చిన్న చూపు చూసేరు.. ఇది అమృతం.. డైలీ ఓ గ్లాసు రసం తాగితే మీ ఆరోగ్యానికి ఢోకానే ఉండదు
టమోటా రసం రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. టొమాటో రసంలో 95% నీరు ఉంటుంది. ఇది కాకుండా, ఇది విటమిన్ B6, C, పొటాషియం, మెగ్నీషియానికి అద్భుతమైన మూలం.. వాస్తవానికి టొమాటోను దాదాపు ప్రతి ఇంట్లో ఉపయోగిస్తారు.
టమోటా రసం రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. టొమాటో రసంలో 95% నీరు ఉంటుంది. ఇది కాకుండా, ఇది విటమిన్ B6, C, పొటాషియం, మెగ్నీషియానికి అద్భుతమైన మూలం.. వాస్తవానికి టొమాటోను దాదాపు ప్రతి ఇంట్లో ఉపయోగిస్తారు. ప్రతి రోజూ దాదాపు అన్ని రకాల వంటల్లో ఉపయోగిస్తున్నప్పటికీ, పచ్చి టమోటా రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు.. తెలియకపోతే ఈ విషయాలను తెలుసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. టామాటా రసం తాగితే.. 30 రోజుల్లోనే ఎన్నో మార్పులు వస్తాయని.. ఆరోగ్యానికి ఇది చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
టమోటా రసం పోషకమైనది.. అనేక విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థను బలపరచడంతోపాటు.. టెన్షన్, ఒత్తిడిని నిరోధిస్తుంది.
టమోటా రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకోండి..
క్యాన్సర్ నివారణ
టొమాటోలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లభిస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది, ఇది శరీరంలో సెల్ డ్యామేజ్‌కు కారణమవుతుంది. టొమాటో జ్యూస్‌ని రెగ్యులర్‌గా తాగడం వల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. లైకోపీన్ ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యం
టమోటా రసం గుండెకు మేలు చేస్తుంది. ఇందులో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. టొమాటో జ్యూస్‌ను క్రమం తప్పకుండా తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బరువు తగ్గడంలో ప్రయోజనకరంగా ఉంటుంది
మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే, టొమాటో రసం మీకు గొప్ప ఎంపిక. ఇందులో క్యాలరీల పరిమాణం తక్కువగా ఉంటుంది. పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జ్యూస్ తాగడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. అంతే కాకుండా టొమాటో రసం జీవక్రియను పెంచడంలో కూడా సహాయపడుతుంది.
యాంటీ ఏజింగ్ లక్షణాలు
టొమాటో రసం చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది హైడ్రేటింగ్ గా ఉంచడంతోపాటు చర్మం మెరుపును పెంచుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి . టొమాటో జ్యూస్‌ని రెగ్యులర్‌గా తాగడం వల్ల మొటిమలు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
జీర్ణక్రియ సమస్య తీరుతుంది
టొమాటో జ్యూస్‌లో ఉండే ఫైబర్ జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది కాకుండా, టమోటా రసం కడుపులో ఆమ్లతను తగ్గించడంలో సహాయపడుతుంది.. తద్వారా సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
టామాట రసం ఎలా తయారు చేసుకోవాలంటే..
మూడు నాలుగు లేదా మీకు సరిపడినన్ని టొమాటోలను తీసుకుని వాటిని చిన్న ముక్కలుగా కోయండి. టొమాటోలను మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి.. మీకు కావాలనుకుంటే.. చిన్న అల్లం ముక్క కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. మీ రుచికి తగినట్లు ఉప్పు, నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోని తాగొచ్చు..
ఇంకా కావాలంటే టామాటాలను ముక్కలుగా కట్ చేసి ఓ గిన్నెలో వేసి తగినంత నీరు వేసి మరగించాలి. ఆ తర్వాత మెత్తగా జ్యూస్ లా చేసుకుని తాగొచ్చు.. రుచికి తగినట్లు ఉప్పు, నిమ్మరసం కలుపుకోవాలి..