Blackberry Uses: బ్లాక్ బెర్రీతో ఇక నో వర్రీ.. ఆ సమస్యలకు చక్కటి పరిష్కారం.. తప్పనిసరిగా తెలుసుకోండి..

| Edited By: Anil kumar poka

Jan 09, 2023 | 6:43 PM

బ్లాక్ బెర్రీస్ లో విటమిన్లు, సి, కే, మాంగనీస్, అధిక ఫైబర్ వంటి ఎన్నో అవసరమైన పోషకాలు ఉంటాయి. ఈ పండ్లు ముఖ్యంగా వేసవి కాలంలో అధికంగా మార్కెట్ లోకి వస్తాయి. బ్లాక్ బెర్రీలు జీర్ణక్రియకు దోహదం చేస్తాయి. అలాగే ఊబకాయం సమస్య నుంచి రక్షణ కల్పిస్తాయి.

Blackberry Uses: బ్లాక్ బెర్రీతో ఇక నో వర్రీ.. ఆ సమస్యలకు చక్కటి పరిష్కారం.. తప్పనిసరిగా తెలుసుకోండి..
బ్లాక్ బెర్రీస్ లో ఉండే ఆంథోసైనిన్ లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అలాగే శ్వాసకోశ ఇబ్బందుల నుంచి రక్షించడానికి ఇవి చాలా బాగా పని చేస్తాయి.
Follow us on

బ్లాక్ బెర్రీ.. మన రాష్ట్రంలో ఈ పండు కొంత మందికి మాత్రమే తెలుసు. పెద్దగా ఫ్రూట్ మార్కెట్స్ కూడా ఎప్పుడో కానీ కనిపించదు. కానీ మనం తినే చాలా ఆహార పదార్థాల్లో బ్లాక్ బెర్రీని వాడుతుంటారు. ముఖ్యంగా పిల్లలు తినే జెల్లీ, జామ్ లో విరివిగా వీటి వాడకం ఉంటుంది. అయితే వీటి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. చూడటానికి చాలా చిన్నగా ఉండే ఈ పండ్లను మధ్యలోకి కోస్తే ఎలాంటి గ్యాప్ ఉండదు. ఒకవేళ గ్యాప్ ఉంటే అది బ్లాక్ బెర్రీ కాదని గుర్తుపెట్టుకోవాలి. అయితే కొన్ని దేశాల్లో బ్లాక్ బెర్రీలతో వైన్ కూడా తయారు చేస్తారు. బ్లాక్ బెర్రీలను ఎలాంటి రూపంలో తిన్నా మేలు చేస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. బ్లాక్ బెర్రీస్ లో విటమిన్లు, సి, కే, మాంగనీస్, అధిక ఫైబర్ వంటి ఎన్నో అవసరమైన పోషకాలు ఉంటాయి. ఈ పండ్లు ముఖ్యంగా వేసవి కాలంలో అధికంగా మార్కెట్ లోకి వస్తాయి. బ్లాక్ బెర్రీలు జీర్ణక్రియకు దోహదం చేస్తాయి. అలాగే ఊబకాయం సమస్య నుంచి రక్షణ కల్పిస్తాయి. నోరు, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బ్లాక్ బెర్రీలు వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాల గురించి ఓ సారి తెలుసుకుందాం.

గుండె పనితీరు మెరుగు

బ్లాక్ బెర్రీల్లో ఉండే విటమిన్స్, మినరల్స్, ఫైటో కెమికల్స్, మైక్రో న్యూట్రియంట్స్ వల్ల గుండె పనితీరు చాలా మెరుగు అవుతుంది. అలాగే వీటిలో ఉండే ఆంథోసైనిన్లు గుండె, రక్తనాళాలను ప్రభావితం చేసే హృదయ సంబంధ వ్యాధులను నివారిస్తాయి. ఇందులో ఉండే లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణ ప్రక్రియను 50 శాతం మేర తగ్గిస్తాయి. అలాగే అంతర్గత వాస్కులర్ ఇన్ ఫ్లమేషన్ తగ్గించడానికి సాయం చేస్తాయి. ఓ అధ్యయనం ప్రకారం బ్లాక్ బెర్రీల్లో ఉండే ఆంథోసైనిన్ సప్లిమెంట్స్ చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించేందుకు సాయం చేస్తాయి.

మతిమరుపు సమస్య దూరం

బ్లాక్ బెర్రీస్ తో మతిమరుపు సమస్య దూరం అవుతుంది. అలాగే ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఇవి టాక్సిన్ల ద్వారా ఉత్పతయ్యే సెల్స్ డ్యామేజ్ ను అరికడతాయి. అలాగే మెదడు న్యూరాన్స్ ను మెరుగుపరుస్తాయి. బ్లాక్ బ్రెర్సీస్ లోని ఆంథోసైనిన్ లు మెదడుకు రక్త ప్రసరణను పెంచుతాయి. ఓ పరిశోధన ప్రకారం బ్లాక్ బెర్రీస్ ను రోజూ తినడం వల్ల పార్కిన్సన్స్ అనే మెదడు వ్యాధి వచ్చే అవకాశాలు 23 శాతం తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

ప్రకాశవంతమైన చర్మం

బ్లాక్ బెర్రీస్ ను రోజూ తినడం వల్ల వృద్ధాప్య సమస్యలు దూరం అవుతాయి. ఇందులో ఉండే విటమిన్ ఏ వల్ల చర్మం ముడతలు పడడం తగ్గుతుంది. అలాగే అనవసర మచ్చలను తగ్గించడంలో సాయం చేస్తుంది. బ్లాక్ బెర్రీస్ లో ఉండే పోషకాల వల్ల ప్రీ రాడికల్స్ దెబ్బతినవు. అలాగే రక్త ప్రసరణ పెరగడం వల్ల మొటిమలు వంటి సమస్యలు దూరం అవుతాయి. 

ఎముకలకు మరింత బలం

బ్లాక్ బెర్రీస్ లో ఉండే మాంగనీస్ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే వీటిలో ఉండే విటమిన్ కే, కాల్షియం బోలు ఎముకల వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తుంది. వీటిని తింటే వచ్చే ఎలాజిక్ యాసిడ్ కూడా ఎముకల సమస్యలను దూరం చేస్తుంది. అలాగే ఎముకల పగుళ్లు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

అజీర్తి సమస్య గుడ్ బై

బ్లాక్ బెర్రీస్ లో అధిక మొత్తంలో కరిగే డైటరీ ఫైబర్ ఉంటుంది. దీంతో జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. అలాగే ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధక సమస్యలు పూర్తిగా దూరమవుతాయి. ఈ పండ్లల్లో ఉండే ఆస్టింజెంట్ విరోచనాలను కట్టడి చేస్తుంది. అలాగే మూత్రపిండాలు మెరుగ్గా పని చేయడంలో సాయం చేస్తాయి. 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..