటమిన్ డి' పొందలేకపోతున్నారా? ఈ పండ్లను డైట్‌లో చేర్చితే సరి..
Fruits
Venkata Chari
|

Updated on: Apr 20, 2022 | 4:27 PM

Share

శరీరం సజావుగా నడవడానికి అనేక రకాల పోషకాలు అవసరం. అందులో ఒకటి విటమిన్ డి(vitamin d). శరీరంలో విటమిన్ డి లేకపోవడం వల్ల కండరాల నొప్పులతో పాటు ఎముకలు(Bone Health) బలహీనపడడం, కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి వంటివి వస్తాయి. విటమిన్ డి లోపం తీవ్రమైన సందర్భాల్లో ఆర్థరైటిస్, రికెట్స్, బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది. విటమిన్ డిని సన్‌షైన్ విటమిన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే సూర్యరశ్మి కూడా శరీరంలో విటమిన్ డి లోపాన్ని తొలగిస్తుంది. అయితే వేసవి(Summer) రోజులలో ఎండలో నిలబడటం మాత్రం అసాధ్యం. ఇటువంటి పరిస్థితిలో, వేసవిలో విటమిన్ డి లోపాన్ని ఎలా తీర్చాలనే ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి మీ శరీరంలో విటమిన్ డి లోపాన్ని తీర్చగల కొన్ని పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ డి ఎక్కువగా ఉండే పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరెంజ్- విటమిన్ డి కనిపించే పండ్లు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 75 శాతం మంది పాల ఉత్పత్తులతో అలెర్జీలు కలిగి ఉన్నారు. అదే సమయంలో, శాకాహారులు కొందరు ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో, విటమిన్ డి లోపాన్ని తీర్చడానికి నారింజ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అనేక పోషకాలతో పాటు, నారింజ లేదా నారింజ రసంలో కాల్షియం కూడా కనిపిస్తుంది.

అరటిపండు- అరటిపండు విటమిన్ డికు మంచి మూలంగా కూడా పరిగణించారు. ఎందుకంటే అరటిపండ్లలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది విటమిన్ డిని సక్రియం చేస్తుంది. విటమిన్ డి ప్రయోజనాలను పొందడానికి అవసరమైన మొత్తంలో మెగ్నీషియం తప్పనిసరిగా ఆహారంలో చేర్చాలని కూడా సూచిస్తున్నారు.

బొప్పాయి – సంవత్సరం పొడవునా లభించే బొప్పాయి పండును.. పరిమిత పరిమాణంలో తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి హాని జరగదు. విటమిన్ డితో పాటు విటమిన్ బి, సి కూడా బొప్పాయిలో అధిక మొత్తంలో లభిస్తాయి. ఫాస్పరస్, మెగ్నీషియం, సోడియం ఇందులో ఉంటాయి.

శరీరంలో ‘విటమిన్ డి’ లోపం వల్ల కనిపించే లక్షణాలు..

ఎముకలు బలహీనపడటం- శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే అది ఎముకలపై చెడు ప్రభావం చూపుతుంది. ఎముకలు దృఢంగా ఉండాలంటే శరీరానికి కాల్షియం అవసరం. విటమిన్ డి శరీరంలోని కాల్షియం లోపాన్ని తీరుస్తుంది.

కండరాల నొప్పి – విటమిన్ డి లోపం వల్ల కండరాలలో చాలా నొప్పి ఉంటుంది. శరీరానికి తగినంత విటమిన్ డి అందకపోవడం వల్ల ఇది జరుగుతుంది.

అలసట- ఆఫీసులో లేదా ఇంట్లో ఎక్కువ పని చేయడం వల్ల అలసట మొదలవుతుందని చాలా మంది అర్థం చేసుకుంటారు. విటమిన్ డి లోపం అధిక అలసట కూడా వస్తుంది. విటమిన్ డి లోపం తక్కువ రక్తపోటుకు దారితీస్తుంది.

జుట్టు రాలడం- శరీరంలో విటమిన్ డి లేకపోవడం వల్ల జుట్టు రాలిపోతుంది. జుట్టు రాలడం అనేది స్త్రీలలో సర్వసాధారణం. కానీ, పురుషులలో ఇది విటమిన్ డి లోపం వల్ల కలిగే లక్షణం.

Also Read: Diabetes Tips: షుగర్‌ వ్యాధిగ్రస్థులకు అలర్ట్‌! ఈ అలవాట్లు ఉన్నవారికి ముప్పు ఎక్కువ.. జాగ్రత్త!

Diabetes Control Tips: రక్తంలో బ్లడ్‌ షుగర్‌ అదుపులో ఉండాలంటే.. వీటిని మీ జీవనశైలిలో భాగం చేసుకోవాల్సిందే..