AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Care: ఖాళీ కడుపుతో 30 రోజులు ఈ డ్రింక్స్‌ తాగితే.. మెరిసే అందంతో పాటు.. శరీరంలో అద్భుత మార్పును గమనిస్తారు..

విటమిన్ సి శరీరంలోని తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది అంటువ్యాధులను నివారించడానికి ఉపయోగిస్తారు. రోజుకు ఒకటి నుండి రెండు టీస్పూన్ల ఉసిరి రసం తీసుకుంటే.. ఆశించిన ఫలితాలను పొందుతారు. మీరు తొలుత కనీస మోతాదుతో ప్రారంభించడం, క్రమంగా పెంచడం చాలా ముఖ్యం. పెద్ద మొత్తంలో గూస్బెర్రీ జ్యూస్ తీసుకోవడం వల్ల కొంతమందిలో అతిసారంతో సహా ఇతర సైడ్‌ ఎఫెక్ట్స్‌ కలిగే ప్రమాదం కూడా లేకపోలేదు.

Beauty Care: ఖాళీ కడుపుతో 30 రోజులు ఈ డ్రింక్స్‌ తాగితే.. మెరిసే అందంతో పాటు.. శరీరంలో అద్భుత మార్పును గమనిస్తారు..
Amla Juice
Jyothi Gadda
|

Updated on: Oct 07, 2023 | 8:43 AM

Share

అద్భుతమైన పోషకాలు, ఆరోగ్య విలువల కారణంగా ఉసిరిని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. ఉసిరిలో పుష్కలమైన పోషకాలు నిండి ఉంటుంది. ఇందులో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. అలాగే, ఇందులో చక్కెర చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని సాధారణంగా ఉసిరి రసం, చట్నీ, కూరలు, ఊరగాయ వంటివి మరెన్నో వండుతారు. వాడుతుంటారు. మీరు బరువు తగ్గడానికి, మీ శరీరం నుండి విష వ్యర్థాలను బయటకు పంపడానికి సహాయపడే సూపర్‌ డ్రింక్‌ ఇది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ డ్రింక్‌ తాగటం వల్ల అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. ఉసిరికాయ విటమిన్ సితో నిండి ఉంటుంది. ఇది చర్మ సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది. దెబ్బతిన్న కణాలను రిపేర్ చేస్తుంది. మంచి చర్మ ఆరోగ్యాన్ని అందిస్తుంది. బరువు తగ్గడానికి కూడా ఇది అద్భుతమైన డ్రింక్‌ ఉసిరి రసం. ఇది ఇంకా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. విటమిన్ సితో పాటు, ఉసిరి రసంలో ఇతర విటమిన్లు, ఖనిజాలు కూడా ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. కానీ, ఉసిరి రసం తాగే సమయం, విధానం చాలా ముఖ్యం. అందుకే 30 రోజుల పాటు ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసాన్ని తాగడం వల్ల మీ శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులను మీరే స్వయంగా గమనిస్తారు..

ఉసిరి రసం ఆరోగ్య ప్రయోజనాలు..

ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

ఇవి కూడా చదవండి

1. వేగంగా బరువు తగ్గుతారు.

2. మెరుగైన జీర్ణక్రియ.

3. పేగుల్లో మంట, పేడు కదలిక మొదలైనవాటిని నిర్వహించడానికి సహాయపడుతుంది.

4. రోగనిరోధక శక్తిని పెంచుతుంది

5. మెరుగైన చర్మ ఆరోగ్యం.

6. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఉసిరికాయ రసం ఖాళీ కడుపుతో 30 రోజులు త్రాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

బరువు తగ్గడం

ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. ఉసిరిలో ఫైబర్ అధికంగా ఉండి.. మీకు చాలా సమయం వరకు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఈ పానీయం శరీరం జీవక్రియను పెంచడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

జీర్ణక్రియకు సహకరిస్తుంది..

మీరు ఎలాంటి జీర్ణ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా, ఉసిరి రసంతో మీ రోజును ప్రారంభించండి. ఉసిరి జ్యూస్ ఒక సహజ భేదిమందు..జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

ఉసిరికాయ చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది..

చర్మ ఆరోగ్యాన్ని నిర్వహించడంలో ఉసిరి రసం ఎంత ప్రభావవంతంగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యకరమైన చర్మానికి అవసరం. చర్మ కణాల నష్టం, చర్మం ముడతలు రెండింటినీ విటమిన్ సి నివారిస్తుంది.

మంటను తగ్గిస్తుంది…

మీరు గుండె జబ్బులు, క్యాన్సర్, ఆర్థరైటిస్ వంటి ఏదైనా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతుంటే, ఉసిరి రసంతో మీ రోజును ప్రారంభించండి. ఉసిరి రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరం అంతటా మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది..

ఉసిరి జ్యూస్‌ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉసిరి రసంలో ఉండే విటమిన్ సి ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు అతి ముఖ్యం. విటమిన్ సి శరీరంలోని తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది అంటువ్యాధులను నివారించడానికి ఉపయోగిస్తారు.

రోజుకు ఒకటి నుండి రెండు టీస్పూన్ల ఉసిరి రసం తీసుకుంటే.. ఆశించిన ఫలితాలను పొందుతారు. మీరు తొలుత కనీస మోతాదుతో ప్రారంభించడం, క్రమంగా పెంచడం చాలా ముఖ్యం. పెద్ద మొత్తంలో గూస్బెర్రీ జ్యూస్ తీసుకోవడం వల్ల కొంతమందిలో అతిసారంతో సహా ఇతర సైడ్‌ ఎఫెక్ట్స్‌ కలిగే ప్రమాదం కూడా లేకపోలేదు.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…