కొరియన్ వెబ్ సీరిస్, కే పాప్ సాంగ్స్ తో ఆదేశానికి చెందిన అమ్మాయిలు, అబ్బాయిలు ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధిగాంచారు. ముఖ్యంగా కొరియన్ అమ్మాయిల అందం అందరిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వీరి చర్మం గాజులా మెరుస్తూ చూపరులకు కనువిందు చేస్తుంది. ఇంకా చెప్పాలంటే కొరియన్ అమ్మాయిల ముఖాల్లో ఒక్క మచ్చ లేదా ముడత కూడా కనిపించదు. దీనికి రహస్యం వారు వాడే బ్యూటీ ప్రొడక్ట్స్‌లో కాదు కొరియన్ అమ్మాయిలు తాగే టీలో దాగి ఉంది. కొరియన్ ప్రజలు తమ సంస్కృతి సంప్రదాయాన్ని బాగా అనుసరిస్తారు. ఎంతగా అంటే కొరియా దేశంలో పురాతన కాలం నుండి తినే ఆహారపు అలవాట్లను తమ భావితరాలకు వారసత్వంగా అందిస్తారు. పెద్దలు ఏమి తింటున్నారో, తినేవారో.. దానినే నేటి తరం కూడా తమ రోజువారీ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటారు.
కొరియన్ మహిళలు తమ చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి బార్లీ టీని తీసుకుంటారు. ఇది కొరియన్ సంస్కృతిలో అంతర్భాగమైన సాధారణ ఆహారపు అలవాటు. ఈ టీని తీసుకోవడం వల్ల చర్మానికి పోషణ, మెరుపుని ఇవ్వడమే కాకుండా చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. బార్లీ గింజలను వేయించి ఈ టీని తయారు చేస్తారు. ఈ టీలో పోషకాలుంటాయి. అంతేకాదు మంచి రుచికరమైనది. ఈ టీని వేడిగా లేదా చల్లగా తాగుతారు. ప్రతి కొరియన్ కుటుంబానికి ఈ టీ తయారీ విషయంలో సొంత రెసిపీ ఉంటుంది. అయితే మీరు డబ్బు ఖర్చు లేకుండా కొరియన్ అమ్మాయిల వలె అందంగా , యవ్వనంగా కనిపించాలనుకుంటే.. ఈ రోజు నుండే మీ ఆహారంలో బార్లీ టీ ని చేర్చుకోండి.
బార్లీ గింజలు- వేయించినవి 1 కప్పు
నీరు – 4 నుంచి 6 కప్పులు
తయారీ విధానం: ముందుగా స్టౌ వెలిగించి స్టవ్ మీద శుభ్రమైన పాన్ పెట్టి.. అందులో బార్లీ గింజలను వేసి మీడియం మంట మీద సుమారు 5-7 నిమిషాలు వేయించండి. ఈ గింజలు బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి. అప్పుడు ఈ బార్లీ గింజల నుండి మంచి సువాసన రావడం ప్రారంభమవుతుంది.
ఇప్పుడు ఒక పాత్రలో నీటిని తీసుకుని వేడి చేయండి.
ఈ వేడి నీటిలో ముందుగా వేయించిన బార్లీ గింజలను జోడించండి.
ఇప్పుడు స్టవ్ మంట స్విమ్ లో పెట్టి 15-20 నిమిషాలు ఉడకనివ్వండి.
ఈ బార్లీ వాటర్ టీని కేటిల్‌లో వడకట్టండి.
మీ ఎంపిక ప్రకారం దీన్ని వేడి లేదా చల్లగా.. తీపి ఇష్టం అయితే పంచదార లేదా తేనే వేసుకుని సర్వ్ చేయండి.
1. ఫేస్ టోనర్: ఒక కప్పు బార్లీ టీని తయారు చేయండి. తరువాత దానిని చల్లబరచండి. ఆపై ఈ నీటిని చర్మంపై టోనర్‌గా ఉపయోగించండి.
2. ఐస్ క్యూబ్స్: బార్లీ టీ తయారు చేసి ఈ వాటర్ ను ఐస్ క్యూబ్స్ గా చేయడానికి ట్రే లో వేయండి. ఇప్పుడు ఫ్రీజ్ లో పెట్టండి. కొంత సేపటికి ఈ బార్లీ టీ గడ్డకట్టి ఐస్ క్యూబ్స్ గా మారుతుంది. అప్పుడు వీటిని తీసుకుని మీ చర్మంపై అప్లై చేసి నెమ్మదిగా మసాజ్ చేయండి.
బార్లీ టీతో జుట్టు: జుట్టుకు మెరుపును తీసుకురావడానికి చల్లని బార్లీ టీ మంచి ఎంపిక. ఈ బార్లీ టీని తీసుకుని జుట్టును శుభ్రపరచుకోవాలి. ఇలా చేయడం వలన జుట్టుకు షైన్ వస్తుంది. అంతేకాదు జుట్టుకు మందంగా తయారవుతుంది.
ఆరోగ్యకరమైన శరీరం కావాలంటే.. చర్మం ఎప్పుడు తేమతో నిండి ఉండి నీటి కొరత లేకుండా ఉండాలి. బార్లీ టీ చర్మాన్ని బాగా హైడ్రేట్ గా ఉంచడానికి సహజమైన మార్గం. ఈ టీలో అధిక మొత్తంలో నీరు ఉంటుంది, ఇది మీ చర్మం తేమ సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. పొడిగా ఉంటె తత్వాన్ని తొలగించి చర్మానికి, ముఖానికి మెరుపును తెస్తుంది.
బార్లీ టీలో క్వెర్సెటిన్, కాటెచిన్‌లతో సహా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, మీ చర్మాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో సహాయపడతాయి. అంటే మీ ముఖంపై ముడతలు లేదా గీతలు కనిపించవు. మీరు కూడా కొరియన్ అమ్మాయిల వలె యవ్వనంగా ఉంటారు.
ముఖం ఆరోగ్యానికి చిహ్నం.. శుభ్రమైన , మెరిసే ముఖం ద్వారా ఆరోగ్యకరమైన శరీరం ఉందని తెలుసుకుంటారు. బార్లీ టీ శరీరంలోని సిస్టమ్‌ను నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. ఇది టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. స్పష్టమైన, మచ్చలు లేని ఛాయను అందిస్తుంది.
జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే.. దీని స్పష్టమైన ప్రభావం చర్మంపై కూడా కనిపిస్తుంది. బార్లీ టీ జీర్ణ సమస్యలను నయం చేస్తుంది, తద్వారా పేలవమైన జీర్ణక్రియ వల్ల మొటిమలు, విరేచనాలు, చర్మ సమస్యలు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. నిత్యం ఈ బార్లీ టీ తాగితే చర్మానికి ఎటువంటి క్రీమ్ లేదా లోషన్ రాసుకోవాల్సిన అవసరం ఉండదు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..