Carrot Juice Benefits: శీతాకాలంలో క్యారెట్ జ్యూస్ తాగితే ఇన్ని లాభాలా? తెలిస్తే వావ్ అంటారు

| Edited By: Anil kumar poka

Dec 18, 2022 | 4:25 PM

శరీరం అనారోగ్యం, ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా మనం శరీరానికి అవసరమయ్యే పోషకాలను అందించాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ ఇష్టపడే క్యారెట్ తో జ్యూస్ చేసుకుని సేవించడం వల్ల అద్భుత ప్రయోజనాలను పొందవచ్చు. శీతాకాలంలో క్యారెట్ జ్యూస్ తాగితే వచ్చే లాభాాలను మనం తెలుసుకుందాం. 

Carrot Juice Benefits: శీతాకాలంలో క్యారెట్ జ్యూస్ తాగితే ఇన్ని లాభాలా? తెలిస్తే వావ్ అంటారు
Carrot
Follow us on

నిద్ర మీద ప్రేమతో మనం చలికాలంలో శరీరానికి తగిన శ్రమను ఇవ్వం. మామూలుగా ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడానికి బద్ధకిస్తుంటాం. కానీ శరీరానికి శీతాకాలంలోనే ఎక్కువ పని ఉంటుంది. చల్లని వాతావరణం కారణంగా శరీరం సాధారణ ఉష్ణోగ్రతను మెయింటెన్ చేయడానికి మరింత ప్రభావంతంగా పని చేస్తుంది. కాబట్టి శరీరం అనారోగ్యం, ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా మనం శరీరానికి అవసరమయ్యే పోషకాలను అందించాల్సి ఉంటుంది. శీతాకాలంలో అధికంగా దొరికే కూరగాయలను సేవించడం ద్వారా మనం మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందించవచ్చు. అయితే అన్ని రకాల కూరగాయలను మనం ఇష్ట పడకపోవచ్చు. కాబట్టి అందరూ ఇష్టపడే క్యారెట్ తో జ్యూస్ చేసుకుని సేవించడం వల్ల అద్భుత ప్రయోజనాలను పొందవచ్చు. శీతాకాలంలో క్యారెట్ జ్యూస్ తాగితే వచ్చే లాభాాలను మనం తెలుసుకుందాం. 

రోగ నిరోధక శక్తి పెరుగుదల:

శీతాకాలంలొో ప్రతి రోజూ ఓ గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే శరీరాన్ని ప్రీ రాడికల్స్ డ్యామెజ్ నుంచి రక్షించడమే కాక, హానికర బ్యాక్టిరియా, వైరస్ ల నుంచి రక్షణ పొందడానికి సాయం చేస్తుంది. 

చర్మ సమస్యలు దూరం:

క్యారెట్ ఉండే బీటా కొరిటిన్ అనేది విటమన్ ఏ కు సంబంధించింది. దీని యాంటి ఇన్ ఫ్లమేటరీ గుణాలు కణజాల పునర్నిర్మాణాన్ని ప్రోత్సహిస్తాయి. ఈ క్యారెట్ జ్యూస్ లో ఉండే అధిక ఫైబర్ కారణంగా మొటిమల సమస్య నుంచి బయటపడవచ్చు.

ఇవి కూడా చదవండి

బ్లడ్ షుగర్ నుంచి రక్షణ:

బ్లడ్ షుగర్ తో బాధపడేవారు తరచూ క్యారెట్ జ్యూస్ తాగడం శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ తగిన మొత్తంలో మెయిన్ టెయిన్ అవుతాయి. క్యారెట్ లో ఉండే క్యాలరీలు, విటమిన్లు, మినరల్స్ మధుమేహాన్ని నిరోధించడానికి పోరాడతాయి. 

గుండె జబ్బులు దూరం:

క్యారెట్ జ్యూస్ లో ఉండే బీటా కోరెటిన్ గుండె జబ్బులకు దారితీసే ప్రీ రాడికల్స్ పోరాడానికి చాలా అవసరం. క్యారెట్ జ్యూస్ లో విటమిన్ సి, ఇ, అలాగే ఫోలెట్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ కారణంగా చెడు ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణ జరగకుండా తగ్గిస్తుంది. దీంతో గుండె జబ్బుల నుంచి దూరంగా ఉండవచ్చు. 

కంటి చూపునకు మంచిది:

కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి విటమిన్ ఏ అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే కంటి సమస్యలు, రేచీకటి వంటి సమస్యలకు మూల కారణం విటమిన్ ఏ లోపమే. కాబట్టి ప్రతి రోజూ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కంటి చూపునకు మంచిదని నిపుణులు చెబుతున్నారు .

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..