Barley Water: బీపీ, షుగర్‌కు చెక్ పెట్టే బార్లీ వాటర్.. గుండె జబ్బులు కూడా మాయం!

|

Oct 26, 2024 | 1:37 PM

బార్లీ.. ధాన్యాల్లో ఇవి కూడా ఒకటి. బార్లీ గింజలు శరీరానికి చేసే మేలు అంతా ఇంత కాదు. ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలైనా, ఇన్ఫెక్షన్లు అయినా తగ్గించే శక్తి బార్లీకి ఉంది. బార్లీలో అనేక రకాలైన పోషకాలు, ఔషధ గుణాలు నిండి ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా బార్లీని ఉపయోగిస్తూ ఉంటారు. బార్లీకి వేడిని తగ్గించే గుణం ఉంది. వేసవిలో బార్లీ ఒక్కటి తీసుకుంటూ చాలు. బార్లీ గింజలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. బార్లీలో మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, క్యాల్షియం, జింక్, రాగి, యాంటీ ఆక్సిడెంట్లు..

Barley Water: బీపీ, షుగర్‌కు చెక్ పెట్టే బార్లీ వాటర్.. గుండె జబ్బులు కూడా మాయం!
Barley Water
Follow us on

బార్లీ.. ధాన్యాల్లో ఇవి కూడా ఒకటి. బార్లీ గింజలు శరీరానికి చేసే మేలు అంతా ఇంత కాదు. ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలైనా, ఇన్ఫెక్షన్లు అయినా తగ్గించే శక్తి బార్లీకి ఉంది. బార్లీలో అనేక రకాలైన పోషకాలు, ఔషధ గుణాలు నిండి ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా బార్లీని ఉపయోగిస్తూ ఉంటారు. బార్లీకి వేడిని తగ్గించే గుణం ఉంది. వేసవిలో బార్లీ ఒక్కటి తీసుకుంటూ చాలు. బార్లీ గింజలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. బార్లీలో మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, క్యాల్షియం, జింక్, రాగి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, విటమిన్లు లభిస్తాయి. బార్లీ తీసుకోవడం వల్ల చాలా సమస్యలు రాకుండా ఉంటాయి. మరికొన్నింటిని ఎంతో ఈజీగా పరిష్కరించుకోవచ్చు. మరి బార్లీ తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

షుగర్ కంట్రోల్:

డయాబెటీస్‌తో ఉన్నవారు తరచూ బార్లీ వాటర్ తీసుకోవడం వల్ల.. రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఇందులో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బార్లీ వాటర్ తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. దీంతో అధిక ఆహారాన్ని తీసుకోలేం. దీంతో షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్‌గా ఉంటాయి.

జీర్ణ సమస్యలు దూరం:

బార్లీ వాటర్ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు అనేవి దూరం అవుతాయి. బార్లీలో పీచు పదార్థం అనేది జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా మారుస్తుంది. అజీర్తి, మల బద్ధకం, కడుపులో ఉబ్బరం, కడుపులో మంట, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలు, విష పదార్థాలు బయటకు పోతాయి. పోట్ట ఆరోగ్యాన్ని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

గుండె సమస్యలు దూరం:

ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక రక్త పోటు వంటి గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. బార్లీ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే పోషకాలు.. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. అలాగే రక్తంలో పేరుకు పోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని కూడా కరిగిస్తుంది

వెయిట్ లాస్:

ఈ మధ్య కాలంలో అనేక మంది అధిక బరువు, ఊబకాయంతో ఇబ్బందులు పడుతున్నారు. బరువు తగ్గాలి అనుకునే వారు తరచూ బార్లీ వాటర్ తీసుకుంటే.. మంచి ఫలితం కనిపిస్తుంది. ఇందులో ఫైబర్ శాతం ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి త్వరగా వెయిట్ లాస్ అవడంలో ఈ నీరు హెల్ప్ చేస్తాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..