Skin Care Tips: చలికాలంలో బేకింగ్ సోడాతో చర్మ సమస్యలకు చెక్.. ఇలా ఉపయోగిస్తే చాలు..

బేకింగ్ సోడాను సాధారణంగా వంటకాలలో ఉపయోగిస్తుంటారు. అలాగే పిండివంటలు చేస్తున్నప్పుడు బేకింగ్ సోడాను తప్పకుండా

Skin Care Tips: చలికాలంలో బేకింగ్ సోడాతో చర్మ సమస్యలకు చెక్.. ఇలా ఉపయోగిస్తే చాలు..
Baking Soda
Follow us

|

Updated on: Dec 02, 2021 | 4:16 PM

బేకింగ్ సోడాను సాధారణంగా వంటకాలలో ఉపయోగిస్తుంటారు. అలాగే పిండివంటలు చేస్తున్నప్పుడు బేకింగ్ సోడాను తప్పకుండా వాడుతుంటారు. కేవలం వంటకాలకు మాత్రమే కాకుండా చర్మ సమస్యలను తగ్గించడానికి కూడా బేకింగ్ సోడా ఎక్కువగా ఉపయోగడుతుంది. ముఖ్యంగా చలికాలంలో వచ్చే చర్మ సమస్యలను తగ్గించడంలోనూ బేకింగ్ సోడా సహయపడుతుంది. ఇది చర్మానికి పోషణతోపాటు… స్క్రిబ్బింగ్ కోసం కూడా ఉపయోగిస్తారు. అయితే చలికాలంలో ఈ బేకింగ్ సోడాను సరైన విధంగా ఉపయోగించకపోతే చర్మ సమస్యలు తగ్గకుండా .. చర్మం మరింత పొడిబారుతుంది. అందుకే ఈ సీజన్లో బేకింగ్ సోడా ఉపయోగించే ముందు కొన్ని చిట్కాలను తెలుసుకోవాలి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందామా.

బేకింగ్ సోడా ఉపయోగాలు.. 1. బేకింగ్ సోడా.. గ్రైనీ ఆకృతి ఎక్స్‏ఫోలియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎక్స్‏ఫోలియేట్ చర్మ రంధ్రాలను తెరచుకోవడమే కాకుండా.. బ్లాక్ హెడ్స్ సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా మొటిమల సమస్యను నియంత్రిస్తుంది. 2. అలాగే ఇందులో యాంటీ ఇన్‏ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మపు చికాకు, దద్దర్లు, వాపు వంటి సమస్యలను తగ్గిస్తాయి. అంతేకాకుండా బ్రేక్ అవుట్స్ సమస్యను తగ్గిస్తుంది. 3. చర్మం ph స్థాయి సాధారణంగా 4.5 నుంచి 5.5 మధ్య ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉండేలా చేస్తుంది. అలాగే చర్మాన్ని బ్యాక్టీరియా, కాలుష్యం నుంచి రక్షిస్తుంది. అలాగే చర్మం ఆమ్లంగా ఉండి..చర్మంలోని సహజ నూనెల కారణంగా మొటిమలు ఏర్పడతాయి. బేకింగ్ సోడాను ముఖానికి ఉపయోగించినప్పుడు ఇది న్యూట్రలైజర్ గా పనిచేస్తుంది. అలాగే చర్మం ph స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

బేకింగ్ సోడా ఎలా ఉపయోగించాలంటే.. ఒక గిన్నెలో 1 లేదా 2 టీస్పూన్ల బేకింగ్ సోడా తీసుకుని, కాసిన్ని నీళ్లు కలిపి పేస్ట్ మాదిరిగా చేయాలి. ఆ తర్వాత దానిని చర్మం పై ఉన్న మచ్చలు.. గుర్తులపై రాయాలి. అయితే ఈ మిశ్రమాన్ని ముఖంపై ఎప్పుడైనా ఫేస్ మాస్కు మాదిరిగా అప్లై చేయకూడదు. మచ్చలపై బేకింగ్ సోడాను అప్లై చేసి 10 నిమిషాలు అలగే ఉంచి.. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. ఈ ప్రక్రియను వారానికి ఒకసారి చేయాలి. దీనిని ఎక్కువగా చేస్తే చర్మం పొడిబారిపోతుంది. అలగే జిడ్డు చర్మం, సున్నితమైన చర్మం ఉన్నవారు బేకింగ్ సోడాను ఉపయోగించవద్దు. బేకింగ్ సోడాను ఎక్కువ పరిమాణంలో ఉపయోగించవద్దు.

Also Read: Sara Ali khan: సింగర్ శ్రేయా ఘోషల్‏కు క్షమాపణలు చెప్పిన స్టార్ హీరోయిన్.. ఎందుకంటే..

Priyanka Chopra: భర్తను హీరోగా పరిచయం చేయాలనుకుంటున్న గ్లోబల్ స్టార్.. భారీ ప్లాన్ చేస్తోన్న ప్రియాంక ?..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో