AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pickles: నిల్వ పచ్చళ్లు తినే అలవాటుందా..? వామ్మో, ఈ 10 విషయాలు తెలిస్తే కళ్లు తేలేస్తారుగా..

భారతదేశంలో ఊరగాయ.. ఆవకాయ గురించి మనం చెప్పాల్సిన పనిలేదు.. తలుచుకుంటే చాలు మన నోటిలో నీరూరుతాయి. భారత్‌లోనే ఎక్కువగా.. ఇష్టంగా నిల్వ పచ్చళ్లను తింటారు.. ప్రతీ ఇంట్లో కూడా ఊరగాయ జాడీలు కనిపిస్తుంటాయి. ప్రజలు చాలా ఇష్టంగా తినే అన్ని రకాల ఊరగాయలు (పచ్చళ్లు) ఇక్కడ అందుబాటులో ఉన్నాయి..

Pickles: నిల్వ పచ్చళ్లు తినే అలవాటుందా..? వామ్మో, ఈ 10 విషయాలు తెలిస్తే కళ్లు తేలేస్తారుగా..
Mango Pickle
Shaik Madar Saheb
|

Updated on: Sep 12, 2024 | 1:07 PM

Share

భారతదేశంలో ఊరగాయ.. ఆవకాయ గురించి మనం చెప్పాల్సిన పనిలేదు.. తలుచుకుంటే చాలు మన నోటిలో నీరూరుతాయి. భారత్‌లోనే ఎక్కువగా.. ఇష్టంగా నిల్వ పచ్చళ్లను తింటారు.. ప్రతీ ఇంట్లో కూడా ఊరగాయ జాడీలు కనిపిస్తుంటాయి. ప్రజలు చాలా ఇష్టంగా తినే అన్ని రకాల ఊరగాయలు (పచ్చళ్లు) ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.. ఎప్పటికీ ఉంటాయి.. చాలా మంది గ్రామాల నుంచి నగరానికి లేదా విదేశాలకు వెళ్లేటప్పుడు వాటిని బాక్స్‌లో ప్యాక్ చేసుకుని తీసుకెళ్లి అక్కడ తింటారు. అన్నం, రోటీ, పరోటా.. ఇలా అన్నింటిలోనూ ఊరగాయను కలిపి తింటే కలిగే ఆనందమే వేరు.. కానీ ఊరగాయలో మన ఆరోగ్యానికి హాని కలిగించే లాక్టిక్ యాసిడ్ ఉంటుందని మీకు తెలుసా…? ఇది మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊరగాయ దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

లాక్టిక్ యాసిడ్ అంటే ఏమిటి?

లాక్టిక్ ఆమ్లం మన శరీరంలో ఉండే ఒక ప్రధాన సేంద్రీయ ఆమ్లం.. ఇది మన శరీరానికి అవసరమైనప్పుడు ఇది ఒక ముఖ్యమైన శక్తి వనరుగా పనిచేస్తుంది, అయితే శరీరంలో దాని స్రావం ఒక పరిమితిని మించి ఉంటే, అది ఇబ్బందిని కలిగిస్తుంది.

లాక్టిక్ యాసిడ్ 10 ప్రతికూలతలు ఏంటో తెలుసుకోండి..

  1. ఆక్సిడోసిస్: అధిక లాక్టిక్ ఆమ్లం కారణంగా, శరీరంలో ఆక్సిడోసిస్ పరిస్థితి ఏర్పడుతుంది. దీనిలో రక్తం pH స్థాయి క్షీణిస్తుంది. ఇది బలహీనత, వాంతులు, నొప్పిని కలిగిస్తుంది.
  2. బలహీనమైన కండరాలు: లాక్టిక్ యాసిడ్ కండరాలలో నొప్పి, దృఢత్వాన్ని కలిగిస్తుంది. ఇది రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది.
  3. అధిక రక్తపోటు (హైBP): అధిక లాక్టిక్ యాసిడ్ స్థాయిలు అధిక రక్తపోటు సమస్యను పెంచుతాయి.
  4. వాంతులు – వికారం: ఆక్సిడోసిస్ వాంతులు, వికారం కలిగించవచ్చు. ఇది మీకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
  5. అజీర్ణం: అధిక లాక్టిక్ యాసిడ్ విడుదల కారణంగా, కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం మొదలైన జీర్ణక్రియ సంబంధిత సమస్యల గురించి ఫిర్యాదులు ఉండవచ్చు.
  6. నోరు పొడిబారుతుంది: ఆక్సిడోసిస్ కారణంగా నోరు పొడిబారుతుంది. దీనివల్ల తినడం, త్రాగడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.
  7. గుండె జబ్బులు: అధిక లాక్టిక్ యాసిడ్ ఛాతీ నొప్పి, క్రమరహిత హృదయ స్పందన వంటి గుండె సంబంధిత వ్యాధులకు కూడా కారణమవుతుంది.
  8. తలనొప్పి: లాక్టిక్ యాసిడ్ అధికంగా తీసుకోవడం వల్ల తలనొప్పి, కళ్లు తిరగడం వంటివి కలుగుతాయి.. కాబట్టి దీనిని ఎక్కువగా తీసుకోవద్దు.
  9. బలహీనమైన ఎముకలు: అదనపు లాక్టిక్ యాసిడ్ ఎముకల స్థితిని శాశ్వతంగా ప్రభావితం చేస్తుంది. ఎముకలలో బలహీనతకు కారణమవుతుంది.
  10. శరీర ఉష్ణోగ్రతలో మార్పు: మీ శరీరంలో లాక్టిక్ యాసిడ్ స్థాయి పెరిగితే, అది శరీర ఉష్ణోగ్రతలో మార్పును కలిగిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..