AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curd : రోజూ పెరుగు తింటున్నారా.. అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

పెరుగు...దాదాపు అందరూ ఇష్టంగా తింటూ ఉంటారు. ఇక వేసవిలో అయితే, పెరుగు డిమాండ్ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం చాలా మంది పెరుగు, మజ్జిగను తీసుకుంటారు. అయితే, ఇలా ఏదో ఒక రూపంలో రోజూ పెరుగు తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయో పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం...

Curd : రోజూ పెరుగు తింటున్నారా.. అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!
Curd
Jyothi Gadda
|

Updated on: Mar 03, 2025 | 1:14 PM

Share

పెరుగు తినడం వల్ల పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగులో ప్రోటీన్స్, కాల్షియం, విటమిన్లు, మినరల్స్ ఇలా శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎముకలకి చాలా మంచిది. పెరుగులోని ప్రోబయోటిక్స్ జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది. ఇది అసిడిటీ, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.

రోజూ పెరుగు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగులోని కాల్షియం, విటమిన్లు, కేలరీలు, ప్రోటీన్ శరీరానికి సరైన పోషణను అందిస్తాయి. పెరుగు కాల్షియం, విటమిన్లు B2, B12, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటుంది. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పెరుగులో కొవ్వు తక్కువగా ఉంటుంది. గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇందులోని కొవ్వు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

రోజూ పెరుగు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది. పెరుగులోని ప్రోటీన్స్ అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. కాబట్టి బరువు కూడా తగ్గుతారు. ఇక ఇందులోని కాల్షియం తలనొప్పి తగ్గిస్తాయి. అంతేకాదు..పెరుగు తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పెరుగు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పెరుగు చుండ్రుతో సహా అనేక జుట్టు సమస్యలను తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్