AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి పూట చికెన్‌ తిని నిద్రపోతే.. మీకు ఇలాంటి కలలు వస్తాయట!

ఒక్కోసారి కారణం లేకుండా వింత కలలు వస్తుంటాయి. దీంతో అకస్మాత్తుగా మేలకువ వస్తుంది. రాత్రంతా ఇలా మళ్ళీ మళ్ళీ చెడు కలలు రావడం వల్ల నిద్రకు భంగం కలిగిస్తుంది. పైగా కలత కూడా రేపుతాయి. అయితే ఈ కలలన్నీ అసంబద్ధంగా, ఒకదానికొకటి సంబంధం..

రాత్రి పూట చికెన్‌ తిని నిద్రపోతే.. మీకు ఇలాంటి కలలు వస్తాయట!
Dream Inducing Foods
Srilakshmi C
|

Updated on: Sep 02, 2025 | 9:05 PM

Share

ఉన్నట్లుండి రాత్రిళ్లు నిద్రలో వింత కలలు వస్తుంటాయి. దీంతో అకస్మాత్తుగా మేలకువ వస్తుంది. రాత్రంతా ఇలా మళ్ళీ మళ్ళీ చెడు కలలు రావడం వల్ల నిద్రకు భంగం కలిగిస్తుంది. పైగా కలత కూడా రేపుతాయి. అయితే ఈ కలలన్నీ అసంబద్ధంగా, ఒకదానికొకటి సంబంధం కలిగి ఉండవు. ఇలా మీకూ తరచుగా జరుగుతుందా? ఇది సాధారణమే అని కొట్టిపారేస్తున్నారా? అయితే కాస్త జాగ్రత్త. ఇటీవల దీనిపై నిర్వహించిన ఓ కొత్త అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు వెల్లడయ్యాయి. అందేంటంటే.. రాత్రిపూట తినే ఆహారంపై మీకు వచ్చే కలలు ఆధారపడి ఉంటాయని వీరి అధ్యయనంలో తేలింది. కాబట్టి కలలకు, మీరు తినే ఆహారానికి మధ్య ఎలాంటి సంబంధం ఉందో ఇక్కడ తెలుసుకుందాం..

నిజానికి ఇందుకు సంబంధించిన కొన్ని పరిశోధనలు 2007లోనే UKలో జరిగాయి. ఆ సమయంలో నిర్వహించిన అధ్యయనాలు రాత్రి పడుకునే ముందు వీలైనంత తక్కువ, తేలికైన ఆహారం తినేవారికి మంచి కలలు వస్తాయని వెల్లడించాయి. అంతేకాదు, సాయంత్రం పూట ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినేవారికి చెడు కలలు వస్తాయని తెలిపింది. అంటే మీరు తినే ఆహారం రాత్రిపూట మీరు కనే కలలను నిర్ణయిస్తుందన్నమాట. చాలా పుస్తకాలు దీని గురించి వివరణలు కూడా ఇచ్చాయి. ఇది కేవలం అపోహ మాత్రమే కాదు. 2007లో మాత్రమే కాకుండా 2022లో కూడా ఇదే విషయంపై అధ్యయనాలు జరిగాయి. ఈ అధ్యయనంలో.. రాత్రిపూట ఎక్కువ పండ్లు తినేవారికి మంచి కలలు వస్తాయి. చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు తినేవారికి పీడకలలు వస్తాయి.

రాత్రిపూట ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్, చికెన్‌, మటన్‌, ఫ్రైలు వంటివి ఎక్కువగా తినేవారికి ఎక్కువగా చెడు కలలు వస్తాయని ఈ పరిశోధన నివేదించింది. అంతేకాకుండా స్వీట్లు, పాల ఉత్పత్తులు ఎక్కువగా తినేవారికి నిద్రకు ఆటంకాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడించింది. ఇప్పటికే జీర్ణ సమస్యలు, మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారిలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. గ్లూటెన్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల అలెర్జీలు రావడమే కాకుండా, పీడకలలు కూడా వస్తాయని కనుగొనబడింది.

ఇవి కూడా చదవండి

ఇలా ఎందుకు?

గట్‌లోని మైక్రోబయోమ్ కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించినది. అది సరిగ్గా విడుదల కానప్పుడల్లా కేంద్ర నాడీ వ్యవస్థకు సంకేతాలు పంపబడతాయని నిపుణులు అంటున్నారు. ఆ సమయంలో, అసౌకర్య భావన కలుగుతుంది. కాబట్టి ఆహారం బాగా జీర్ణం కాదు. అంతేకాదు, జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కూడా పెంచుతుంది. ఈ రకమైన మానసిక ఒత్తిడి నిద్రను ప్రభావితం చేస్తుంది. మీరు రాత్రి నిద్రపోయినా చెడు కలలు వస్తాయి. తిన్న తర్వాత ఈ ఒత్తిడి పెరుగుతుంది. దీనిని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) అంటారు. కాబట్టి మీరు తినే ఆహారాలు తదనుగుణంగా కలలను ప్రభావితం చేస్తాయి.

మరిన్నా ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..