బొద్దింకలను తరిమికొట్టడం ఇంత ఈజీనా.. ఇదిగో సింపుల్ చిట్కాలు
25 Jun 2026
Anand T
ప్రతి ఇంట్లో ఉండే ప్రధాన సమస్యల్లో బొద్దింకల బెడద కూడా ఒక. అయితే ఖరీదైన స్ప్రేలు వాడకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే వీటిని తరిమికొట్టవచ్చు. అదెలానో చూద్దాం.
బొద్దింకల బెడద
బొద్దింకలను తరిమికొట్టేందుకు ఒక దోసకాయను ముక్కలుగా కోసి, బాగా తురిమి పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
దొసకాయ
దాన్ని బొద్దింకలు ఎక్కువగా తిరిగే, అవి దాక్కునే ప్రదేశాలలో పెట్టాలి ఇలాచేయడం వల్ల అవి మళ్లీ ఆప్లేస్‌కు రాకుండా ఉంటాయి.
దోసకాయ
కొంత పంచదారను మెత్తని పొడిగా రుబ్బుకుని, దానికి సమాన పరిమాణంలో బేకింగ్ సోడాను కలిపి ఒక మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి.
బేకింగ్ సోడా,చక్కెర మిక్స్
బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్లేస్‌లలో ఈ మిశ్రమాన్ని పోయాలి
బేకింగ్ సొడా
పంచదారలోని తీపికి ఆకర్షితులై బొద్దింకలు ఆ మిశ్రమాన్ని తింటాయి. దాంతో పాటు ఉన్న బేకింగ్ సోడాను మింగడం వల్ల అవి చనిపోతాయి.
పంచదార
ఎండిన నారింజ తొక్కల వాసన బొద్దింకలకు అస్సలు పడదు. కాబట్టి వీటిని బొద్దింకలు గూడు కట్టుకునే ప్రదేశాలలో ఉంచితే అవి పారిపోతాయి.
నారింజ తొక్క
నిమ్మకాయలలో ఉండే సిట్రిక్ యాసిడ్ గుణాలు కూడా బొద్దింకలను తరిమికొట్టడంలో ఎంతో సమర్థవంతంగా సహాయపడతాయి.