AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాజుకైన నడుముతో, ఈజీగా బరువును తగ్గించే ఏకైక ఔషధం ఇంగువ నీరు..! ట్రై చేసి చూడండి..

ఇందులో యాంటీ ఒబెసిటీ గుణాలు ఉన్నాయి. బరువు తగ్గడానికి ఇంగువ నీరు చాలా ఉపయోగపడుతుంది.గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ కలుపుకుని ఆ నీటిని తాగడం వల్ల బరువు తగ్గుతారు. దీన్ని తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. బహిష్టు నొప్పికి కూడా ఈ ఇంగువ నీరు బాగా ఉపయోగపడుతుంది. పీరియడ్స్ సమయంలో మహిళలు నొప్పిగా ఉంటే.. ఈ ఇంగువ నీటిని తాగడం మంచిది.

నాజుకైన నడుముతో, ఈజీగా బరువును తగ్గించే ఏకైక ఔషధం ఇంగువ నీరు..! ట్రై చేసి చూడండి..
Hing Wate
Jyothi Gadda
|

Updated on: Oct 07, 2023 | 9:35 AM

Share

ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు, ఉబకాయంతో బాధపడుతున్నారు. చేస్తున్న ఉద్యోగం, పెద్దగా శరీర శ్రమ లేకుండా ఉండటం వల్ల చాలా మంది వేగంగా బరువు పెరుగుతున్నారు. మన వంటగదిలో లభించే పదార్థాలను ఉపయోగించి బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు ఆహారంలో ఇంగువను చేర్చుకోవాలి. ఎందుకంటే దీన్ని తాగడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. కాబట్టి బరువు తగ్గాలనుకునే ముందు ఈ ఇంగువ నీళ్లను అలవాటు చేసుకోవడం మంచిది.

ప్రస్తుతం మనం అనుసరిస్తున్న బిజీ లైఫ్ స్టైల్.. అనారోగ్యకరమైన ఆహార పదార్థాల వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. బరువు పెరుగుతుంది. బరువు పెరగడం వల్ల తీవ్రమైన సమస్యలే కాకుండా ఇతర వ్యాధులు కూడా ఎటాక్‌ చేస్తున్నాయి.. ముఖ్యంగా.. అధిక బరువు వల్ల మధుమేహం, హైబీపీ, గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. బరువు తగ్గడం అంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఇందుకోసం ఇతర ఔషధాలే కాకుండా రోజూ వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. వీటితో పాటు తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యం. మనం తినే ఆహారం మన శరీర బరువును అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గడానికి చాలా మంది రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇంగువను ఉపయోగించడం ద్వారా మీరు శరీర బరువును తగ్గించుకోవచ్చు.

సాధారణంగా ఇంగువ గురించి మనందరికీ తెలుసు. కొంతమంది ఇళ్లలో వంటల్లో ఇంగువను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇంగువను వంటలో వాడటం వల్ల మంచి రుచి, మంచి సువాసనతో పాటుగా బరువు కూడా తగ్గుతారు.. ఇంగువ బరువును తగ్గించడమే కాకుండా మైగ్రేన్ సమస్యను కూడా నివారిస్తుంది. తలనొప్పి అనేక రూపాల్లో వస్తుంది. ఇది ఎలాంటి తలనొప్పి సమస్యలను అయినా తగ్గిస్తుంది. ఇంగువ జీవక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణశక్తిని బలోపేతం చేయడానికి ఇంగువ నీరు ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఇంగువలో యాంటీ ఒబెసిటీ గుణాలు ఉన్నాయి. బరువు తగ్గడానికి ఇంగువ నీరు చాలా ఉపయోగపడుతుంది.గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ కలుపుకుని ఆ నీటిని తాగడం వల్ల బరువు తగ్గుతారు. దీన్ని తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. బహిష్టు నొప్పికి కూడా ఈ ఇంగువ నీరు బాగా ఉపయోగపడుతుంది. పీరియడ్స్ సమయంలో మహిళలు నొప్పిగా ఉంటే.. ఈ ఇంగువ నీటిని తాగడం మంచిది.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…