Parenting Tips: ఈతరం తల్లిదండ్రులకు సుధామూర్తి పేరెంటింగ్ చిట్కాలు

Sudha Murthy Parenting Tips: సుధామూర్తి పెరెంటింగ్ చిట్కాలు పిల్లలకు బాధ్యతలు, గౌరవం, ఆస్తి మరియు సరళత నేర్పించడంలో కీలకంగా ఉంటాయి. ఆమె పిల్లలకు డబ్బు విలువ, సొంత బాధ్యతలను తెలుసుకోవడం, వారికి మంచి వ్యక్తిత్వం పెరిగేలా గైడ్ చేస్తారు. ఈ తరం తల్లిదండ్రులకు పేరెంటింగ్‌కు సంబంధించిన చిట్కాలు ఇవిగో..

Parenting Tips: ఈతరం తల్లిదండ్రులకు సుధామూర్తి పేరెంటింగ్ చిట్కాలు
Whatsapp Image 2025 01 11 At 14.42.16
Follow us
Prashanthi V

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 11, 2025 | 3:48 PM

ప్రస్తుత సమాజంలో తమ పిల్లల గురించి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వివిధ రకాలుగా కలలు కంటుంటారు. అయితే ఒక్కోసారి పిల్లలు వీరి కలలకి విరుద్ధంగా ఉంటుంటారు. అయితే ఇక్కడ తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో కన్న కలలు నిజం చేసుకునేందుకు కొన్ని సుధామూర్తి చిట్కాలు మీకోసం తీసుకొచ్చాను. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు ఈ సుధా ముర్తి ఎవరూ?

ఇన్పోసిస్ దిగ్గజం నారాయణమూర్తి భార్య సుధామూర్తి. సుధామూర్తి సామాజిక సేవ చేస్తూ గృహిణిగా, తల్లిగా సమర్ధవంతంగా తన బాధ్యతలను నెరవేర్చారు. సుధామూర్తి నవతరం తల్లిదండ్రులకు ఉపయోగపడే తన పేరెంటింగ్ అనుభవాలు, చిట్కాలు షేర్ చేస్తుంటారు. ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి మంచి రిజల్ట్ ఉంటుంది.

తల్లిదండ్రులను చూసే పిల్లలు నేర్చుకుంటారు

పిల్లలు ఏం నేర్చుకున్న తమ తల్లిదండ్రుల ద్వారానే నేర్చుకుంటారు. వారినే అనుకరిస్తారు కూడా. పిల్లలకు మనం సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవింపబడటానికి అర్హులే అని పిల్లలకు తెలియజేయాలి. చిన్న స్థాయిలో ఉన్న వాళ్లతోనైనా.. పెద్ద స్థాయిలో ఉన్న వారితోనైనా సరే అందర్ని ఒకేలా గౌరవించడం నేర్చించాలి.

పిల్లలకు పాకెట్ మనీ?

ప్రస్తుతం తమ పిల్లలకు తల్లిదండ్రులు పాకెట్ మనీ అని డబ్బులు ఎంతపడితే అంత ఇస్తూ పాడు చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. దీనికి బదులుగా డబ్బు విలువను పిల్లలు తెలుసుకునేలా తల్లిదండ్రులు చూడాలి. మీరు ఒకవేళ ధనవంతులైతే మీ పిల్లలను ఇతరులకు ఎలా సహాయం చేయలి అనేది నేర్పించండి. అలాగే ఆర్థికంగా బాగా మీరు లేకుంటే ఉన్నంతలో ఎలా బ్రతకాలి అనేది మీ పిల్లలకు తెలయజేయండి.

పిల్లలు కోరిందల్ల ఇవ్వకూడదు

ఈ విషయంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులను పిల్లలు చాలా ఇబ్బందులకు గురిచేస్తుంటారు. ఏది పడితే అది అడుగుతుంటారు. ఇలా అడిగినప్పుడు వెంటనే వారి డిమాండ్లను నేరవేర్చకండి. అసలు పిల్లలు అడిగింది వారికి అవసరమా.. కాదా.. అని ఆలోచించి తల్లిదండ్రులు నిర్ణయించుకోవాలి. అవసరం ఉంటేనే అడిగింది ఇవ్వండి. లేకుంటే వారికి అర్ధమయ్యేలా ఎందుకు వద్దు అనేది తెలియజేయండి. ఇలా చేయడం వల్ల పిల్లలు తల్లిదండ్రులను అర్ధం చేసుకుంటారు.

పిల్లలకు విద్యే ఆస్తి

తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యని ఆస్తి కింద బహుమతిగా ఇవ్వండి. విద్య మాత్రమే కాకుండా, జీవన నైపుణ్యాలు మరియు పాటించాల్సిన సాంప్రదాయాలు కూడా నేర్పించండి. మంచిగా చదివితే ఫలితం కూడా గొప్పగా ఉంటుంది. చదవడం వల్ల వినోదం, ఆనందాన్ని ఇస్తాయి. పైగా భాషా నైపుణ్యాలు పెంపొంది.. గొప్ప జ్ఞానం, పఠన శక్తి అలవరచుకునే అవకాశం ఉంటుంది.

పిల్లలకు బాధ్యతలు

పిల్లలకు తమ తల్లిదండ్రులు బాధ్యతగా ఎలా ఉండాలో నేర్పించాలి. అలాగే గౌరవ మర్యాదాలతో ఎలా జీవితంలో పైకి ఎదగాల్లో నేర్పించాలి. ఇలా నేర్పించే తరుణంలో మీరు కొన్ని మీ చుట్టు పక్కల మీ కుటుంబంలో జరిగిన రియల్ స్టోరీలతో పిల్లలకు తెలియజేయాలి. పిల్లలకు తమ వద్ద ఉన్నదానితో సంతృప్తిగా ఉండడం నేర్పించాలి. దానిలోని ఆనందాన్ని ఆస్వాదించేలా చూడాలి. ఈ చిట్కాలను ఆచరించి చూడండి. మీ పిల్లలు మంచి ప్రయోజకులు అవ్వుతారు.