Food for Bone Health: వీటిని ఒక్కసారి తిన్నారంటే మీ ఎముకలు బలంగా మారుతాయ్‌..

ఆరోగ్యాన్ని కాపాడడంలో నిత్యం ఉపయోగించే కూరగాయలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మనం నిత్యం తీసుకునే కూరగాయలలో టమాటా కూడా ఒకటి. ప్రపంచంలోని..

Food for Bone Health: వీటిని ఒక్కసారి తిన్నారంటే మీ ఎముకలు బలంగా మారుతాయ్‌..
Sun Dried Tomatoes

Updated on: Feb 16, 2023 | 7:19 PM

ఆరోగ్యాన్ని కాపాడడంలో నిత్యం ఉపయోగించే కూరగాయలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మనం నిత్యం తీసుకునే కూరగాయలలో టమాటా కూడా ఒకటి. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ఆహార అలవాట్లలో టమాట కీలకమైనంది. వంటకాల్లో టమాట పాత్ర ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తాజా టమాటా మాత్రమేకాకుండా ఎండిన టమాటా వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. డ్రై టమోటాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వెంటనే మీ ఆహారంలో చేర్చుకుంటారు. ఎండిన టమాటాలలో విటమిన్ ఎ, ఇ, సి, బి6, నియాసిన్, కాపర్, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, మాంగనీస్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఐరన్, ఫాస్పరస్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే కేవలం ఎండిన టమాటాలలో కూడా ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిలో విటమిన్ సి, కె, నియాసిన్, కాపర్, ప్రొటీన్, మాంగనీస్, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. టొమాటాలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ రోగనిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది.

డ్రై టమోటాలు తినడం వల్ల న్యుమోనియా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది. గుండె సమస్యలు, గుండె పోటు, కిడ్నీ వ్యాధులు, గుండె పోటు వంచి సమస్యలను తగ్గించడంలో డ్రై టమాటాలు ఉపయోగపడతాయి. గుండె కండరాలను కూడా బలపరుస్తుంది. ఎముకల దృఢంగా ఉండటానికి సహాయపడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.