Blue Berry: పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..

బెర్రీ జాతికి చెందని పండ్లలో బ్లూబెర్రీలు కూడా ఒకటి. వీటితో పాటు బ్లాక్ స్ట్రాబెర్రీలు, రాస్పెబర్రీలు, బెర్రీలు కూడా ఒకే జాతికి చెందిన పండ్లే. వీటిల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా ఉంటాయి. మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ పండ్లు చాలా ముందుంటాయి. అలాగే జుట్టుకు, చర్మానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. జుట్టు బలంగా, దృఢంగా తయారవుతుంది. అలాగే చర్మంపై మొటిమలు, ముడతలు, గీతలు, వృద్ధాప్యం దరి చేరకుండా ఇవి..

Blue Berry: పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
Blue Berry
Follow us

|

Updated on: Mar 29, 2024 | 7:00 PM

బెర్రీ జాతికి చెందని పండ్లలో బ్లూబెర్రీలు కూడా ఒకటి. వీటితో పాటు బ్లాక్ స్ట్రాబెర్రీలు, రాస్పెబర్రీలు, బెర్రీలు కూడా ఒకే జాతికి చెందిన పండ్లే. వీటిల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా ఉంటాయి. మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ పండ్లు చాలా ముందుంటాయి. అలాగే జుట్టుకు, చర్మానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. జుట్టు బలంగా, దృఢంగా తయారవుతుంది. అలాగే చర్మంపై మొటిమలు, ముడతలు, గీతలు, వృద్ధాప్యం దరి చేరకుండా ఇవి అడ్డుకుంటాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలైన బెర్రీలు తింటే అదుపులోకి వస్తాయి. వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా ఇవి చక్కగా ఉంటాయి. అయితే ఈ పండ్లు పిల్లల ఆరోగ్యాన్ని పెంచడంలో కూడా చక్కగా సహాయ పడతాయి. ముఖ్యంగా వారిలో జ్ఞాపక శక్తిని పెంచుతాయి. పిల్లలు ఇవి తినడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

జ్ఞాపక శక్తి పెరుగుతుంది:

ఏదైనా చదివింది గుర్తు పెట్టుకోవాలంటే.. జ్ఞాపక శక్తి అనేది చాలా అవసరం. అదే విధంగా పిల్లల్లో ఏకాగ్రతను కూడా పెంచుతాయి బ్లూ బెర్రీలు. పిల్లలకు తరచూ ఇవి ఇస్తే.. వారు చాలా యాక్టీవ్‌గా ఉంటారు.

మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది:

మెదడు ఆరోగ్యంగా ఉంచడంలో బెర్రీలు ముఖ్య పాత్ర వహిస్తాయి. బ్రెయిన్ వృద్ధాప్యం బారిన పడకుండా ఉండేలా చేస్తాయి. ఈ బెర్రీస్‌లో న్యూరో ప్రొటెక్టివ్ లక్షణాలు అనేవి ఎక్కువ. ఇవి మెదడులో ప్రవహించే చిన్న రక్త నాళాలను కాపాడతాయి. దీంతో మెదడు ఆరోగ్యంగా, చురుకుగా ఉండేలా చేస్తాయి.

ఇవి కూడా చదవండి

అధ్యయనం ప్రకారం..

పరీక్షల కాలంలో పిల్లలకు చదివింది గుర్తుండటం చాలా ముఖ్యం. బెర్రీస్ తింటే మతిమరపు దరి చేరకుండా ఉంటుంది. అధ్యయనం ప్రకారం.. కొంత మందికి 12 వారాల పాటు ప్రతి రోజూ క్రమం తప్పకుండా బ్లూబెర్రీలను ఇవ్వడం వల్ల.. వారిలో జ్ఞాపక శక్తి అనేది పెరిగినట్టు తేలింది. కాబట్టి పిల్లలకు చిన్నప్పటి నుంచి వీటిని తినిపించడం అలవాటు చేయండి. వీటిని కూడా వారి డైట్‌లో యాడ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. బెర్రీస్ తింటే కేవలం జ్ఞాపక శక్తి, మెదడు ఆరోగ్యమే కాకుండా.. ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా ఇవి కాపాడతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..
అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..
OTTలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?
OTTలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?
తండ్రి కోసం జనాల మధ్య కష్టపడుతున్న చిరుత హీరోయిన్..
తండ్రి కోసం జనాల మధ్య కష్టపడుతున్న చిరుత హీరోయిన్..