Hair Tips: చలికాలంలో జుట్టు సంరక్షణకు ఆరెంజ్ తొక్కలను ఇలా ఉపయోగించాలి.. ఏలాగంటే..
సాధారణంగా చలికాలంలో జుట్టు సమస్యలు మరింత పెరుగుతాయి. జుట్టు చిట్లిపోవడం.. రాలిపోవడం.. డాండ్రఫ్ వంటి సమస్యలు
సాధారణంగా చలికాలంలో జుట్టు సమస్యలు మరింత పెరుగుతాయి. జుట్టు చిట్లిపోవడం.. రాలిపోవడం.. డాండ్రఫ్ వంటి సమస్యలు తీవ్రంగా వేధిస్తుంటాయి. జుట్టు సమస్యలను అధిగమించేందుకు మార్కెట్లో లభించే కెమికల్ ఉత్పత్తులను ఉపయోగించిన ఫలితం శూన్యంగానే ఉంటుంది. అయితే మనకు నిత్యం సహజంగా లభించే పండ్లు.. వాటి తొక్కలతో జుట్టు సమస్యలను అధిగమించవచ్చు. చలికాలంలో ఆరెంజ్ జుట్టుకు ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇందులో విటమిన్ సి, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వలన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆరెంజ్ తొక్కలు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. చలికాలంలో జుట్టు సమస్యలను తగ్గించడంలో ఆరెంజ్ పీల్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందామా.
ఆరెంజ్ పీల్ వాటర్ తయారీ.. నారింజ తొక్కను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఫిల్టర్ చేయాలి. వాటిని ఉడకబెట్టిన సరిపోతుంది. ఆ తర్వాత వాటిని ఫిల్టర్ చేసి ఆ నీటిని పక్కన పెట్టుకోవాలి.
ఎలా ఉపయోగించాలి. 1. నారింజ తొక్కలను రాత్రంతా నానబెట్టి.. ఉదయాన్నే ఫిల్టర్ చేయాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి… ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. ఆ తర్వాత జుట్టుకు వేడి టవల్ చుట్టాలి. 15 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. 2. నారింజ తొక్కలను నీళ్లలో మరిగించి.. ఫిల్టర్ చేసి చల్లారనివ్వాలి. ఆ నీటిలో పచ్చి పాలను కలిపి తలకు పట్టించి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత జుట్టును కడిగి శుభ్రం చేసుకోవాలి. దీంతో జుట్టుకు ప్రోటీన్ లభిస్తుంది. 3. ఒక కప్పు ఆరెంజ్ పీల్ వాటర్, అరకప్పు రోజ్ వాటర్.. ఒక స్పూన్ గ్లిజరిన్ను ఒక స్ర్పే బాటిల్లో వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని ఇంట్లో తయారు చేసిన హెయిర్ స్ర్పేగా ఉపయోగించాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి రాత్రంతా రాత్రంతా వదిలేయ్యాలి. దీంతో జుట్టు పొడిబారడం వంటి సమస్య తగ్గుతుంది
Also Read:Radish Benefits: చలికాలంలో ముల్లంగి తింటే ఈ సమస్యలు తగ్గుతాయి… ప్రయోజనాలు తెలుసుకోండి..
Pumpkin Benefits: బరువు తగ్గించే గుమ్మడి కాయ.. ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..
Milk: ఒరిజినల్ అనుకుంటే మోసపోయినట్టే.. మార్కెట్లో నకిలీ పాలు.. చూస్తే షాక్..