Fiber Causes: ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారా..? అయితే, ఆ సమస్యల బారిన పడినట్లే..

|

Aug 07, 2022 | 1:20 PM

సాధారణంగా ఆకలిగా అనిపించినప్పుడు ప్రేగులు మెదడుకు సంకేతాలు ఇస్తాయి. దీంతో అందుబాటులో ఉన్న ఆహారం లేదా ప్యాకెట్ ఫుడ్ ఎక్కువగా తింటారు.

Fiber Causes: ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారా..? అయితే, ఆ సమస్యల బారిన పడినట్లే..
Fiber
Follow us on

Side Effect Of Fiber: డైటీషియన్లు ఎప్పుడూ ఫైబర్ ఎక్కువగా తినమని సలహా ఇస్తారు. ఇలా విన్నప్పుడు ఇది ఎక్కువగా తింటే మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ ప్రతిరోజూ అవసరానికి మించి తీసుకోవడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఆకలిగా అనిపించినప్పుడు ప్రేగులు మెదడుకు సంకేతాలు ఇస్తాయి. దీంతో అందుబాటులో ఉన్న ఆహారం లేదా ప్యాకెట్ ఫుడ్ ఎక్కువగా తింటారు. కానీ మీకు అవసరమైన దానికంటే ఎక్కువ తింటే.. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య మొదలవుతుంది. అయితే ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..

ఫైబర్..

డైటీషియన్ల ప్రకారం.. ఫైబర్ కేవలం ఒక రకమైన కార్బోహైడ్రేట్. ఇది సహజంగా మొక్కల ఆధారిత (పండ్లు, కూరగాయలు) ఆహారాలలో లభిస్తుంది. సాధారణంగా ఫైబర్ పదార్థాలు కాకుండా ఆహారం జీర్ణం అవడం కొంచెం కష్టమే.. కానీ ఇప్పటికీ చాలామంది ప్రజలు అన్నం, రోటి వంటి వాటిని తింటారు. ఈ క్రమంలో ఫైబర్ పదార్థాలు తినడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది. అయితే ఎక్కువగా తీసుకుంటే.. ఇందులో ఉండే పోషకాలు మనకు హానికరం అని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. ఫైబర్ పదార్థాలను మితంగా తినాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రతి ఒక్కరికీ ప్రతిరోజూ 25-30 గ్రాముల ఫైబర్ అవసరం. కానీ అధ్యయనాల ప్రకారం ఎక్కువ ఫైబర్ తీసుకునే వ్యక్తులు గుండె సమస్యలు, ఊబకాయం, టైప్ 2 మధుమేహం, స్ట్రోక్, అధిక రక్తపోటు (రక్తపోటు), జీర్ణ సమస్యలకు ఎక్కువగా గురవుతారు. లేకపోతే.. ఇలాంటి వ్యాధులకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఎక్కువగా ఫైబర్ తీసుకోవడం వల్ల కలిగే ప్రతికూలతలు..

ఏదైనా అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఆహార మార్గదర్శకాలు ఎక్కువ ఫైబర్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి గరిష్ట పరిమితిని చెప్పకపోయినప్పటికీ జాగ్రత్తలు అవసరం అంటున్నారు. ఎక్కువ ఫైబర్ తీసుకోవడం గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. రోజుకు 50 గ్రాముల కంటే ఎక్కువ ఫైబర్ తీసుకుంటే.. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం