Diwali Special Recipe: దీపావళి స్పెషల్ షుగర్ ఫ్రీ ఆల్మండ్ బర్ఫీ తయారు చేసుకొనే విధానం ఎలా అంటే..
Diwali 2021 Special Recipe: దీపావళి పండగ రోజున కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. విందు వినోద కార్యకర్తలతో ఎంజాయ్ చేస్తారు..
Diwali 2021 Special Recipe: దీపావళి పండగ రోజున కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. విందు వినోద కార్యకర్తలతో ఎంజాయ్ చేస్తారు. దీపావళికి స్వీట్స్ ఇచ్చి పుచ్చుకుని గ్రీటింగ్ చెప్పుకుంటారు. అయితే పండగ స్పెషల్ గా తయారు చేసిన స్వీట్స్ ను ఇంట్లోని మధుమేహ వ్యాధి రోగులు ఉంటే తినలేరు. అప్పుడు అయ్యో అనిపించకమానదు ఎవరికైనా.. అయితే ఈరోజు పండగ స్పెషల్ గా ఇంట్లోనే ఈగా షుగర్ ఫ్రీ స్వీట్ గ్రిల్డ్ ఆల్మండ్ బర్ఫీ తయారీ గురించి తెలుసుకుందాం..
తయారీకి కావాల్సిన పదార్ధాలు:
కోవా – 300 గ్రాములు స్వీటెనర్ -40 గ్రాముల అప్షనల్ బాదంపప్పులు కాల్చినవి- 1 కప్పు
బాదంపప్పులు- తరిగినవి 1 కప్పు
గ్రిల్డ్ ఆల్మండ్ బర్ఫీ (షుగర్ ఫ్రీ) తయారు విధానం: ముందుగా కోవాను తురుము చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి.. వేడి చేసి కోవా వేడిచేయాలి. అనంతరం స్వీటెనర్ వేసి స్విమ్ లో పెట్టి.. 3-4 నిమిషాలు వేడి చేయాలి. తర్వాత కాల్చిన బాదాంలను పౌడర్ గా చేసుకుని ఈ కోవా స్వీటర్నర్ మిశ్రమంలో కలపండి. తర్వాత బాదం ముక్కలను వేసుకోవాలి.. కొంచెం సేపటి తర్వాత ఈ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్ లోకి బదిలీ చేయాలి. తర్వాత ఈ మిశ్రమంపైన స్వీటెనర్‌ను చల్లుకోవాలి. అనంతరం 200 సి వద్ద వేడిచేసిన ఓవెన్‌లో డిష్‌ను ఉంచండి. తరవాత చక్కర పాకాన్ని చిన్నగా పైన జల్లండి. ఒవేన్ లో గ్రిల్ అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని పైన ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ముక్కలతో అలంకరించండి. అంతే గ్రిల్డ్ ఆల్మండ్ బర్ఫీ రెడీ..
Also Read: పిల్లల్ని క్రాకర్స్ కాల్చనివ్వండి.. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇలా చేయండి.. జగ్గీ వాసుదేవ్ సలహా..