Stuffed Kala Jamun: కోవా, పన్నీర్, రవ్వతో స్వీట్ షాపు రుచిలో కాలా జామున్ తయారీ విధానం
Stuffed Kala Jamun: రోజు రోజుకీ పెరుగుతున్న ధరలు.. పెరగని జీతం.. దీంతో ఏమి కొనాలన్నా ఏమి తినాలన్నా కొంచెం ఆలోచించాల్సిందే.. ముఖ్యంగా పిల్లలకు చిరుతిండి కోసం స్వీట్స్ కొనాలంటే.. బడ్జెట్ గురించి ఆలోచించాలి అనుకునేవారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మంచి క్వాలిటీ గల స్వీట్స్ ధర చాలా ఎక్కువ ఉంటుంది. అంత ధర పెట్టి ఆ స్వీట్స్ కొన్నా తృప్తిగా తినలేని పరిస్థితి.. అందుకని తక్కువ ధరతో ఇంట్లోనే స్వీట్స్ ను తయారు చేసుకోవచ్చు. […]
Stuffed Kala Jamun: రోజు రోజుకీ పెరుగుతున్న ధరలు.. పెరగని జీతం.. దీంతో ఏమి కొనాలన్నా ఏమి తినాలన్నా కొంచెం ఆలోచించాల్సిందే.. ముఖ్యంగా పిల్లలకు చిరుతిండి కోసం స్వీట్స్ కొనాలంటే.. బడ్జెట్ గురించి ఆలోచించాలి అనుకునేవారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మంచి క్వాలిటీ గల స్వీట్స్ ధర చాలా ఎక్కువ ఉంటుంది. అంత ధర పెట్టి ఆ స్వీట్స్ కొన్నా తృప్తిగా తినలేని పరిస్థితి.. అందుకని తక్కువ ధరతో ఇంట్లోనే స్వీట్స్ ను తయారు చేసుకోవచ్చు. ఈరోజు రుచికరమైన కాలా జామూన్ తయారీ విధానంగురించి తెలుసుకుందాం
కావాల్సిన పదార్ధాలు :
కోవా – 400 గ్రాములు పన్నీర్ – 100గ్రాములు బొంబాయి రవ్వ ఒక టేబుల్ స్పూన్ మైదా -అరకప్పు బాదాం కాజు పిస్తా పలుకులు చిన్నగా తరిగినవి స్పూన్ బేకింగ్ పౌడర్ – 6)చిన్న స్పూన్ నెయ్యి -ఎం వేయించడానికి సరిపడా చెక్కర -కేజీ
తయారీ విధానం :
ముందుగా పన్నీర్ ను ఉండలు లేకుండా బాగా కలిపి అందులో స్పూన్ బొంబాయి రవ్వ ,పావు స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి బాగా అరచేతితో స్మాష్ చేయాలి. అనంతరం కోవా కూడా వేసి బాగా స్మాష్ చేయాలి .కొద్దిగా మైదా కూడా వేసి కలిపి బాగా మెత్తగా స్మూత్ గా వచ్చేలా స్మాష్ చేయాలి .
తర్వాత ఒక గిన్నె తీసుకుని పంచదారలో రెండు కప్ లతో నీళ్లు పోసి దానిని స్టౌ మీద పెట్టుకోవాలి . చెక్కరపాకం తయారు అయ్యేలోపు తయారు చేసుకున్న జామూన్ మిశ్రమాన్ని రెండు స్పూన్స్ పక్కకు తీసుకొని అందులో కొద్దిగ చెక్కర ,చిటికెడు కలర్ ,డ్రై ఫ్రూప్ట్స్ వేసి కలిపి చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి.
ఇంతలో పంచదార పాకం తయారు అవుతుంది. దానిని తీసుకుని ఓ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు జామూన్ మిశ్రమాన్ని పెద్ద ఉండలుగా చేసుకొని ఒక్కొక్క దానిలో పూర్ణం వలె చిన్న కలర్ ఉండను పెట్టి ముసివేసి గుండ్రంగా కాని ,కోలగా కాని చేసి పెట్టుకోవాలి . 7)ఇలా తయారయిన వాటిని నూనెలో చిన్న మంటలో నల్లగా అయ్యేవరకు వేయించి తీసుకోవాలి. ఇలా వేయించిన జామూన్లను పంచదార పాకంలో వేయాలి.. వాటికీ పాకం బాగా పట్టిన తర్వాత తినెయ్యడమే..
Also Read: డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఆకర్షణీయమైన జీతం.. వివరాలోకి వెళ్తే..