Viral Video: సైలెంట్‌గా పక్షిని వేటాడి మింగేసిన తాబేలు.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

సాధారణంగా తాబేళ్లు సాధు జీవులు. మీరు చిన్నప్పటి నుంచి తాబేళ్ల గురించి ఎన్నో కథలు విని ఉంటారు. అవి శాఖాహారులుగా...

Viral Video: సైలెంట్‌గా పక్షిని వేటాడి మింగేసిన తాబేలు.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!
Tortoise
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 25, 2021 | 10:19 AM

సాధారణంగా తాబేళ్లు సాధు జీవులు. మీరు చిన్నప్పటి నుంచి తాబేళ్ల గురించి ఎన్నో కథలు విని ఉంటారు. అవి శాఖాహారులుగా ఓ మార్క్ పడి ఉంటుంది. అయితే మీరు అలా అనుకుంటే పొరపాటే.! ఇప్పుడు చూపించబోయే వీడియో.. మిమ్మల్ని ఓ షాక్‌కు గురి చేస్తుంది. తాబేళ్లు ఇలా కూడా వేటాడటాయా.? అని అనిపిస్తుంది. ఈ వీడియోను ఫ్రెగేట్‌ ఐలాండ్‌లో గత నెలలో రికార్డు చేశారు. ఇందులో ఓ భారీ ఆడ తాబేలు పిల్ల పక్షిని ఎలా పాక్కుంటూ వేటాడుతోంది మీరు చూడవచ్చు. ఈ ఐలాండ్‌లో మొత్తం 3 వేలకు పైగా తాబేళ్లు ఉన్నాయి.

తాబేలు ఇలాంటి దాడి చేస్తుందని పరిశోధకులు అస్సలు ఊహించలేదు. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ మ్యూజియం ఆఫ్‌ జువాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జస్టిన్‌ గెర్లాచ్‌ కూడా తాబేలు నుంచి ఇదొక ఊహించని పరిణామం అని అన్నారు. ఆ ఐలాండ్‌లోని తాబేళ్లలో ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రవర్తన పెరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

కాగా, తాబేళ్ళకు కోపం, చికాకు వచ్చినప్పుడు దాడులు చేస్తుంటాయి. అయితే ఇలాంటి దాడిని ఎవరూ ఊహించలేరు. ఇక ఇటీవల కాలంలో పక్షి పిల్లలను, గుడ్లను తాబేళ్లు తిన్తున్నాయని ప్రచారం జరిగింది. అయితే వాటిని పరిశోధకులు కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు ఈ వీడియోను చూసిన తర్వాత వారి అంచనాలన్నీ తారుమారు అయ్యాయి. వాటి జీవన విధానానికి మార్పుకు ఎన్నో కారణాలు ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. అయితే వారి జీవనశైలికి విరుద్దంగా ఇలా ప్రవర్తిస్తే..? అవి ఎంతకాలం మనుగడను సాగించగలవో? తెలియాలంటే  కొంతకాలం పరిశోధనలు జరపాలని ప్రముఖ హెర్పటాలజిస్ట్‌ జేమ్స్‌ గిబ్స్‌ స్పష్టం చేశారు.

Tortoise 2

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!