AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేప నూనెతో చెప్పలేన్నని లాభాలు…

చేపలు శరీరానికి ఉత్త పొషకాల్ని అందిస్తాయి. గుండె జబ్బులను నివారించగల అద్భుత శక్తి చేపలకు ఉంటుంది. చేపల్లో మనకు అవసరమైన ఎనిమిది రకాల అమైనో యాసిడ్లు లభిస్తాయి. అంతేకాదు..చేప నూనెకూడా మనకు ఎంతగానో మేలు చేస్తుందంటున్నారు వైద్య నిపుణులు. అసలు చేప నూనె అంటే ఏమిటి, ఎక్కడనుండి వస్తుంది? అని కొందరికి సహజంగా వచ్చే అనుమానం. చేప నూనె అనేది ఎక్కువ జిడ్డు కలిగిన చేపల కణజాలం నుండి సేకరిస్తారు. ముఖ్యంగా సాల్మన్, వైట్ ఫిష్, హెర్రింగ్, […]

చేప నూనెతో చెప్పలేన్నని లాభాలు...
Anil kumar poka
|

Updated on: Sep 26, 2019 | 3:40 PM

Share

చేపలు శరీరానికి ఉత్త పొషకాల్ని అందిస్తాయి. గుండె జబ్బులను నివారించగల అద్భుత శక్తి చేపలకు ఉంటుంది. చేపల్లో మనకు అవసరమైన ఎనిమిది రకాల అమైనో యాసిడ్లు లభిస్తాయి. అంతేకాదు..చేప నూనెకూడా మనకు ఎంతగానో మేలు చేస్తుందంటున్నారు వైద్య నిపుణులు. అసలు చేప నూనె అంటే ఏమిటి, ఎక్కడనుండి వస్తుంది? అని కొందరికి సహజంగా వచ్చే అనుమానం. చేప నూనె అనేది ఎక్కువ జిడ్డు కలిగిన చేపల కణజాలం నుండి సేకరిస్తారు. ముఖ్యంగా సాల్మన్, వైట్ ఫిష్, హెర్రింగ్, సర్డినెస్ మరియు అన్కోవిస్ అనే చేపల నుండి ఈ చేప నూనెని తీస్తారు. చేప నూనెను వాడకంతో కలిగే పలు రకాల ప్రయోజనాలుః *  చేప నూనెలో విటమిన్ ఎ, డిలతోపాటు 5-10 శాతం ప్రోటీన్లు ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఇందులో పుష్కలంగా దొరుకుతాయి. * ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు.. ఎముక‌లు, దంతాల‌ను దృఢంగా ఉండేలా చేస్తాయి. ఎముక‌ల‌కు బ‌లం చేకూరుతుంది. * గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. యాంటీ ఏజింగ్ గుణాలు చేప నూనెలో అధికంగా ఉంటాయి. దీంతో చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. * మధుమేహం ఉన్న వారు క్రమం తప్పకుండా చేప నూనెను తీసుకుంటే వారి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. * ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. తద్వారా క్యాన్సర్ రాకుండా, పెరగకుండా అడ్డుకోగలదు. * పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో చేప నూనె సమర్థవంతంగా పనిచేస్తుంది. ఫ్యాట్‌ని కరిగించే కణాలు ఇందులో ఉన్నాయి. దీంతో బరువు తగ్గుతారు. * జీర్ణవ్యవస్థను శుభ్రం చేయడంతోపాటు నాడీ వ్యవస్థకు మేలు చేకూరుస్తుంది. వెంటుక్రల పెరుగుదలకు చేప నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. * తలపై చర్మానికి, వెంట్రుకలకు మంచి చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. వెంట్రుకల పెరుగుదలను వేగవంతం చేస్తుంది. * మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుంది. క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు చేప నూనెలో ఉంటాయి. * కండరాల బలహీనతను, అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. సోరియాసిస్‌తో బాధపడుతున్న వారికి చేప నూనె ఎంతో మేలు చేస్తుంది. * చేప నూనె తీసుకోవడం ద్వారా, వ్యాధి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది జలుబు, దగ్గు మరియు ఫ్లూ వంటి కొన్ని సాధారణ వ్యాధులను సైతం ఎదుర్కొనగలదు. * జ్వరం, చర్మ వ్యాధులు, అలసట తగ్గించడంలో కూడా చేప నూనె సహాయపడుతుంది.