గంటల తరబడి పనితో మెడ నొప్పి వేధిస్తుందా.? ఈ చిట్కాలు పాటిస్తే సెట్ అంతే..
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూర్చునే భంగిమ, ఎక్కువ సేపు తల దించుకొని ఉండడం వల్ల మెడనొప్పి సమస్య ఎక్కువగా వేధిస్తోంది. ప్రతీ నలుగురిలో ఇద్దరు మెడ నొప్పితో బాధపడే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధాన కారణం.. సిట్టింగ్ పొషిజన్ సరిగ్గా లేకపోవడమే. సరైన పొజిషిన్‌లో కూర్చోకపోతే మెడ కండరాలు బిగుసుకుపోయి మెడ నొప్పి వేధిస్తుంది. ఒత్తిడితో కూడుకున్న జీవనశైలి కారణంగా కూడా మెడ, భుజాలు బిగుతుగా..

మారిన కాలంతో పాటు జీవనశైలి కూడా మారింది. ముఖ్యంగా పనితీరు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు శారీరక శ్రమతో కూడిన పని ఉండేది. కానీ ఇప్పుడు కూర్చుని పనిచేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఏకంగా 12 గంటలపాటు కంప్యూటర్ ముందు కూర్చొని పని చేస్తున్నారు. అలాగే స్మార్ట్ ఫోన్‌ల వినియోగం కూడా భారీగా పెరిగింది. దీంతో తల కిందికి దించుకొనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూర్చునే భంగిమ, ఎక్కువ సేపు తల దించుకొని ఉండడం వల్ల మెడనొప్పి సమస్య ఎక్కువగా వేధిస్తోంది. ప్రతీ నలుగురిలో ఇద్దరు మెడ నొప్పితో బాధపడే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధాన కారణం.. సిట్టింగ్ పొషిజన్ సరిగ్గా లేకపోవడమే. సరైన పొజిషిన్‌లో కూర్చోకపోతే మెడ కండరాలు బిగుసుకుపోయి మెడ నొప్పి వేధిస్తుంది. ఒత్తిడితో కూడుకున్న జీవనశైలి కారణంగా కూడా మెడ, భుజాలు బిగుతుగా మారుతున్నాయి. దీంతో ఇది మెడ కండరాల నొప్పికి కారణంగా మారుతుంది.
ఈ చిట్కాలు పాటించండి..
మెడనొప్పితో బాధపడే వారు కండరాలు రిలీఫ్ అయ్యే వ్యాయామాలను చేయాలి. నెక్ ఎక్సర్‌సైజ్‌లను చేయడం ప్రతి రోజూ అలవాటుగా మార్చుకోవాలి. మెడను నాలుగు దిక్కుల తిప్పుతూ కండరాలు ఫ్రీ అయ్యేఆల వ్యాయాయం చేయాలి. ఇక అదే పనిగా ఎక్కువసేపు కూర్చొని పని చేయకూడదు. కాసేపు పనిలో బ్రేక్ తీసుకుంటూ తలను అప్పుడప్పుడు పైకి ఎత్తుతూ ఉండాలి. విరామ సమయంలో మెడను నెమ్మదిగా తిప్పాలి.
ఇక కంప్యూటర్ ముందు పనిచేసే సమయంలో స్క్రీన్‌ను కాస్త పైకి ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడైనా తల కిందికి ఉండేలా స్క్రీన్ ఉండకూడదు. ఇలా స్క్రీన్ కిందికి ఉంటే.. మెడపై ఒత్తిడి పెరుగుతుంది కండరాలు దృఢత్వం కోల్పోతాయి. నడిచే సమయంలో కూడా సరైన పొజిషన్‌లో ఉండాలి. భుజాలు, మెడ వంటి నడవకూడదు. భుజాలు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. పైన పేర్కొన్ని చిట్కాలు పాటిస్తే మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.
నోట్: పైన తెలిపిన చిట్కాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. నొప్పి తక్కువ ఉన్నప్పుడే ఇలాంటి చిట్కాలు పనిచేస్తాయి. నొప్పి తీవ్రత ఎక్కువైతే మాత్రం వైద్యులను సంప్రదించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..