Soaked Almonds: మీరు ఉదయాన్నే నానబెట్టిన బాదం తింటారా? ఈ విషయం తెలిస్తే షాకవుతారు

| Edited By: Anil kumar poka

Dec 15, 2022 | 12:50 PM

చాలా మంది బాదం పప్పును రాత్రి నానబెట్టి ఉదయాన్నే పొట్టు తీసేసి తింటారు. అలాగే పచ్చి బాదం పప్పు కంటే నానబెట్టిన బాదం పప్పు ద్వారానే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని వారి బలమైన నమ్మకం. 

Soaked Almonds: మీరు ఉదయాన్నే నానబెట్టిన బాదం తింటారా? ఈ విషయం తెలిస్తే షాకవుతారు
Almonds
Follow us on

కరోనా అనంతరం మన దేశంలో డ్రై ఫ్రూట్స్ వినియోగం భారీగా పెరిగింది. రోగం ఎలాంటిదైనా పౌష్టికాహారంతో ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చని ప్రజలు భావిస్తుండడంతో బాదం, కర్జూరం, జీడిపప్పు, ఇతర డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువుగా తింటున్నారు. అయితే అన్నింట్లో కంటే బాదం పప్పును అధికంగా వినియోస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారు, అలాగే జిమ్స్ లో వర్క్ అవుట్ చేసేవారి రోజువారి డైట్ లో కచ్చితంగా బాదం పప్పు ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా తేలికగా పట్టుకెళ్లడానికి కూడా వీలుగా ఉండడంతో చాలా మంది బాదం పప్పును ఇష్టపడతారు. బాదం పప్పును డైరెక్ట్ తీసుకోకున్నా..జ్యూస్ లు, డిజర్ట్స్ వంటి వాటి ద్వారా ప్రతి ఒక్కరూ కచ్చితంగా బాదాన్ని వినియోగిస్తారు. అయితే చాలా మంది బాదం పప్పును రాత్రి నానబెట్టి ఉదయాన్నే పొట్టు తీసేసి తింటారు. అలాగే పచ్చి బాదం పప్పు కంటే నానబెట్టిన బాదం పప్పు ద్వారానే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని వారి బలమైన నమ్మకం. 

రెండింట్లో ఏది మంచిది?

నానబెట్టిన లేదా పచ్చి బాదం పప్పు రెండింట్లో ఏది మంచిది అని చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు. కొంతమందైతే నానబెట్టిన బాదం పప్పే మంచిదని కూడా వాదిస్తుంటారు. అయితే తాజా నివేదికల్లో పచ్చి బాదం పప్పు లేదా నానబెట్టిన బాదం ఏది తిన్నా ఒక్కటే తేలింది. నానబెట్టిన బాదం పప్పు మంచిది అనే వాదన కేవలం అపోహ మాత్రమే తేలింది. బాదం పప్పు ఏ రూపంలో ఉన్నా అందులో ఉండే విటమిన్ బి 2, విటమిన్ ఈ, మెగ్నీషియం, పాస్పరస్ వంటి వాటిల్లో ఎలాంటి తేడాలు ఉండవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నానబెట్టిన బాదం పప్పు నమలడానికి సులభంగా ఉండడంతో చాలా మంది ఆ రూపంలోనే తీసుకుంటారని చెబుతున్నారు. బాదం పప్పు ఆరోగ్యకరమైన పౌష్టికాహారమని ఏ రూపంలోనైనా నిరభ్యంతరంగా తీసుకోవచ్చని సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి