AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? అయితే, ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..

చికెన్ బ్రెస్ట్ పీస్‌ల కంటే చికెన్ లివర్‌లో ఎక్కువ పోషకాలు ఉంటాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్, విటమిన్ A, B విటమిన్లు సమృద్ధిగా ఉండే చికెన్ లివర్ రక్తహీనతను తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, బరువు నియంత్రణలో సహాయపడుతుంది. అయితే గర్భిణీలు వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవడం మంచిది.

చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? అయితే, ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..
Chicken Liver Benefits
Shaik Madar Saheb
|

Updated on: Jun 04, 2026 | 4:53 PM

Share

పూర్వకాలంలో పండుగలు లేదా ప్రత్యేక సందర్భాలలో మాత్రమే మాంసం తినేవారు. కానీ నేటి ఆధునిక కాలంలో చాలామందికి చికెన్ దైనందిన ఆహారంలో ఒక భాగంగా మారింది. నాన్ వెజ్ ప్రియుల్లో చికెన్ ఇష్టపడని వారు లేరనే చెప్పాలి. అయితే, చాలామంది చికెన్ బ్రెస్ట్ పీస్‌లను ఇష్టపడినంతగా చికెన్ లివర్‌ను తినడానికి అంతగా ఆసక్తి చూపరు. కానీ ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, చికెన్ బ్రెస్ట్ పీస్‌ల కన్నా చికెన్ లివర్‌లో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుపుతున్నారు. ఈ ప్రయోజనాల గురించి తెలిస్తే, కచ్చితంగా ఈసారి చికెన్ లివర్‌ను కొనుగోలు చేసి మరీ తింటారు.

చికెన్ లివర్‌లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఐరన్ మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్‌లను పెంచడానికి సహాయపడుతుంది. ఇది రక్తహీనతతో బాధపడే వారికి అద్భుతమైన ఆహారంగా పరిగణిస్తారు. ముఖ్యంగా, గర్భం దాల్చిన మహిళలకు తగిన మోతాదులో చికెన్ లివర్ ఇవ్వడం వల్ల వారి శరీరంలో ఫోలిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి రక్తహీనత గణనీయంగా తగ్గుతుంది. గర్భిణీ స్త్రీలకు ఇది ఒక ముఖ్యమైన పోషకాహారం.

చికెన్ బ్రెస్ట్ పీస్‌తో పోల్చినప్పుడు, చికెన్ లివర్‌లో తక్కువ క్యాలరీలు, అధిక ప్రోటీన్ ఉంటుంది. ఈ లక్షణం వల్ల చికెన్ లివర్ తినడం ద్వారా తొందరగా పొట్ట నిండిన భావన కలుగుతుంది. ఇది ఆహార వినియోగాన్ని తగ్గించి, అధిక బరువు సమస్యను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా చికెన్ లివర్‌ను తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో గణనీయమైన ఫలితాలను పొందవచ్చు.

అంతేకాకుండా, చికెన్ లివర్‌లో యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన అమైనో ఆసిడ్ లైసిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరంలోని వివిధ రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, వాపులను తగ్గించడానికి దోహదపడుతుంది. చికెన్ లివర్‌లో బి విటమిన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. గర్భిణీలు, తల్లులు, పెరుగుతున్న పిల్లలతో సహా ప్రో మెటబాలిక్ శక్తి యొక్క అదనపు బూస్ట్ అవసరమయ్యే ఎవరికైనా ఈ బి విటమిన్లు ఎంతో సహాయపడతాయి.

దంత ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే చికెన్ కాలేయాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. సుమారు 3.5 ఔన్సుల చికెన్ కాలేయంలో 12 మైక్రో గ్రాముల విటమిన్ K2 లభిస్తుంది. ఇది ఎముకల, దంతాల ఆరోగ్యానికి చాలా అవసరం. విటమిన్ సి – విటమిన్ ఏ కూడా ఇందులో పుష్కలంగా దొరుకుతాయి. ఈ పోషకాలను తరచూ తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

విటమిన్ ఏ ప్రత్యేకంగా కళ్ళు, చర్మం, జుట్టు, గోళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అయితే, గర్భిణీ స్త్రీలు విటమిన్ ఏ ను మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అధికంగా విటమిన్ ఏ లభించడం వల్ల పిల్లలకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి, వైద్యుల సలహా మేరకు తీసుకోవడం మంచిది.

అయితే.. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సమస్యలున్నా.. సందేహాలున్నా.. ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us