AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rava Bonda: రవ్వతో చిటికలో హెల్తీ స్నాక్.. ఇవి రుచి చూస్తే మైదా వాడటం మానేస్తారు..

రవ్వతో చేసే ఉప్మా అంటే చాలామందికి అస్సలు నచ్చదు. కానీ, ఇందులో చాలా మందికి తెలియని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రవ్వలో సెలీనియం అనే పదార్థం ఉంటుంది. అది గుండెను రక్షిస్తుంది. రవ్వలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. అది రక్త ప్రసరణను మెరుగుపరిచి, శరీరానికి అవసరమైన శక్తిని పెంచుతుంది. అలాగే, రవ్వ రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది. రవ్వతో రుచికరమైన రవ్వ బోండా ఎలా తయారు చేయాలో చూద్దాం.

Rava Bonda: రవ్వతో చిటికలో హెల్తీ స్నాక్.. ఇవి రుచి చూస్తే మైదా వాడటం మానేస్తారు..
Delicious Rava Bonda Recipe
Bhavani
|

Updated on: Sep 17, 2025 | 7:06 PM

Share

సాయంత్రం వేళల్లో అల్పాహారం కోసం చాలామంది రకరకాల వంటకాలు ఆలోచిస్తుంటారు. ఒక్కోసారి ఏం చేయాలో తెలియక తికమక పడుతుంటారు. కొందరు మైదాతో అప్పటికప్పుడు స్నాక్స్ చేస్తుంటారు. ఇవి ఆరోగ్యాన్ని పాడుచేయడంలో ముందుంటాయి. రవ్వ బోండా లాంటి ఒక సులభమైన వంటకం మీ ఆకలిని తీర్చడమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

కావాల్సిన పదార్థాలు:

రవ్వ: 1 కప్పు (200 గ్రాములు)

పెరుగు: 1 కప్పు (250 మిల్లీలీటర్లు)

జీలకర్ర: 1 టీస్పూన్

ఉప్పు: ½ టీస్పూన్

కరివేపాకు: కొద్దిగా

కొత్తిమీర: కొద్దిగా

అల్లం: కొద్దిగా

పచ్చిమిర్చి: 3

నీరు: 100 మిల్లీలీటర్లు

తయారు చేసే విధానం:

ఒక పెద్ద గిన్నెలో రవ్వ, ఉప్పు, తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, తురిమిన అల్లం, జీడిపప్పు వేసి బాగా కలపాలి.

తర్వాత పెరుగు కలపాలి. కొద్దిగా నీళ్లు చల్లుతూ గట్టిగా పిసికి ముద్దలా చేయాలి. పిండి కొద్దిగా వదులుగా ఉంటే మరింత మంచిది.

పిసికిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, చేతికి నూనె రాసుకుని గుండ్రంగా చుట్టాలి.

ఒక కడాయిలో నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె వేడయ్యాక, సిద్ధం చేసుకున్న రవ్వ బోండాలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. అవి కరకరలాడేలా వేయించుకోవాలి.

ఈ విధంగా రుచికరమైన, కరకరలాడే రవ్వ బోండా సిద్ధం అవుతుంది. దీనిని టీతో సాయంత్రం అల్పాహారంగా తినవచ్చు.

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..