Coconut Water Uses: కొబ్బరి నీరు.. ఇది చాలా కూల్ గురూ.. ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

సహజసిద్ధమైన కొబ్బరి నీళ్లు నోటికి రుచిగా ఉండటంతో పాటు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని పోషకాలు, మినరల్స్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అలసిపోయిన శరీరానికి శక్తినిస్తాయి.

Coconut Water Uses: కొబ్బరి నీరు.. ఇది చాలా కూల్ గురూ.. ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
Coconut Water
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 26, 2023 | 7:07 PM

ఎండాకాలం మొదలైంది. పగటి పూట భానుడు భగభగమంటున్నాడు. ఈ సమయంలో సహజంగా మనకు గుర్తొచ్చే పానీయం కొబ్బరి నీళ్లు. సహజసిద్ధమైన ఈ పానీయం నోటికి రుచిగా ఉండటంతో పాటు శరీరానికి అనేక ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని పోషకాలు,మినరల్స్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అలసిపోయిన శరీరానికి శక్తినిస్తుంది. శరీర బరువును అదుపులో ఉంచుతుంది. రక్తపోటు, మధుమేహం వంటి వాటిని నిర్వహించడంలో సాయపడుతోంది. అటువంటి కొబ్బరి నీళ్లను కొంతమంది కొన్ని అపోహలతో దూరం పెడతారు. అటువంటి వారి కోసం కొబ్బరి నీళ్లు తరచూ తీసుకోవడం ద్వారా శరీరానికి సమకూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం..

ఇన్ స్టంట్ ఎనర్జీ.. కొబ్బరి నీళ్లల్లో మినరల్స్, ఎలెక్ట్రోలైట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఇది తీసుకుంటే తక్షణ ఎనర్జీ బూస్టర్ గా ఉపయోగపడుతుంది. మీరు వేసవిలో ఏదైనా కూల్ డ్రింక్ తాగాలనుకుంటే దానికి ఇది మంచి ప్రత్యామ్నాయం. అలాగే మీరు వ్యాయామాలు చేసే సమయంలో కొబ్బరి నీళ్లు కొంచెం, కొంచెం సిప్ చేస్తూ ఉంటే శరీరానికి మంచి శక్తినివ్వడంలో సాయపడుతుంది.

హై బ్లడ్ షుగర్ కంట్రోల్.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు వారి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి కొబ్బరి నీరు సహాయపడుతుంది. ఇందులో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంద., ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. అలాగే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో లేదా ప్రీ-డయాబెటిక్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

హై బ్లడ్ ప్రెజర్ కంట్రోల్.. కొబ్బరి నీటిలో పొటాషియం ఉంటుంది. ఇది అధిక లేదా సాధారణ రక్తపోటు ఉన్నవారిలో రక్తపోటును తగ్గిస్తుంది. కాబట్టి ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా సహాయపడుతుంది.

కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారికి.. మూత్రవిసర్జన ద్వారా పొటాషియం, క్లోరైడ్, సిట్రేట్‌లను తొలగించడంలో కొబ్బరి నీరు సహాయపడుతుందని 2018 లో నిర్వహించిన ఓ అధ్యయనం స్పష్టం చేసింది.

ఇతన పానీయాలకు ప్రత్యామ్నాయం.. సోడా లేదా ఎరేటెడ్ పానీయాలు తాగడానికి బదులుగా, కొబ్బరి నీరు తీసుకోవడం చాలా ఉత్తమం. అలాగే వ్యాయామం చేసిన అలసిపోయిన సమయంలో కూడా తిరిగి శక్తిని పొందుకునేందుకు బాగా సాయపడుతుంది.

డిటాక్సిఫికేషన్.. మినరల్స్, ఎలక్ట్రోలైట్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే కొబ్బరి నీరు.. మీ శరీరాన్ని డీ హైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. యాంటీఆక్సిడెంట్లు టిటాక్సిఫికేషన్ కి సాయపడుతుంది.

అదుపులో బరువు.. కొబ్బరి నీరు మీకు సంపూర్ణమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇది మీ జీవక్రియ రేటును కూడా పెంచుతుంది. కొన్ని అధ్యయనాలు భోజనానికి అరగంట ముందు కొబ్బరి నీళ్లను తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..