Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fruit leaves: ఈ పండ్లే కాదు.. వీటి ఆకులు కూడా ఆరోగ్యానికి మంచివే.. జ్యూస్ తాగితే ప్రాణంతక వ్యాధులు కూడా మాయమవ్వాల్సిందే..

మన ఆరోగ్యానికి పండ్లు చాలా మంచివి. ప్రతి పండులో అనేక రకాల అద్భుతమైన పోషకాలుంటాయి. అయితే కొన్ని రకాల పండ్లతో పాటు వాటి ఆకులు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. పండ్ల ఆకుల్లో వివిధ రకాల ఔషధ గుణాలుంటాయి. వీటిని వాడడం వల్ల ప్రాణాంతక వ్యాధులు కూడా దూరమవుతాయి. ఈ పండ్ల ఆకులతో డయాబెటిస్, కొలెస్ట్రాల్, డెంగ్యూ వంటి వ్యాధులు సైతం దూరం చేయవచ్చు.

శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 27, 2022 | 9:25 PM

బొప్పాయి ఆకుల్లో పోషక గుణాలు చాలా ఎక్కువ. ఈ ఆకుల జ్యూస్‌తో డెంగ్యూ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా దూరమవుతాయి. ఇమ్యూనిటీని పెంచడంలోనే కాక బ్లడ్ షుగర్, జీర్ణక్రియ సమస్యలకు కూడా బొప్పాయి ఆకులు మంచి పరిష్కారం.

1 / 4
మామిడి ఆకులలో అనేక రకాల పోషకాలు ఉండడమే కాక ఇవి రక్తపోటు సమస్యకు మంచి పరిష్కారం. మామిడి లేత ఆకులు నమలడం వల్ల స్థూలకాయం, అధిక రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చర్మం, కేశాల సంరక్షణకు కూడా ఇవి మంచివి.

2 / 4
నేరేడు పండ్లు మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా మంచివి, మేలు చేస్తాయి. మధుమేహం నియంత్రణకు నేరేడు ఆకులు తింటే చాలా మంచిది. మలబద్ధకం సమస్య, షుగర్ వ్యాధులకు ఇవి పరిష్కారంగా పనిచేస్తాయి.

3 / 4
జామకాయ ఆకుల్లో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉన్నందున ఇవి చాలా రకాల వ్యాధులను దూరం చేస్తాయి. ఈ ఆకులతో కొలెస్ట్రాల్, డయాబెటిస్, రక్తపోటు, అజీర్తి సమస్యలు దూరం చేసే లక్షణాలు ఉంటాయి. జామకాయ ఆకులతో అధిక బరువుకు కూడా చెక్ పెట్టవచ్చు.

4 / 4
Follow us