Lifestyle: అరటి వర్సెస్ బేరి పండు.. ఆరోగ్యానికి ఏది మంచి ఎంపిక!
మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి కారణంగా చాలా మంది వివిధ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వ్యాధులను ఎదుర్కొని ఆరోగ్యంగా జీవించేందుకు పోషకమైన ఆహారం, పండ్లు తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకే చాలా మంది భోజనం తర్వాత పండ్లను తినడం అలాటు చేసుకుంటారు. వాటిలో అరటి, బేరి పండ్లు కూడా ఉంటాయి. అయితే ఈ పండ్లలో ఏది మన ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో మీకు తెలుసా?. అయితే ఇక్కడ తెలుసుకుందాం పదండి.

మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే మీ రోజువారీ ఆహారంలో పండ్లను చేర్చుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మీరు తినే పండ్లలో అరటిపండ్లు, బేర పండ్లు కూడా ఉంటే వాటిలో ఏది మీ ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందో తెలుసుకోవాలి. ఎందుకంటే మీ ఎంపిక మీకు సంతృప్తిని ఇవ్వాలి. అయితే మీరు తీసుకునే ఈ రెండు పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.అలాగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి.
ఏ పండు వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి?
బేరి పండ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
బేరి పండ్లలో విటమిన్ సి, ఫైబర్, విటమిన్ ఎ, బి, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండు ఆమ్లతను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది అలాగే శరీరాన్ని వైరస్‌ల నుండి రక్షిస్తుంది. ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. అందువల్ల, బరువుతగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అలాగే తక్కువ కేలరీలు ఉంటాయి. కాబట్టి ఇది మీరు ఎక్కువ ఫుడ్ తీసుకోకుండా నివారిస్తుంది. అలాగే ఇందుకు ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎండ నుంచి మీ చర్మాన్ని రక్షించడానికి సహాయపడతాయి. ఇది మన రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది.
అరటిపండు ఆరోగ్య ప్రయోజనాలు.
చాలా మందికి రోజూ అరటి పండుతినే అలవాటు ఉంటుంది. ఇందులో పొటాషియం, ఐరన్, కాల్షియం, నియాసిన్, మెగ్నీషియం, రిబోఫ్లేవిన్, విటమిన్ బి6 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీని రోజూ తినడం వల్ల మీ ఆకలిని తగ్గిస్తుంది, ఇది శరీర బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇందులో అధిక కాల్షియం కంటెంట్ ఉండటం వల్ల, ఇది ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఏది మంచిది, బేరి లేదా అరటి?
ఈ రెండు పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అయితే మీరు బరువు తగ్గాలి, మీకు తక్కువ కేలరీలు కావాలనుకుంటే మీకు బేరి పండు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. అలా కాదని మీరు మీ శరీరానికి ఎక్కువ శక్తిని అందించాలనుకుంటే మీకు ఆరటి పండు మంచి ఎంపిక వ్యాయామానికి ముందు లేదా తర్వాత ఈ పండును తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




