Kanjivaram Sarees: కంజీవరం చీర నిజమైనదో లేదా నకిలీదో ఇలా గుర్తించండి.. చాలా సింపుల్..
Pure and Original Kanjivaram Sarees: కంజీవరం పట్టు చీరలు సహజమైన మెరుపును కలిగి ఉంటాయి. ఇది వాటి ప్రాథమిక లక్షణాలలో ఒకటి. కంజీవరం సిల్క్ చీరను సూర్యకాంతిలో బయటకు తీసి వివిధ కోణాల్లో పరిశీలించి చీర ఎలా మెరుస్తుందో గమనించండి. కంజీవరం పట్టు చీరకు మెరుపు లేకపోయినా.. సూర్యకాంతిలో నిస్తేజంగా ఉంటే అది నకిలీదే.

కట్టు, బొట్టు అంటే భారతీయత. అన్ని శుభకార్యాలకు, పండుగలకు ఎక్కువగా పట్టుచీరలు ధరించడానికి ఇష్టపడతారు భారతయ మహిళలు. అది ఎలాంటి శుభకార్యం అయినా పట్టు చీరతో మెరిసిపోవాల్సిందే. భారతీయ సంప్రదాయంలో పట్టు చీరకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పండగకీ, పెళ్ళికీ తళతళలాడే పట్టు చీరలు ఉండాల్సిందే. ఇప్పుడు కొత్తగా వర్క్ చీరల ఫ్యాషన్ వచ్చినా పట్టు చీరకు ఉండే స్థాయి విడిగా ఉంటుంది.
ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ చాలా మారుతోంది. కంజీవరం చీర కట్టు మీ అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. ఇవి చాలా ప్రత్యేక సిల్క్ ఫాబ్రిక్‌తో తయారు చేస్తారు. తక్కువ బరువు, ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ధరించడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అనేక డిజైన్లు, ఆకర్షణీయమైన రంగులతో కూడిన కంజీవరం చీరలు వస్తున్నాయి. ధర కూడా అందుబాటులో ఉంటంతో మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
మహిళామణులు మెచ్చిన..
చేనేత చీరల్లో కంజీవరం చీరలు స్త్రీకి నచ్చుతాయి. చాలా మంది నటీమణులు ప్రత్యేక సందర్భాలలో కూడా కంజీవరం చీరలు ధరించి మెరిసిపోతారు. ఈ చీరలు చేతివృత్తుల వారి శ్రమతో తయారు చేయబడ్డాయి. చాలా ఖరీదైనవి కూడా. మీరు కంజీవరం చీరను కొనుగోలు చేసినా లేదా కొనాలనుకున్నా.. మీరు దాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా చేనేత చీరలు మార్కెట్లోకి వస్తున్నాయి.
కంజీవరం చీర దాని చరిత్ర.. చాలా ప్రత్యేకమైనది. ప్రత్యేక దారాలతో కంజీవరం చీరను నేస్తారు. పండుగ అయినా లేదా ఏదైనా వివాహ వేడుక అయినా.. మీరు కంజీవరం చీరలో రిచ్ లుక్ పొందుతారు. కొన్ని సాధారణ విషయాలతో మీరు నిజమైన, నకిలీ కంజీవరం చీరల మధ్య తేడాను ఎలా గుర్తించవచ్చో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు.
అసలు కంజీవరం చీర
నిజమైన కంజీవరం పట్టును గుర్తించడానికి, నిపుణుల కన్ను కలిగి ఉండటం చాలా ముఖ్యం. నిజమైన కంజీవరం చీరలలో మంచి నాణ్యత గల అసలైన పట్టును ఉపయోగిస్తారు. ధాన్యపు ఆకృతిని కలిగి ఉన్న దాని మీద చేనేత పని ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాకడం ద్వారా మీరు ఒరిజినల్.. నకిలీ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవచ్చు.. గుర్తించవచ్చు.
పనిలో ..
అసలు కంజీవరం చీరకు ప్రత్యేకమైన మెరుపు ఉంటుంది. చేనేత పని చాలా సున్నితంగా ఉంటుంది. కంజీవరం చీరలు ఆకర్షణీయమైన రంగులు, మెరుపు, చక్కటి పని కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఒరిజినల్ కంజీవరం చీరలో చాలా చక్కటి జరీ వర్క్ కనిపిస్తుంది. ఈ చీరలో మొఘల్ ప్రేరేపిత డిజైన్లు కనిపిస్తాయి.
దారం పోగులతో ఒరిజినల్‌ను..
మీరు దాని చీరలో ఉపయోగించిన పోగులు తేలికగా.. ఎర్రటి పట్టు బయటకు వస్తే మీ కంజీవరం చీర నిజమైనదని అర్థం చేసుకోండి. నకిలీ కంజీవరం చీరల్లో తెల్లటి రంగు దారాలు కనిపించవచ్చు.
ఇది కూడా చేయవచ్చు
ఈ పరీక్షను షాప్‌లో చేయలేము.. కానీ మీకు కంజీవరం చీర ఉంటే.. అది నిజమో, నకిలీదో చూడాలనుకుంటే.. ఆ చీరలోని కొన్ని దారాలను సేకరించి, ఒక గుత్తిని తయారు చేయండి. దీని తరువాత, జాగ్రత్తగా బయటకు తీసుకుని వెళ్లి కాల్చండి. మంట కనిపించిన వెంటనే దాన్ని చల్లార్చడానికి ప్రయత్నించండి. అది కాలుతున్నప్పుడు గంధకం లాంటి వాసన వచ్చి.. దారాలు బూడిదగా మారితే అది నిజమైన కంజీవరం గుర్తింపుగా పరిగణించబడుతుంది. నకిలీ చీరలోని దారాలు ముద్దగా మారుతాయి.
చీర బరువు..
- స్వచ్ఛమైన కంజీవరం పట్టు చీరలు బంగారు దారం కారణంగా సాధారణ పట్టు చీరల కంటే భారీగా ఉంటాయి.
- చీర బరువు అంతటా సమానంగా ఉంటుంది.
రింగ్ టెస్ట్..
కంజీవరం సిల్క్ చీరలు మల్బరీ సిల్క్‌తో తయారు చేయబడతాయి. ఇవి సహజంగా మృదువైనవి.. రింగుల ద్వారా సులభంగా జారిపోతాయి. రింగ్ పరీక్షలు చాలా సులభం, కంజీవరం పట్టు చీర ప్రామాణికతను గుర్తించడంలో మీకు సహాయపడతాయి. మరీ చిన్నది కాని ఒక ఉంగరాన్ని తీసుకుని, దాని గుండా కంజీవరం చీరను వెళ్లనివ్వండి. చీర సులభంగా ఉంగరం గుండా వెళితే అది అసలు కంజీవరం చీర అని మీరు నిశ్చయించుకోవచ్చు.
మరిన్ని ఫ్యాషన్ న్యూస్ కోసం