Fashion Tips: చెప్పులకు కొనేటప్పుడు ఈ తప్పులను అస్సలు చేయకండి!

| Edited By: Ravi Kiran

Oct 18, 2023 | 8:00 AM

మన జీవితంలో చెప్పులు కీ రోల్ పోషిస్తాయి. ఎక్కడికి వెళ్లాలన్నా చొప్పులతోనే వెళ్లాలి. ఈ క్రమంలోనే చెప్పులు కొనేటప్పుడు కొన్ని ముఖ్య విషయాలు గుర్తించు కోవాలి. లేదంటే ఆ తర్వాత పలు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదేంటి? చొప్పులతో ఇబ్బందులు ఏముంటాయి అనుకుంటున్నారా.. అవును సరైన చొప్పులు లేకుంటే దీర్ఘకాలంలో ఆర్థరైటీస్ వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే రోజువారీ మన జీవితంలో చెప్పులు కీ రోల్ పోషిస్తాయి. సరైన చొప్పులు ఎన్నుకుంటే మంచి..

Fashion Tips: చెప్పులకు కొనేటప్పుడు ఈ తప్పులను అస్సలు చేయకండి!
Footwere
Follow us on

మన జీవితంలో చెప్పులు కీ రోల్ పోషిస్తాయి. ఎక్కడికి వెళ్లాలన్నా చొప్పులతోనే వెళ్లాలి. ఈ క్రమంలోనే చెప్పులు కొనేటప్పుడు కొన్ని ముఖ్య విషయాలు గుర్తించు కోవాలి. లేదంటే ఆ తర్వాత పలు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదేంటి? చొప్పులతో ఇబ్బందులు ఏముంటాయి అనుకుంటున్నారా.. అవును సరైన చొప్పులు లేకుంటే దీర్ఘకాలంలో ఆర్థరైటీస్ వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే రోజువారీ మన జీవితంలో చెప్పులు కీ రోల్ పోషిస్తాయి. సరైన చొప్పులు ఎన్నుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. చొప్పులను కొనేటప్పుడు కూడా కొన్ని చిట్కాలు పాటించాలి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్వాలిటీ ఇంపార్టెంట్:

ఏదో చెప్పులు వేసుకుంటున్నాం కదా అని చవకైనవి తీసుకోకూడదు. ఇవి చాలా హార్డ్ గా ఉంటాయి. కాబట్టి చొప్పులు కొనేటప్పుడు మంచి క్వాలిటీ ఇంపార్టెంట్. అలాగే పెట్టే డబ్బులకు సరిపడా క్వాలిటీ వస్తుందా లేదా? ఎన్ని రోజుల వరకూ వస్తాయన్న అంచనా వేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఫ్యాషన్ కి సెట్ అయ్యేలా తీసుకోవాలి:

ఎప్పుడైనా చొప్పులు తీసుకునే ముందు ప్రజెంట్ జనరేషన్ లో ఉన్న ఫ్యాషన్ కి సరిపడా చొప్పులను తీసుకోవాలి. మీరు వేసుకునే చొప్పుల బట్టే మీ ఫ్యాషన్ ఎలాంటిదో చెప్పవచ్చు. వాటిల్లో కూడా మీకు ఇష్టమైన రంగులు, డిజైన్స్ కూడా ఎంచుకోవాలి.

మ్యాచింగ్స్ తీసుకోవాలి:

మీరు చొప్పులు కొనే ముందు మీరు వేసుకునే బట్టల విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. వాటిని బట్టి చొప్పులను సెలక్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. వైట్ అండ్ బ్లాక్, క్రీమ్ వంటివి తీసుకుంటే ఎలాంటి డ్రెస్ లకైనా ఈజీగా మ్యాచింగ్ అవుతాయి.

సాఫ్ట్ గా ఉండేవి తీసుకోవాలి:

చొప్పులను తీసుకునే ముందు హార్డ్ గా ఉండేవి కాకుండా.. కాస్త సాఫ్ట్ గా ఉంటే మన హెల్త్ కి కూడా చాలా మంచిది. హార్డ్ గా ఉండే చొప్పులను వేసుకుంటే మడమల నొప్పులు, కాళ్ల నొప్పులు, వాపులు వంటికి వస్తూంటాయి. కాబట్టి పాదాలకు మెత్తగా ఉన్నవే తీసుకోవాలి.

సందర్భాన్ని బట్టి కొనాలి:

కొన్ని రకాల చొప్పులను డైలీ వేర్ యూజ్ చేస్తే బాగోవు. కాబట్టి డైలీ వేర్ వి సపరేట్ గా, ఫంక్షన్స్ లాంటి వాటికి వేరేవి తీసుకుంటూ ఉండాలి. అలాగే మనం ఎక్కువ సేపు నలబడడం, కూర్చోవడం వంటికి చేస్తూంటారు కాబట్టి.. వాటికి తగ్గట్టుగా తీసుకుంటే హెల్త్ కూడా బావుంటుంది.

కంఫర్ట్ ఇంపార్టెంట్:

మీరు తీసుకునే చొప్పుల్లో కంఫర్ట్ చాలా ముఖ్యం. లేకుంటే మీరు నడిచినా, కూర్చున్నా ఏదో ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కంఫర్ట్ గా ఉన్న చొప్పులనే ఎంచుకోండి. మీ పాదాలకు ఫిట్ గా ఉన్నాయో లేవో చూసుకుని కొనాలి. కంఫర్ట్ గా ఉన్న చొప్పులను యూజ్ చేస్తే పాదాలపై ఒత్తిడి పెరగదు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.