AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశీ నెయ్యితో ఈ 5 ఆరోగ్య సమస్యలకు చెక్‌..! అంతేకాదు బరువు కూడా అదుపులో ఉంటుందని మీకు తెలుసా..?

Desi Ghee Benfits: దేశీ నెయ్యి ప్రతి ఇంట్లో సులభంగా లభిస్తుంది. దీనిని చాలామంది ఇళ్లలోనే తయారుచేస్తారు. దేశీ నెయ్యి మీ వంటగదిలో

దేశీ నెయ్యితో ఈ 5 ఆరోగ్య సమస్యలకు చెక్‌..! అంతేకాదు బరువు కూడా అదుపులో ఉంటుందని మీకు తెలుసా..?
Desi Ghee
uppula Raju
|

Updated on: Aug 25, 2021 | 10:09 AM

Share

Desi Ghee Benfits: దేశీ నెయ్యి ప్రతి ఇంట్లో సులభంగా లభిస్తుంది. దీనిని చాలామంది ఇళ్లలోనే తయారుచేస్తారు. దేశీ నెయ్యి మీ వంటగదిలో ఉంచిన నిధి ఇది మీ ఆరోగ్యాన్ని సుసంపన్నం చేస్తుంది. దేశీ నెయ్యి తింటే అనేక రోగాలు నయమవుతాయని తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీరు ప్రతిరోజూ దేశీ నెయ్యి తింటే ఈ ఐదు ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

1. కళ్లకు మేలు చేస్తుంది దేశీ నెయ్యి కళ్లకు అమృతంగా పరిగణిస్తారు. మీరు ప్రతిరోజూ మీ ఆహారంలో దేశీ నెయ్యిని తీసుకుంటే అది మీ కంటికి మేలు చేస్తుంది. తక్కువ దృష్టి ఉన్నవారు లేదా అద్దాలు ఉన్నవారు దీనిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇది మీ కళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దేశీ నెయ్యిలో ఉండే అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు మీ శరీరానికి మేలు చేస్తాయి.

2. కొలెస్ట్రాల్‌ని నియంత్రిస్తుంది దేశీ నెయ్యి మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా నిరోధిస్తుంది. అంతేకాదు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తొలగిస్తుంది. దేశీ నెయ్యిలో ఉండే కొలెస్ట్రాల్ శరీరానికి హాని కలిగించదు. ఇందులోని కొలెస్ట్రాల్‌ గుండెకు ఎంతో మేలు చేస్తుంది. అయితే నెయ్యి తిన్న తర్వాత మీరు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. దేశీ నెయ్యి తినడం వల్ల ఎముకలు బలపడతాయి. ఎముకలకు సంబంధించిన ఏదైనా వ్యాధి ఉన్న వ్యక్తులకు వైద్యులు దేశీ నెయ్యి తినమని సలహా ఇస్తారు. ఈ వ్యక్తులు పప్పుతో నెయ్యిని ఉపయోగిస్తే ఎముకల బలహీనత తొలగిపోతుంది.

3. బరువు తగ్గడానికి నెయ్యి ఎలా సహాయపడుతుంది నెయ్యిలో పుష్కలంగా పోషకాలు ఉంటాయి ఇవి బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. నెయ్యిలో 99.9 శాతం కొవ్వు, 1 శాతం కొవ్వులో కరిగే విటమిన్‌లతో పాటు తేమ, పాల ప్రోటీన్ ఉంటాయి. నెయ్యిలో కొవ్వు ఆమ్లాల కూర్పును అర్థం చేసుకోవడానికి ఒక అధ్యయనం జరిగింది. ఇందులో దేశీ నెయ్యి బరువు తగ్గిస్తుందని నిరూపణ అయింది.

4. ఈ అంశాలు నెయ్యిలో ఉంటాయి వాల్‌నట్స్, చేప నూనె, అవిసె గింజలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లకు మంచి వనరులు. ఇవి క్యాన్సర్, గుండెపోటు, ఇన్సులిన్ నిరోధకత, ఆర్థరైటిస్, హైపర్యాక్టివిటీ డిజార్డర్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి. అయితే ఒమేగా 3 ఫ్యాట్ (DHA), ఒమేగా 6 (CLA) నెయ్యిలో పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది బరువు తగ్గడానికి చాలా మంచిదని భావిస్తారు.

5. ఈ విధంగా బరువు తగ్గుతారు నెయ్యిలో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజూ ఒకటి లేదా రెండు టీస్పూన్ల నెయ్యి తినడం ద్వారా బరువు అదుపులో ఉంటుంది. ఇది అమైనో ఆమ్లాలతో సమృద్ధిగా ఉంటుంది. కొవ్వు కణాల పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నెయ్యిని రెండు చెంచాల కంటే ఎక్కువ తినకూడదని గుర్తుంచుకోండి.

మ్యాచ్‌ ముందు రోజు మద్యం సేవించాడు.. సెంచరీతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.. అతడెవరంటే?

Viral Video: సైలెంట్‌గా పక్షిని వేటాడి మింగేసిన తాబేలు.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

India Corona Cases: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు మరణాల సంఖ్య ఇలా